
మేషం - పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకుంచారు.
వృషభం - ఆదాయ వ్యయాలు మీ బడ్జెట్‌కు తగ్గట్టుగా ఉంటాయి. కీలకమైన వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. మీ మాటకు కుటుంబంలో గౌరవం లభిస్తుంది.
మిథునం - గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో లాభాలు, అనుభవం గడిస్తారు. ప్రముఖుల కలయిక సాధ్యం కాదు. విజయాలు తేలికగా సొంతమవుతాయి. కెరీర్ బాగుంటుంది.
కర్కాటకం - ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. పాత మిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. సంతాన విషయంలో సంజాయిషీలు ఇచ్చుకోవలసివస్తుంది.
సింహం - విదేశీయానంకోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. సోదరీ సోదరుల నుంచి చికాకులు తప్పవు. శత్రువులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు.
కన్య - స్త్రీలు నరాలు, ఉదరానికి సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. ఎల్ఐసి పోస్టల్, ఇళ్ళ స్థలాల బ్రోకర్లకు, ఏజెంట్లకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగస్తులకు తోటివారు అన్నివిధాలా సహకరిస్తారు.
తుల - స్త్రీలకు పరియాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ఆర్థికంగా అభివృద్ధి కాన వచ్చినా మానసిక ప్రశాంతత ఉండజాలదు. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి.
వృశ్చికం - బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసివస్తుంది. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. స్పెక్యులేషన్ రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది.
ధనస్సు - ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. నూతన పరిచయాలేర్పడతాయి.
మకరం - అనుకోకుండా ఒక చిన్నారితో విడదీయరాని బంధం ఏర్పడుతుంది. మీ ఆలోచనలు, పథకాలు కార్యరూపం దాల్చుతాయి. నిర్మాణ పనులలో పనివారలతో సమస్యలు తలెత్తుతాయి. రుణం ఏ కొంతైనా తీర్చాలనే మీ సంకల్పం నెరవేరగలదు.
కుంభం - పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. ఎదుటివారితో వితండ వాదనలు, అనవసర ప్రసంగాలు చేయడం మంచిది కాదని గమనించండి. బంధువుల రాకతో సందడి కానవస్తుంది.
మీనం - విద్యార్థులు ఉన్నత విద్యలకోసం విదేశాలు వెళ్ళేందుకు మార్గం సుగమమవుతుంది. మిమ్మల్ని తక్కువ అంచనా వేసేవారు మీ సహాయాన్ని అర్ధిస్తారు. నిర్మాణ పథకాల్లో సంతృప్తి కానరాగలదు.












