వార ఫలాలు: సోమ - ఆది, మే 14 - 20, 2012

Horoscope Weakly Predictions Aid0108


మేషం - వృత్తి, ఉద్యోగ బాధ్యతల పట్ల శ్రద్ధ వహిస్తారు. మీ పనులు, కార్యకలాపాలు ప్రశాంతంగా సాగుతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. గృహ అవసరాలకు ధనం బాగా వెచ్చిస్తారు.

వృషభం - కార్యసాధనలో ఆటంకాలెదురైనా పట్టుదలతో శ్రమిస్తారు. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. ఉద్యోగ యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. రిటైర్డు ఉద్యోగస్తులకు అధికారులు, సహోద్యోగులు సాదర వీడ్కోలు పలుకుతారు.

మిథునం - మీ మాటతీరు, పద్ధతులు ఎదుటివారిని బాగా ఆకట్టుకుంటాయి. క్లిష్టమైన సమస్యలను తేలికగా పరిష్కరిస్తారు. విలాసాలకు ధనం బాగా వ్యయం చేస్తారు. బాకీల వసూలుకు బాగా శ్రమించాలి. స్త్రీల పేరిట ఒక స్థిరాస్తి కొనుగోలు చేస్తారు.

కర్కాటకం - రాబడి పెంచుకునే దిశగా యత్నాలు సాగిస్తారు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. మీ శ్రీమతి, సంతానం గొంతెమ్మ కోరికలు చికాకు పరుస్తాయి.

సింహం - ఇంటా, బయటా మీ ఆధిపత్యం కొనసాగుతుంది. దాంపత్య సౌఖ్యం, మానసిక ప్రశాంతత పొందుతారు. తలపెట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి కాగలవు. ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. అయిన వారు, బంధువులను కలుసుకుంటారు. ఊహించని పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది.

కన్య - మంచి చేసినా విమర్శలు, నిందలు తప్పవు. ఒక మంచి చేశామన్న భావం సంతోషం కలిగిస్తుంది. ఆదాయ వ్యయాలు మీ బడ్జెట్‌కు అనుగుణంగా ఉంటాయి. ఖర్చులు పెరిగినా ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. తలపెట్టిన పనుల్లో ఒత్తిడి, ఆటంకాలు ఎదుర్కొంటారు.

తుల - సభలు, సమావేశాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. ఆర్థిక, కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. బకాయిల వసూలుకు బాగా కష్టపడాలి. ఏ పని తలపెట్టినా మొదటికే వస్తుంది. మనస్థిమితం అంతగా ఉండదు. ఆపద సమయంలో ఆత్మీయులు ఆసరాగ నిలుస్తారు.

వృశ్చికం - ముఖ్యమైన వ్యవహారాలు, సంప్రదింపులకు అనుకూలం. ఆర్థికస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. మీ పథకాలు, ప్రణాళికలు కార్యరూపం దాల్చుతాయి. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. మీ శ్రీమతి, సంతానం వైఖరి చికాకుపరుస్తుంది. ఒక స్థిరాస్తి విక్రయానికి అడ్డంకులు తొలగిపోగలవు.

ధనస్సు - పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. ఆశలొదిలేసుకున్న బాకీలు వసూలు కాగలవు. మీ వ్యవహార దక్షత, నిజాయితీలకు ప్రశంసలు లభిస్తాయి. ఆత్మీయులకిచ్చిన మాట నిలబెట్టుకుంటారు. మీ కార్యక్రమాలు, పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది.

మకరం - భూమి, గృహ క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు, ఒప్పందాల్లో సముచిత నిర్ణయం తీసుకుంటారు. మీ అభిప్రాయాల వ్యక్తీకరణకు సందర్భం కలిసివస్తుంది. లౌక్యంగా వ్యవహరించి మీ పనులు చక్కబెట్టుకోవాలి. ఒక సంఘటన తీవ్రంగా ఆలోచింపజేస్తుంది.

కుంభం - ఆదాయ వ్యయాలు సంతృప్తికరం, విలాసాలు, వినోదాల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. దంపతుల మధ్య దూరపు బంధువుల ప్రస్తావన వస్తుంది. మీ సంతానం ఉన్నత చదువులపై దృష్టి సారిస్తారు. ఒత్తిళ్లు, మొహమ్మాటాలు ఇరకాటానికి గురిచేస్తాయి.

మీనం - మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యవహార జయం, ధనలాభం వంటి శుభఫలితాలున్నాయి. సొంత వ్యయంతో ప్రముఖులకు సన్మానాలు జరిపిస్తారు. సంఘంలో మీ గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. శ్రమాధిక్యత, అకాల భోజనం వల్ల అస్వస్థతకు గురవుతారు.

User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .