For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముఖంలో మొటిమలు పోవాలంటే సింపుల్ టిప్స్ !

By Staff
|

సాధారణంగా అన్ని వయస్సుల వారిలో వచ్చే సాధారణ చర్మ సమస్యగా మొటిమలను చెప్పవచ్చు. మొటిమలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే అసలు కారణం చాలా సాధారణంగా ఉంటుంది. వెంట్రుక కుదుళ్లలలో ఉండే తైల గ్రంధులు విస్తరించినప్పుడు అదనపు సిబం మరియు మృత చర్మకణాలు అడ్డుపడినప్పుడు మొటిమ అభివృద్ధి జరుగుతుంది.

వెంట్రుక కుదుల్ల రంద్రాలు మూసుకుపోవడము వలనో,బయటి సూక్ష్మజీవుల (ప్రొపియోనిబాక్టీరియమ్) వలనో రావటానికి అవకాశం ఉన్నది. సాదారణంగా బాక్టీరియా ఇన్ఫెక్షన్ వలన వచ్చే మొటిమ నొప్పి ఉండవచ్చు. ఆ మొటిమ "యాంగ్రీ - రెడ్" మరియు ఉబ్బినట్టుగా ఉండే రూపాన్ని కలిగి ఉంటుంది.

20 best ways to treat pimples in Telugu

టీనేజర్లలో మొటిమలు రావటం అనేది సర్వ సాధారణంగా కనిపిస్తుంది. మగవారు మరియు ఆడవారు ఇద్దరిలోను అధిక ఆండ్రోజెన్ హార్మోన్లు ఉత్పత్తి, టెస్టోస్టెరాన్,డైహైడ్రోటెస్టోస్టెరోన్ (DHT) మరియు డి హైడ్రో ఎపింద్రోస్తేరోనే సల్ఫేట్ కారణంగా మొటిమలు వస్తాయి. ఈ హార్మోన్లు సేబాషియస్ గ్రంథుల ద్వారా సిబం మరియు ఒక ఎత్తైన ఉబ్బుకు కారణం అవుతాయి.

ఇక్కడ మొటిమల నుండి మీ అందానికి కాపాడటానికి 20 ఉత్తమ పద్ధతులు ఉన్నాయి.

1. మీ చర్మం పట్ల శ్రద్ధ తీసుకోవాలి

1. మీ చర్మం పట్ల శ్రద్ధ తీసుకోవాలి

మీ చర్మం మృత బాహ్యచర్మం మరియు తేమగా ఉండటానికి శుభ్రపరచాలి. మీ ముఖంను శుభ్రపరచిన తర్వాత తేమగా ఉండటానికి ప్రతి రోజు మీ ముఖాన్ని శుభ్రపరచడానికి వేప నీటిని వాడండి. ఒక వారంలో ఒకసారి లేదా రెండుసార్లు మీ వ్యక్తిగత అవసరాలకు లోబడి చేయండి.

2. బేకింగ్ సోడా

2. బేకింగ్ సోడా

బేకింగ్ సోడా మరియు నీటిని కలపండి. ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతంలో రాసి 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. చర్మం చికాకు లేదా అధిక ఆయిలీగా ఉన్నప్పుడు మాత్రం రోజులో రెండుసార్లు రిపీట్ చేయవచ్చు.

3. నిమ్మరసం

3. నిమ్మరసం

ఒక నిమ్మ పండు తీసుకోని సగానికి కట్ చేయాలి. ఆ కట్ చేసిన ముక్కతో మోటిమలు యొక్క ఉపరితలంపై రుద్దాలి. ఒక సలుపు అనుభూతిని ఉంటే ఆందోళన పడకండి. ఎందుకంటే ఇది పనిచేస్తుంది అనే దానికి ఒక సంకేతంగా భావించాలి.నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉండుట వలన మోటిమల కారక బాక్టీరియాను చంపుతుంది. తరువాత నిమ్మరసంను పూర్తిగా కడగాలి. బయటకు వెళ్ళే ముందు సన్ స్క్రీన్ రాయాలి. ఎందుకంటే సిట్రిక్ యాసిడ్ సూర్యుడు వల్ల జరిగే నష్టాన్ని అధికం చేస్తుంది.

4. పచ్చి బంగాళాదుంప

4. పచ్చి బంగాళాదుంప

ముఖం యొక్క ప్రభావిత ప్రాంతం పైన బంగాళదుంపలు స్లయిస్ ఉంచాలి. బంగాళాదుంప యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉండుట వలన నయం చేయుటలో సహాయపడుతుంది. 5-10 నిమిషాల తర్వాత బంగాళాదుంప స్లయిస్ తీసివేసి సాధారణ నీటితో శుభ్రం చేయాలి.

5. టీ చెట్టు నూనె

5. టీ చెట్టు నూనె

టీ చెట్టు నూనె ఒక మంచి యాంటీ బాక్టీరియల్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇది ఏ దుష్ప్రభావాలు లేకుండా మోటిమల మచ్చలు తొలగిస్తుంది. దీని ఉపయోగాల కోసం లేబుల్ మీద ఉన్న సూచనలు చదవండి.

6. ఆస్ప్రిన్

6. ఆస్ప్రిన్

రెండు ఆస్పిరిన్ మాత్రలు తీసుకోని పొడి చేసి నీటితో కలపాలి. దానిని ప్రభావిత ప్రాంతంపై రాయాలి. మోటిమలు కలిగించే బాక్టీరియాపై ఆస్పిరిన్ సమర్థవంతంగా పోరాడుతుంది. ఆస్ప్రిన్ బాధా నివారక లవణాలు గల యాసిడ్ ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా మోటిమలు తొందరగా మానునట్లు చేస్తుంది.

7. పటిక

7. పటిక

ఒక సహజ రక్తస్రావ నివారిణి మరియు క్రిమినాశకంగా పనిచేస్తుంది. పటిక మీ మోటిమల మీద సమర్థవంతంగా పని చేస్తుంది. మొటిమల మీద పటికను రాయాలి. మోటిమలను వేగవంతంగా పెరగకుండా నివారిస్తుంది.

8. ఆపిల్ సైడర్ వెనిగర్

8. ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ సైడర్ వెనిగర్ మృత చర్మ కణాలు అదే విధంగా స్పష్టంగా మోటిమలు నాశనం చేస్తాయి. ఆపిల్ సైడర్ వెనిగర్ చాలా తక్కువగా వాడాలి. ఎక్కువగా వాడితే చర్మంనకు హాని కలిగిస్తాయి. మీ ముఖం మీద నీటిలో కలిపిన ఆపిల్ సైడర్ వెనిగర్ ను రాసి 10 నిమిషాల తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేయలి.

9. టూత్ పేస్టు

9. టూత్ పేస్టు

మీ ముఖం మీద టూత్పేస్ట్? మేము తమాషా చేయటం లేదు.టూత్ పేస్టు సిలికా కలిగి ఉంటుంది.ఇది తేమను దూరంగా ఉంచటానికి సహాయపడుతుంది. దీని ప్రభావం వలన మోటిమలు తగ్గిపోతాయి. సోడియం లారిల్ సల్ఫేట్ (SLS) ఉన్న టూత్ పేస్టు వాడటం మానుకోండి. ఇది మీ చర్మంనకు చాలా కఠినముగా ఉండవచ్చు.

10. ఐస్

10. ఐస్

ఐస్ క్యూబ్ వాపు మీద ప్రభావవంతంగా పనిచేస్తాయి. అవి రక్త నాళాలు బిగుతుగా మరియు చర్మం మరియు మోటిమలు యొక్క వాపును తగ్గించడానికి సహాయపడతాయి.

11. తేనె

11. తేనె

ఒక సహజ యాంటీ బాక్టీరియల్ అయిన తేనె మోటిమలను స్పష్టంగా నయం చేస్తుంది. మీ ముఖానికి రాత్రి పూట తేనె రాసి ఉదయం సాధారణ నీటితో శుభ్రం చేయాలి. అంతేకాకుండా తేనె ను ఫేషియల్ మాస్క్ గా ఉపయోగించవచ్చు.

12. బ్రౌన్ షుగర్

12. బ్రౌన్ షుగర్

బ్రౌన్ షుగర్ వంటి ఈ ఫేషియల్ స్క్రబ్ నూనె అధిక ఉత్పత్తిని తగ్గించి మోటిమలను తగ్గిస్తుంది. ఒక నెలలో రెండు మూడు సార్లు స్క్రబ్ ను ఉపయోగించండి.

13. గుడ్లు

13. గుడ్లు

గుడ్డులోని తెల్లసొనను మీ ముఖం అంతా పట్టించండి. అది మొటిమలకు కారణమైన అదనపు నూనెను తొలగిస్తుంది. అంతేకాక ఎక్కువగా పచ్చసొనను ఉపయోగించండి. ఇది బ్యాక్టీరియా ఉత్పత్తిని నిరోధించడం మరియు సూక్ష్మరంధ్రాలు ముసివేయుట ద్వారా మోటిమలు రాకుండా చేస్తుంది. మీ ముఖం మీద పచ్చ సొనను పట్టించండి. 15-20 నిమిషాలు తర్వాత శుభ్రం చేయండి. ఈ ఫేషియల్ మాస్క్ ఒక వారంలో రెండుసార్లు ఉపయోగించండి.

14. వెల్లుల్లి

14. వెల్లుల్లి

రెండు వెల్లుల్లి,లవంగాలను తీసుకోని బాగా క్రష్ చేసి రసం తీయాలి. ఈ రసాన్ని మీ ముఖం మీద పట్టించి 10 నిమిషాలు తర్వాత కడగాలి. మీరు గుర్తించుకోవలసిన విషయం ఏమిటంటే 15-20 నిమిషాల కంటే ఎక్కువ సమయం ఉంచుకుంటే మీ చర్మంనకు విపరీతమైన మంట కలుగుతుంది.

15. పుదీనా

15. పుదీనా

పుదీనా నూనె లేదా రసంను మీ ముఖానికి పట్టించి 10 నిమిషాల తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేయాలి.

16. హోమియోపతి

16. హోమియోపతి

మీ మోటిమల బాధను హోమియోపతి చికిత్సలో ఒక ప్రొఫెషనల్ వైద్యుడు ద్వారా తగ్గించుకోవచ్చు.

17.తేనె,దాల్చిన చెక్క మరియు జాజికాయ

17.తేనె,దాల్చిన చెక్క మరియు జాజికాయ

తేనె,దాల్చినచెక్క మరియు జాజికాయ లను పేస్ట్ గా చేయండి. దీనిని మీ ముఖం మీద పట్టించి 1-2 గంటల తర్వాత శుభ్రం చేసుకోండి. అప్పుడు మీరు మీ మోటిమల మచ్చలు తక్కువగా ఉండటాన్ని చూడవచ్చు. అంతేకాక దీనిని ఒక ఫేషియల్ మాస్క్ గా కూడా ఉపయోగించండి. మీ ముఖం మీద మాస్క్ ను వేసుకొని 10 నిమిషాల తర్వాత శుభ్రం చేయాలి.

18. డైట్

18. డైట్

శుద్ధి చేసిన పిండి పదార్థాలకు దూరంగా ఉండాలి. చక్కెరను నెమ్మదిగా తగ్గించండి. విటమిన్లు మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉన్న వెజ్జీస్,పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. మీ చర్మంను గొప్ప మరియు మచ్చ లేనిదిగా చూడటానికి ఒక గొప్ప మార్గం అని చెప్పవచ్చు. మిమ్మల్ని మీరు ఆర్ద్రీకరణ స్థితిలో ఉంచండి. ఎందుకంటే నీటి ఉధృతిని తొలగించి వ్యవస్థ నుండి విషాన్ని బయటకు పంపుతుంది.

19. వ్యాయామం

19. వ్యాయామం

మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేసినప్పుడు రక్త ప్రవాహం సమర్ధవంతంగా ఉంటుంది. ఇంకా వాపు, మోటిమలు ఏర్పడే కారణాలను తగ్గిస్తుంది.

20. మల్టీవిటమిన్

20. మల్టీవిటమిన్

మీరు ప్రతి రోజు ఒక మల్టీవిటమిన్ సప్లిమెంట్ తీసుకోండి. దానితో పాటు కలిపి తగినంత మొత్తంలో విటమిన్ ఎ కూడా తీసుకోండి.ఈ శక్తివంతమైన పోషకాలు చర్మం యొక్క ఆరోగ్యకరమైన పునరుత్పత్తిని ప్రోత్సహించి ముడుతలను తగ్గిస్తుంది. అంతేకాక మోటిమలు మరియు ఇతర చర్మ మచ్చలు కూడా తొలగిపోతాయి. మీ 'ఆదర్శవంతమైన' సప్లిమెంట్ గురించి మీ పౌష్టికాహార నిపుణుడు / డైటిషియన్ ను సంప్రదించండి.

English summary

20 best ways to treat pimples in Telugu

There are many myths regarding the formation of pimples , though the actual cause is quite simple. A pimple develops when, inside a hair follicle, the sebaceous glands become enlarged and clogged with excess sebum and dead skins cells.
Desktop Bottom Promotion