For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ లక్షణాలు మీలో లేకుంటే డబ్బు సంపాధించడం అసాధ్యం...!

By Super
|

ఎప్పుడైనా మీకు బాగా విజయవంతమైన వ్యక్తులని చూసినప్పుడు ఆరాధనా భావం కలగడం సర్వ సాధారణం.ఒకోసారి అసూయ కూడా చెందుతాము. కానీ ఒక్క క్షణం ఆలోచించారా.
వారు ఆ స్థాయి కి ఎలా చేరారో? ఆ స్థాయి కి చేరడానికి గంటల కొద్దీ పరిశ్రమ చేసి వారు ఆ స్థితిలో ఉన్నారా లేదా చక్కటి సమయపాలన వల్ల అంతటి స్థితికి చేరుకున్నారా??

గంటల కొద్దీ శ్రమ పడటం అంటే వారాంతాలలో కూడా పనిచెయ్యడమా, సమయ పాలన అంటే శుక్రవారం సాయంత్రానికల్లా పని ముగించేసుకుని శని ఆది వారాలు కుటుంబం తో గడపడమా?? ఇది చదివితే మీకు మీ ఉత్పాదకతని పెంచే 9 లక్షణాల గురించి తెలుస్తాయి.

ఈ లక్షణాలు మీలో లేకుంటే డబ్బు సంపాధించడం అసాధ్యం...!

టైం టేబుల్ తయారు చేసుకుని దానిని విధిగా పాటించడం: మీరు స్కూలు విద్యార్ధి గా ఉన్నప్పుడు ఎప్పుడు ఏ పాఠమో నిర్ణయించడానికి టైం టేబుల్ నిర్ణయించి ఉంటారు టీచర్లు.అసలు టైం టేబుల్ వెనక ఉన్న రహస్యం ఏమిటంటే ఒక పని ని ఇచ్చిన గడువు లో పూర్తి చెయ్యడమనే లక్షణం పిల్లలకి పెంపొందించడం.ప్రతీ రోజు ని చక్కగా ఉపయోగించుకోవాలి అనుకునే వ్యక్తులు ఖచ్చితం గా టైం టేబుల్ పాటిస్తూ ఆ క్రమం తప్పకుండా చూసుకుంటారు.

ఈ లక్షణాలు మీలో లేకుంటే డబ్బు సంపాధించడం అసాధ్యం...!

మీరు చెయ్యల్సిన పనుల మీద అవగాహన తో ఉండండి: మీకు మీరుగా టార్గెట్లు నిర్ణయించుకుని ఎప్పుడు ఏది చెయ్యాలో అన్న విషయం మీద అవగాహనతో ఉండండి.ఒక రోజు, వారం లేదా నెల లో మీరు చెయ్యల్సిన పనుల మీద మీకు అవగాహన ఉంటే అది ఖచ్చితం గా మీ పనిలో మరియు మీ ఉత్పాదకత లో కనపడుతుంది.

ఈ లక్షణాలు మీలో లేకుంటే డబ్బు సంపాధించడం అసాధ్యం...!

రోజుని మంచిగా ప్రారంభించడం: మనం రోజుని ఫ్రెష్ గా,ఆనందం గా ప్రారంభిస్తే దాదాపు రోజంతా అలాగే ఉండే అవకాశం ఉంది.మీరు మీ టార్గెట్లని చేరుకోవడమే కాకుండా రోజంతా కూడా తాజాగా మరియు యాక్టివ్ గా ఉంటారు.

ఈ లక్షణాలు మీలో లేకుంటే డబ్బు సంపాధించడం అసాధ్యం...!

విరామం: ఎంత పని చేసినా కానీ చిన్ని చిన్ని విరామాలతో మైండ్ కి విశ్రాంతి ఇవ్వడం ముఖ్యం.వీలయితే మీ కార్యాలయం చుట్టూ ఒకసారి నడవండి లేదా పార్కులో బెంచీ మీద 5 నిమిషాలు అలా కూర్చోండీ అదీ కుదరకపోతే ఆఫీసులోనే ఓ ఐదు నిమిషాలు అటూ ఇటూ తిరగండి.ఇలా తిరిగి మీరు మీ సీట్లోకి వచ్చి కూర్చూగానే పునరుత్తేజం పొందడం ఖాయం.

ఈ లక్షణాలు మీలో లేకుంటే డబ్బు సంపాధించడం అసాధ్యం...!

నిటారుగా కూర్చోవడం: మీ ఉత్పాదకత పెరగాలి అంటే మీరు కూర్చునే భంగిమ కూడా ముఖ్యమే.ఎందుకంటారా?? మీరు మీ ఒడీ లో ల్యాప్ టాప్ పెట్టుకుని సరిగ్గా కూర్చోకపోతే అది మీ నడూము మరియు మెడ కి హానికరం.స్క్రీన్ మీదకి అతి గా వంగి కూర్చోవడం లేదా మీ వెన్నెముక ని అతిగా వంచడం వల్ల బద్ధకం వస్తుంది ఇంకా అనవసర నెప్పులని కొనితెచ్చుకుంటారు.అంతే, మీ ఉత్పాదకత తగ్గుతుంది.

ఈ లక్షణాలు మీలో లేకుంటే డబ్బు సంపాధించడం అసాధ్యం...!

సరి అయిన తిండి: ఆరోగ్యకరమైన ఆహరం మీ మెదడు మరియు శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది. అందువల్ల మీ రోజువారీ ఆహారం లో వీలైనన్ని పళ్ళు, కూరగాయలు ఉండేలా చూసుకోండి.ఎంత ఎక్కువ పోషకాలు మీరు తీసుకోగలిగితే మీ ఉత్పాదకత అంత బాగుంటుంది.

ఈ లక్షణాలు మీలో లేకుంటే డబ్బు సంపాధించడం అసాధ్యం...!

"కాదు" అని చెప్పడం: చెడు అలవాట్లకి "నో" చెప్పండి ఆఫీసులో టైం వేస్ట్ చేసే పనుల కోసం ఎవరైన పిలిస్తే ఖచ్చితంగా "నో" చెప్పండి

అలాగే వ్రుధా మాటలకి "నో" చెప్పండి. కొంత మంది ఎప్పుడూ ఏదో ఒక దాని గురించి అసంత్రుప్తి తో ఉంటారు. అలాంటి వారికి దూరంగా ఉండండి.

మీరు పైన చెప్పిన పనులకి సమయం వెచ్చించడం వల్ల మీరు మీ పని సమయం వ్రుధా చేసుకుంటున్నారు.దాని బదులు ఆ సమయాన్ని మీ పని పూర్తి చెయ్యడానికి ఉపయోగించి మిమ్మల్ని మీరు అభినందించుకోండి.

ఈ లక్షణాలు మీలో లేకుంటే డబ్బు సంపాధించడం అసాధ్యం...!

వ్యాయామం: వ్యాయమం జీవితానికి మంత్రం లాంటిది.ఆరోగ్యకరమైన శరీరం లో ఆరోగ్యమైన మనస్సు ని ఇస్తుంది. అందువల్ల మె ఎఉత్పాదకత పెరుగుతుంది.

ఈ లక్షణాలు మీలో లేకుంటే డబ్బు సంపాధించడం అసాధ్యం...!

సంతోషం గా ఉండండి: పాజిటివ్ ఆలోచనలు ఒక మనిషి విజయానికి పరోక్షం గా దోహదపడతాయి.మీరు విజయం సాధించడానికి పాజిటివ్ గా ఆలోచించడం, రోజువారి కార్యక్రమాలలో సంతోషంగా ఉండటం అలవాటు చేసుకోండి. మన మనస్సు అన్ని వేళలా పాజిటివ్ ఆలోచనలతో ఉండగలిగినట్లయితే అది పరిశుద్ధం గా ఉండి ఉత్పాదకత మరింత పెరుగుతుంది.


English summary

9 Habits Of Really Productive People | ఈ లక్షణాలు మీలో లేకుంటే డబ్బు సంపాధించడం అసాధ్యం...!

Haven’t you always admired, and possibly more so, envied, people who happen to be very productive? However, did you ever pause to think what it entails to be so? Does it entail long hours at work, or simply better time management and more time to yourself?
Desktop Bottom Promotion