For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు ప్రేమలో పడకపోవడానికి కారణాలు

By Super
|

మీకు తెలిసిన విషయమే, ప్రేమలో పడటం మంచి విషయం కాదు అని చెపుతున్నాము. ప్రేమలో పడటం కన్నా గొప్ప విషయాలు జీవితంలో చాలా ఉన్నాయి. చాలామంది ప్రేమలో పడటం చాలా గొప్ప అనుభూతి అనుకుంటారు కాని దానిని మనం మనస్ఫూర్తిగా అంగీకరించలేము. ఇక్కడ మిమ్మలిని ఎందుకు ఎన్నడూ ప్రేమలో పడవొద్దు అని చెప్పటానికి గల 10 కారణాలని ఇస్తున్నాము.

Causes Why You Should Never Fall In Love


1. మిమ్మలిని బాధకు గురి చేస్తుంది


ప్రేమలో పడటం, హృదయం గాయపడటానికి దారితీస్తుంది మరియు ఈ మనస్తాపం చాలా బాధాకరమైనది. తరచుగా, అమ్మాయిలు తమ గత సంబంధాలను మర్చిపోవటానికి ప్రయత్నిస్తుండటంలో తీవ్ర మనస్తాపానికి గురి అవుతారు. ఇదంతా, కేవలం మానసికంగా బలహీనంగా ఉండటం మరియు ప్రేమలో పడటం వలన జరుగుతుంది. పెద్దవారు ఎప్పుడూ "జీవితాన్ని గంభీరంగా తీసుకోవొద్దు" అని చెప్పటం వినలేదా? ప్రేమలో పడటం అంటే జీవితాన్ని సీరియస్ గా తీసుకున్నట్లే.

2. మిమ్మలిని బలవంతంగా భాగస్థులుగా చేస్తుంది


ప్రేమలో, ఇద్దరు ఒకటవుతారు. ఒకసారి ప్రేమలో పడటం జరిగితే, వారికి రహస్యాలు దాచుకోవటం అనేది ఉండదు. అది యెంత వ్యక్తిగతమైనా, ప్రతి విషయం మీ భాగస్వామితో పంచుకోవలిసి ఉంటుంది. మీ జీవితాన్ని గురించి బయటివారికి తెలుస్తుంది అన్న ఆలోచన మీకు భయం కలిగించటం లేదా? మీ జీవితంలోని రహస్యాలను తెలుసుకునే ఆస్కారం ఇంకొకరికి ఎందుకు ఇస్తారు? అందువలన, మీ వ్యక్తిగతమైన విషయాలు మరియు మీ వస్తువులు మీవిగానే ఉండాలంటే, మీరు ప్రేమలో పడకండి.

3. ఆర్థికంగా ప్రమాదకరం


డేట్స్ కొరకు బయటకు వెళ్ళటం, దీర్ఘ టెలిఫోన్ కాల్స్ ఖర్చు. అది పుట్టినరోజు, వార్షికోత్సవాలు లేదా వాలెంటైన్స్ డే కావొచ్చు, మీరు ప్రేమించే వారికోసం ఖర్చు భరించటంలో సతమతమవుతుంటారు. ఆ).. ఏముంది, బహుమతులకోసమే కదా! డబ్బు ఖర్చు, డబ్బేమి చెట్లకు కాయటంలేదు. మీరు మీ సొంత ఖర్చులు మానుకొని మీ భాగస్వామికి ఇష్టమైనవాటికి ఖర్చు చేయటం. అది యెంత ప్రయోజనం లేని పని!

4. మీ మెదడు ఒత్తిడికి గురి అవుతుంది


మీ టంగ్-ఇన్-చీక్ వైఖరి కు వీడ్కోలు పలకండి. మీరు డబ్బు ఖర్చు పెట్టటానికి తయారుగా ఉన్నా, అదొక్కటే సరిపోదు. ఈరోజుల్లో, మీ భాగస్వామిని ఆనందంగా ఉంచేందుకు మీరు వీలైనంత సృజనాత్మకతను చూపించవలసి ఉంటుంది. అలా మీరు ఉండనట్లయితే, మిమ్మలిని తప్పనిసరిగా విసుగు మరియు ఆలోచనలేని వారుగా భావిస్తారు.

5. మీ స్వతంత్రం తగ్గిపోతుంది


ఒకసారి మీరు ప్రేమలో పడినట్లయితే, మీరు స్వతంత్రం కోల్పోయినట్లే. మీ జీవితమంతా ఒక్క మనిషితో ముడిపడినట్లే. మీ ప్రతి ఒక్క నిర్ణయం పైన ఈ మనిషి ప్రభావం ఉంటుంది. మీ తల్లిదండ్రుల నుండి ఒత్తిడి తక్కువగా ఉన్నా, మీరు ఏమి చేయాలో చెప్పటానికి బయటనుండి వొచ్చినవారెవరు?

6. అవకాశం తగ్గుతుంది


మీరు ఖచ్చితంగా ఒక సమయంలో ఒకరు కన్నాఎక్కువ వ్యక్తులతో ప్రేమలో పడకూడదు. మీరు ఇప్పుడు ఎవరితో ముడిపడిఉన్నారో, వారికన్నా మంచివారిని కలిసే అవకాశం కోల్పోతారు.

7. సమయం తీసుకోవటం


ప్రేమలో పడటం తప్పనిసరిగా చాలా సమయం తీసుకుంటుంది. మీరు ఎవరితోనైనా ప్రేమలో పడితే, వారితో ఖచ్చితంగా సమయం గడపాలి. వారిని బయటకు తీసుకెళ్లటం లేదా ఫోన్ లో వారితో మాట్లాడటం, ఇలా చేయటం వలన మీ విరామ సమయంలో సగం ఖర్చు అవుతుంది. మీరు మీ కుటుంబంతో గడిపే సమయాన్ని తగ్గించుకోవలసి ఉంటుంది, మీ స్నేహితులను ఒంటరిగా వొదిలేయవలసి ఉంటుంది. చిట్టచివరకు, మీరు యెంత సమయం వెచ్చించినా అది సరిపోదు.

8. మిమ్మలిని ఆత్మస్పృహ చేయిస్తుంది


మీరు ఎవరితోనైనా ప్రేమలో పాడినప్పుడు, మీకు తెలిసో లేక తెలియకో మీరు చాలా తెలివిగా ఉంటారు. మీరు వారిని ఆకట్టుకోవటానికి చాలా ప్రయత్నిస్తారు. ఈ సమయంలో మీరు ఎంచుకున్న మార్గం ఎటువంటిది అని కూడా ఆలోచించరు, మీరు పొందాలనుకున్న అవకాశం మాత్రమే కనపడుతుంది.

9. మీ కెరీర్ విధ్వంసం


మీరు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నప్పుడు, మీరు మీ కెరీర్ ను మరియు మీరు సాధించాలనుకున్నపనులను నిర్లక్ష్యం చేస్తారు. మీకు తప్పనిసరిగా కొన్ని జీవితలక్ష్యాలు ఉంటాయి. కాని, మీరు ప్రేమలో ఉన్నప్పుడు మీరు ప్రేమించేవారికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తారు, మీ మిగతా విషయాల గురించి మర్చిపోతారు, కొన్నిసార్లు మీ కెరీర్ గురించి కూడా.

10. మిమ్మలిని తెలివితక్కువగా పని చేయిస్తుంది


రెండు నిముషాలు మీ ప్రేమికుడిని కలవటం కోసం గంటల కొద్ది డ్రైవింగ్ చేయటం, అతనికి బహుమతి ఇవ్వటం కోసం మీరు పొదుపు చేసిన డబ్బు ఖర్చు చేయటం; యెంత బుద్ధిలేనితనం? కాని మీరు ప్రేమలో ఉన్నప్పుడు మీకు ఇవేవి గుర్తుండవు మరియు మీరు తెలుసుకునేనాటికి మీరు ఇవి అన్ని చేసి ఉంటారు, మీ ప్రేమను నిరూపించుకోవటానికి యెంత బుద్ధితక్కువగా ప్రవర్తించారో ఆలోచించండి.

Story first published: Tuesday, December 17, 2013, 18:06 [IST]
Desktop Bottom Promotion