For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చలికాలంలో శరీర సంరక్షణ పై 5 అపోహలు

By Super
|

శీతాకాలంలో చల్లని పిల్ల గాలి ముఖంపై వీస్తున్నప్పుడు ఆ ఆనందమే వేరు. శీతాకాలం చలిని తట్టుకునేందుకు ఏడాది మొత్తం షాపింగ్ చేయడం కొంతమందికి సరదా. శీతాకాలంలో హాట్ కాఫీ తాగడం, ముసుగు తన్ని వెచ్చని దుప్పటిలో నిద్రపోవడం ఇవన్నీ చిన్న చిన్న ఆనందాలే అయినా వీటిలోని పొందే సంతోషం అమితమైనది. సంతోషాన్ని, ఉత్సాహాన్ని కలిగించే శీతాకాలన్ని దాదాపు అందరూ ఇష్టపడతారు.

అయితే, శీతాకాలంతో పాటు అన్ని వైపుల నుంచి బ్యూటీ రిలేటెడ్ అడ్వైజులు వస్తూ ఉంటాయి. ఆ సలహాలను ఎప్పుడో అప్పుడు అందరూ పాటించే ఉండుంటారు. బ్యూటీ టిప్స్ ఇష్టపడని వారెవరుంటారు చెప్పండి? కొన్ని టిప్స్ ఉపయోగకరంగా ఉంటాయి. మరి కొన్ని టిప్స్ అసలు పనే చేయవు. ఈ బ్యూటీ టిప్స్ లో కచ్చితంగా పాటించాలి అనే టిప్స్ కొన్ని కేవలం అపోహ అని మనం గమనించాల్సిన విషయం. ఎటువంటి కారణం లేకుండా అపోహలుగా ఉండే ఈ టిప్స్ అందాన్ని సంరక్షించడంలో ఎటువంటి పాత్ర పోషించవు.

ఆవిరికక్కుతున్న వేడి వేడి నీటి స్నానం, సన్ స్క్రీన్ వాడకం, చర్మం పొడిబారిపోవడం, ఆల్కహాల్ ను సేవించడం, వ్యాయామాలు ఇవన్నీ శీతాకాలంలో బాడీ కేర్ గురించి మాట్లాడేటప్పుడు ముఖ్యంగా చోటు చేసుకునే అంశాలు. వీటితో పాటు శీతాకాలం బాడీ కేర్ గురించి ఉన్న అపోహల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

శీతాకాలంలో మిమ్మల్ని ఫిట్ గా ఉంచి అందంగా ఉంచే టిప్స్ కూడా తెలుసుకుందాం. అపోహలు వీడి బ్యూటీ టిప్స్ గురించి తెలుసుకుందాం.

అపోహ : వేడినీటి స్నానం తేమను పెంపొందిస్తుంది

నిజం : చాలామందికి వేడినీటి స్నానం చేయడం ఇష్టం. శీతాకాలంలో వేడినీటి స్నానం ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని కలిగిస్తుంది. అయితే, ఏదైనా మితిమీరితే దాని ఫలితం తారుమారవుతుందనే విషయం గుర్తుంచుకోవాలి. ఇదే అంశం వేడినీటి స్నానానికి కూడా వర్తిస్తుంది. వేడినీటి స్నానం పూర్తయిన తరువాత శరీరానికి మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి.

5 Winter Body Care Myths Debunked

అపోహ : శీతాకాలంలో సన్ స్క్రీన్ ను వాడక్కరలేదు

నిజం : ఎండాకాలంలో సన్ స్క్రీన్ వినియోగం ఎంత అవసరమో శీతాకాలంలో కూడా సన్ స్క్రీన్ అవసరం అంతే ఉంది. సూర్య కిరణాల నుంచి ప్రసరించే హానీకరమైన యూవీకిరణాల నుంచి చర్మానికి రక్షణ కలిగించేందుకు సన్ స్క్రీన్ ను ఉపయోగిస్తారు. శీతాకాలంలో సన్ స్క్రీన్ ను ఉపయోగించకపోవడం లేదా అతి తక్కువగా ఉపయోగించడం వల్ల చర్మానికి హనీ కలుగుతుంది. అందువల్ల, శీతాకాలంలో సన్ స్క్రీన్ ను ఉపయోగించనవసరం లేదని ఎప్పుడైనా మీరనుకునే ముందు సన్ స్క్రీన్ ఉపయోగం గురించి ఆలోచించండి.

5 Winter Body Care Myths Debunked

అపోహ : వ్యాయామం అవసరం లేదు

నిజం : శీతాకాలంలో మీ శరీరంలో తగినంత ఉష్ణోగ్రతను ఉంచడానికి వ్యాయామం ఎంతో ముఖ్యం. ఈ కాలంలో, కొంచెం త్వరగా నిద్ర లేవడం కష్టమే. వ్యాయామం చేయలేకపోయినా కనీసం పరుగైనా తీస్తే శరీరానికి మంచిది. వ్యాయామం వల్ల కొవ్వు కరుగుతుంది. శరీరంలో వేడి పుడుతుంది. వ్యాయామం వల్ల చెమట పడుతుంది. చక్కని వర్కవుట్స్ వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకునేవారవుతారు. చర్మం కూడా సాఫ్ట్ గా మృదువుగా ఉంటుంది.
5 Winter Body Care Myths Debunked

అపోహ: ఆల్కహాల్ శరీరంలో వేడిని పుట్టిస్తుంది

నిజం: ఆల్కహాల్ వల్ల శరీరంలోని ఉష్ణోగ్రత గణనీయంగా తగ్గిపోతుందని హెల్త్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కేవలం వెచ్చగా ఉన్న భావన మాత్రమే కలుగుతుంది. స్కిన్ సర్ఫేస్ దగ్గరికి రక్తం వచ్చేలా ఆల్కహాల్ చేస్తుంది కాబట్టే వెచ్చదనంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అందువల్ల, ఆల్కహాల్ తాగడం వలన కలిగే వెచ్చదనం కేవలం మీ భావన. మీ ఆల్కహాల్ మీ శరీరంలోని వేడిని కోల్పోయేలా చేస్తుంది. ఆల్కహాల్, రక్త నాళాల విస్తరణ ద్వారా మీ శరీరంలోని వేడిని పోగొడుతుంది. అందువల్ల హైపోథెర్మియా అనే స్థితికి శరీరం చేరుకుంటుంది. శరీరంలోని ఉష్ణోగ్రత స్థాయి తగ్గిపోవడాన్ని హైపోథెర్మియా అని అంటారు. తద్వారా, మీ శరీరంలోని సహజసిద్దమైన నూనెలు బయటకు పోతాయి. అందువల్ల, పొడి చర్మం సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్య నుంచి బయటపడడానికి అయిదు నిమిషాలలోనే మీ స్నానాన్ని ముగించండి. మీకు నచ్చిన మాయిశ్చరైజర్ ను ఉపయోగించండి. ఇలా చేయడం ద్వారా మీ చర్మంలో మాయిశ్చరైజర్ ఎక్కువ సేపు ఉంటుంది.

5 Winter Body Care Myths Debunked

అపోహ : డెడ్ సెల్స్ ను తొలగించుకుంటే పొడి చర్మం సమస్య తీవ్రం అవుతుంది

నిజం : చర్మంలోని మృతకణాలను తొలగించుకోవడానికి సీజన్ తో సంబంధం లేదు. మృత కణాలను తొలగించుకుంటే చర్మం తిరిగి ఉత్తేజంగా తయారవుతుంది. చర్మ కణాల పునరుద్ధరణకు ఇది ఎంతో అవసరం. ఈ ప్రొసీజర్ వల్ల చర్మం మృదువుగా, కోమలంగా తయారవుతుంది. అయితే, ఎక్ఫోలియేటింగ్ అనే ఈ ప్రాసెస్ ను ఎక్కువగా చేస్తే నష్టమేనని గుర్తుంచుకోండి. ఈ ప్రాసెస్ తరువాత కచ్చితంగా మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి.

5 Winter Body Care Myths Debunked

అపోహ : శీతాకాలంలో సన్ స్క్రీన్ ను వాడక్కరలేదు

నిజం : ఎండాకాలంలో సన్ స్క్రీన్ వినియోగం ఎంత అవసరమో శీతాకాలంలో కూడా సన్ స్క్రీన్ అవసరం అంతే ఉంది. సూర్య కిరణాల నుంచి ప్రసరించే హానీకరమైన యూవీకిరణాల నుంచి చర్మానికి రక్షణ కలిగించేందుకు సన్ స్క్రీన్ ను ఉపయోగిస్తారు. శీతాకాలంలో సన్ స్క్రీన్ ను ఉపయోగించకపోవడం లేదా అతి తక్కువగా ఉపయోగించడం వల్ల చర్మానికి హనీ కలుగుతుంది. అందువల్ల, శీతాకాలంలో సన్ స్క్రీన్ ను ఉపయోగించనవసరం లేదని ఎప్పుడైనా మీరనుకునే ముందు సన్ స్క్రీన్ ఉపయోగం గురించి ఆలోచించండి.

అపోహ : వ్యాయామం అవసరం లేదు

నిజం : శీతాకాలంలో మీ శరీరంలో తగినంత ఉష్ణోగ్రతను ఉంచడానికి వ్యాయామం ఎంతో ముఖ్యం. ఈ కాలంలో, కొంచెం త్వరగా నిద్ర లేవడం కష్టమే. వ్యాయామం చేయలేకపోయినా కనీసం పరుగైనా తీస్తే శరీరానికి మంచిది. వ్యాయామం వల్ల కొవ్వు కరుగుతుంది. శరీరంలో వేడి పుడుతుంది. వ్యాయామం వల్ల చెమట పడుతుంది. చక్కని వర్కవుట్స్ వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకునేవారవుతారు. చర్మం కూడా సాఫ్ట్ గా మృదువుగా ఉంటుంది.

అపోహ: ఆల్కహాల్ శరీరంలో వేడిని పుట్టిస్తుంది

నిజం: ఆల్కహాల్ వల్ల శరీరంలోని ఉష్ణోగ్రత గణనీయంగా తగ్గిపోతుందని హెల్త్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కేవలం వెచ్చగా ఉన్న భావన మాత్రమే కలుగుతుంది. స్కిన్ సర్ఫేస్ దగ్గరికి రక్తం వచ్చేలా ఆల్కహాల్ చేస్తుంది కాబట్టే వెచ్చదనంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అందువల్ల, ఆల్కహాల్ తాగడం వలన కలిగే వెచ్చదనం కేవలం మీ భావన. మీ ఆల్కహాల్ మీ శరీరంలోని వేడిని కోల్పోయేలా చేస్తుంది. ఆల్కహాల్, రక్త నాళాల విస్తరణ ద్వారా మీ శరీరంలోని వేడిని పోగొడుతుంది. అందువల్ల హైపోథెర్మియా అనే స్థితికి శరీరం చేరుకుంటుంది. శరీరంలోని ఉష్ణోగ్రత స్థాయి తగ్గిపోవడాన్ని హైపోథెర్మియా అని అంటారు. తద్వారా, మీ శరీరంలోని సహజసిద్దమైన నూనెలు బయటకు పోతాయి. అందువల్ల, పొడి చర్మం సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్య నుంచి బయటపడడానికి అయిదు నిమిషాలలోనే మీ స్నానాన్ని ముగించండి. మీకు నచ్చిన మాయిశ్చరైజర్ ను ఉపయోగించండి. ఇలా చేయడం ద్వారా మీ చర్మంలో మాయిశ్చరైజర్ ఎక్కువ సేపు ఉంటుంది.

English summary

5 Winter Body Care Myths Debunked

It is a bliss when the cool winter breeze caresses the face. It is that time of the year when you bring out your warm clothes, cuddle up in a blanket and sip on hot coffee. Most popular season among many people, winter brings out the joy and happiness.
Story first published: Monday, December 15, 2014, 18:25 [IST]
Desktop Bottom Promotion