For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇండియాలో సులభంగా దొరికే రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు

By Super
|

ఇటీవలి అధ్యయనంలో ఎర్ర ద్రాక్ష మరియు బ్లూ బెర్రీస్ రోగ నిరోధకతను మెరుగుపరచడానికి సహాయం చేస్తాయని కనుగొనబడింది. అయితే అవి భారతదేశంలో సులభంగా మరియు చవకగా అందుబాటులో ఉంటాయా? అందుకే ఇక్కడ సర్వసాధారణంగా అందుబాటులో దొరికే కొన్ని ఎంపికలు ఉన్నాయి.

క్యారెట్లు,ఎరుపు గుమ్మడికాయ,బొప్పాయి వంటి పసుపు,నారింజ రంగు ఆహారాలు

క్యారెట్లు,ఎరుపు గుమ్మడికాయ,బొప్పాయి వంటి పసుపు,నారింజ రంగు ఆహారాలు

వీటిలో బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది.ఈ ఆహారాలు రోగనిరోధక వ్యవస్థ యొక్క వివిధ భాగాల పని తీరును మెరుగుపరుస్తాయి. అలాగే ఇన్ఫెక్షన్ నుండి శరీరం అంతా సమర్థవంతంగా తప్పించుకోవటానికి సహాయం చేస్తాయి. వాటిని సలాడ్,సూప్ లేదా స్మూతీస్ గా తయారుచేసుకొని తినవచ్చు.

జామపండ్లు, నారింజ మరియు నిమ్మ వంటి విటమిన్ సి సమృద్ధిగా ఉన్న ఆహారాలు

జామపండ్లు, నారింజ మరియు నిమ్మ వంటి విటమిన్ సి సమృద్ధిగా ఉన్న ఆహారాలు

ఇవి సహజ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. అంటువ్యాధులు వేగంగా స్పందించకుండా తన విధులను నిర్వహించడానికి తెల్ల రక్త కణాలకు విటమిన్ సి సహాయపడుతుంది. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపర్చే చర్యగా ఉంటుంది. జామపండ్లలో అధిక కొలెస్ట్రాల్ మరియు గుండె జబ్బులకు వ్యతిరేకంగా ఒక రక్షణ పాత్రను పోషించే ఫైబర్ సమృద్దిగా ఉంటుంది.

వెల్లుల్లి

వెల్లుల్లి

బాక్టీరియా మరియు వైరస్ సంక్రమణలకు వ్యతిరేకంగా పోరాటం మరియు వాపు తగ్గించే గుణము ఉన్నది. వెల్లుల్లి గుండె వ్యాధి మరియు రక్త కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించటానికి సహాయం చేస్తుంది. ఇటీవలి కాలంలో వెల్లుల్లి వివిధ అవయవాల క్యాన్సర్ ను నిరోధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని కనుగొన్నారు. ప్రతి రోజు మీ వంటలో కొద్దిగా నలగగొట్టిన వెల్లుల్లిని చేర్చండి. వెల్లుల్లిలో ఉన్న అల్లిసిన్ మీ నిరోధక వ్యవస్థను మంచి స్థితిలో ఉంచుతుంది. (చదవండి: వెల్లుల్లి యొక్క 15 ఆరోగ్య ప్రయోజనాలు)

అవిసె గింజలు

అవిసె గింజలు

అవిసె గింజలలో ఆల్ఫా లినోలెనిక్ ఆమ్లం,ఒమేగా -3 కొవ్వు ఆమ్లం కలిగి ఉంటుంది. దీనిని ఫైటో ఈస్త్రోజెన్లు లిగ్నంస్ అని పిలుస్తారు. ఈ పదార్ధాలు రోగనిరోధక వ్యవస్థ యొక్క ప్రతిస్పందన మాడ్యులేట్ కు ముఖ్యమైనవి. రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందనకు మధ్యవర్తిత్వం వహిస్తాయి. ఈ సమ్మేళనాలు అంటువ్యాధులు మరియు స్వీయ రోగనిరోధక వ్యాధులను దూరంగా ఉంచడానికి సహాయపడతాయి. (చదవండి: అవిసె గింజలు మధుమేహం,గుండె వ్యాధుల నియంత్రణకు ఎలా సహాయం చేస్తాయి)

పసుపు

పసుపు

పసుపులో విటమిన్ B6 మరియు పోటాషియం,మాంగనీస్ మరియు ఇనుము వంటి ఖనిజాలు సమృద్దిగా ఉన్నాయి. ఇవి బిన్నమైన శరీర పనితీరులో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. అంతేకాకుండా కుర్కుమిన్ అనే విలువైన అనామ్లజనిచర్య ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థ యొక్క పనితీరును పెంచుతుంది.

పెరుగు

పెరుగు

పెరుగులో మంచి జీర్ణక్రియకు అవసరమైన ప్రోబయోటిక్స్ ఉన్నాయి. అనేక అధ్యయనాలు రోగనిరోధక పనితీరు మెరుగుపర్చడానికి మరియు సాధారణ బాక్టీరియా మరియు వైరస్ సంక్రమణలకు వ్యతిరేకంగా శరీరంను రక్షించటానికి సహాయపడుతుందని కనుగొన్నాయి. పెరుగు యొక్క సామర్థ్యం ఫలితంగా ఇంటర్ఫెరాన్తో ఉత్పత్తి ప్రేరేపణ జరుగుతునదని నమ్ముతారు. రోగనిరోధక వ్యవస్థ యొక్క పనితీరు బాగా మెరుగుపడుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం ప్రతి రోజు పెరుగు తినటం వలన యోని ఈస్ట్ ఇన్ఫెక్షన్లు అభివృద్ధి అవకాశాలు తగ్గుతాయని కనుగొన్నారు.

బాదం

బాదం

విటమిన్ E లేకపోవడం వలన అంటువ్యాధుల మీద పోరాడటానికి రోగనిరోధక వ్యవస్థ యొక్క సామర్ధ్యం మీద ప్రభావం చూపవచ్చు. అందువలన విటమిన్ ఇ సమృద్ధిగా ఉన్న బాదంను నమలండి. మీ రోగనిరోధక వ్యవస్థ మృదువుగా ఉండేలా చేస్తుంది.

పీత,ఆయిస్టర్ మరియు ఎరుపు మాంసం

పీత,ఆయిస్టర్ మరియు ఎరుపు మాంసం

జింక్ అనేది శరీరం సరైన స్థాయిల్లో పని చేయడానికి తప్పనిసరైన ఖనిజాలలో ఒకటి. అంటువ్యాధుల మీద పోరాడే సమయంలో వాటి రక్షక చర్యను చెప్పట్టడానికి తెల్ల రక్త కణాలకు సహాయం చేస్తుంది. అంతేకాక ఇది విదేశీ జీవుల నాశనం కొరకు నిరోధక వ్యవస్థ ప్రతిస్పందనలకు ఉత్ప్రేరకంగా ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. మీరు మీ ఆహారంలో పీత,ఓస్టెర్ మరియు ఎరుపు మాంసంలను తగినంత చేర్చితే జింక్ పొందవచ్చు. ముఖ్యంగా శాకాహారులలో జింక్ లోప ప్రమాదం సంభవించవచ్చు. అయితే తృణధాన్యాలు, బీన్స్ మరియు బలవర్థకమైన ధాన్యాలలో జింక్ సమృద్దిగా ఉంటుంది. కాబట్టి మీరు మీ ఆహారంలో వీటిని ఉండేలా చూసుకోండి.

పచ్చని ఆకుకూరలు

పచ్చని ఆకుకూరలు

మీరు ఎల్లప్పుడూ బలవంతంగా ఆకు కూరలను తింటారు. కానీ మీరు ఆకుకూరలను ఇష్టపడటానికి ఇక్కడ కొన్ని వార్తలు ఉన్నాయి. ఈ ఆకుకూరలలో రోగనిరోధక వ్యవస్థ యొక్క పనిలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించే ఫోలిక్ ఆమ్లం సమృద్దిగా ఉంటుంది. కొన్ని అధ్యయనాల్లో ఫోలిక్ ఆమ్లం యొక్క లోపంతో ఉన్న ప్రజలు ఇన్ఫెక్షన్ పోరాట లక్షణాలను కలిగి ఉంటారు. అయితే అవసరమైన పరిమాణంలో ప్రతిరోధకాలు స్రవించటం జరుగుట లేదని గుర్తించారు. ప్రత్యేకించి గర్భవతి లేదా తల్లిపాలు ఇచ్చే తల్లులు ఈ సమయంలో మీ శరీరానికి పెరిగిన అవసరాలను భర్తీ చేయడానికి ఫోలిక్ యాసిడ్ ను ఎక్కువగా తీసుకోవాలి.

గ్రీన్ టీ

గ్రీన్ టీ

గ్రీన్ టీలో పోలి ఫేనోల్స్ అని పిలిచే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. ముఖ్యంగా కాటెచిన్స్ కూడా ఉంటాయి. కొన్ని అధ్యయనాలలో ఇన్ఫ్లుఎంజా లేదా జలుబు వైరస్ లను నాశనం చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉందని కనుగొన్నారు. అయినప్పటికీ,మీరు గ్రీన్ టీ తీసుకున్నప్పుడు పాలు వదిలివేయటం ముఖ్యమైనది. ఎందుకంటే పాలలో ఉండే ప్రోటీన్లు కాటెచిన్స్ ను బందిస్తుంది.తద్వారా దాని యాంటీ ఆక్సిడెంట్ లక్షణములను కోల్పోవటానికి కారణమౌతుంది. కొద్దిగా నిమ్మ లేదా తేనె కలుపుకొని త్రాగవచ్చు. (చదవండి : ఫీట్ గా ఉండటానికి గ్రీన్ టీ యొక్క 10 ఆరోగ్య ప్రయోజనాలు)

English summary

Immunity-boosting foods that are available in India and easy on the pocket!

According to a recent study, it was found that resveratrol found in red 
 grapes and blueberries helped improve immunity. However, are they easily 
 available in India and affordable? Here are some more commonly available 
 options which are easy on your pocket too:
Desktop Bottom Promotion