చర్మంను తెల్లగా ..కాంతివంతంగా మార్చే నేచురల్ 10 రెమెడీస్

చర్మ సంరక్షణ చాలా అవసరం, అందుకనీ, ఖరీదైన ఉత్పత్తులను వాడటం మాత్రమే కాదు, చర్మానికి ఎలాంటి హాని కలిగించని వాటిని ఎంపిక చేసుకోవడం మంచిది . ముఖ్యంగా స్కిన్ వైటనింగ్ విషయంలో ఉపయోగించే ఉత్పత్తులను కమర్షియల

Posted By:
Subscribe to Boldsky

చర్మం అందాన్ని మెరుగుపరచుకోవడానికి మార్కెట్లో అనేక రకాల సౌందర్య ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి అని చెప్తుంటారు. ఈ ప్రొడక్ట్స్ చర్మ తత్వం, చర్మ రంగు, టోన్ ను మెరుగుపరుస్తాయి. వీటన్నింటిని ప్రకటనల్లో చూసి మోసపోతుంటారు. అయితే ఇవన్నీ ఏవిధంగా ప్రభావింత చేస్తాయన్న విషయం ఎవరికీ తెలియదు. కొంత మందికి ఎఫెక్టివ్ రిజల్ట్ ఇస్తే మరికొంత మందికి అంత ప్రభావం చూపవు. అందువల్ల వీటికి ప్రత్యామ్నాయంగా నేచురల్ ప్రొడక్ట్స్ ను ఎంపిక చేసుకుంటే, చర్మంను తెల్లగా మార్చుతాయి.

చర్మ సంరక్షణ చాలా అవసరం, అందుకనీ, ఖరీదైన ఉత్పత్తులను వాడటం మాత్రమే కాదు, చర్మానికి ఎలాంటి హాని కలిగించని వాటిని ఎంపిక చేసుకోవడం మంచిది . ముఖ్యంగా స్కిన్ వైటనింగ్ విషయంలో ఉపయోగించే ఉత్పత్తులను కమర్షియల్ ప్రొడక్ట్స్ కంటే , నేచురల్ ప్రొడక్ట్స్ ఎంపిక చేసుకోవడం మంచిది.

అయితే ఎలాంటి పదర్థాలను ఎంపిక చేసుకునే ముందు స్కిన్ వైట్ గా ఉంటేనే అది ఆరోగ్యకరమైన చర్మం అనుకోకూడదు. ఏరంగు చర్మమైనా ఆరోగ్యంగా ఉంటుంది. అందుకు కొన్ని చర్మ సంరక్షణ పద్దతులను నిర్వహించాల్సి ఉంటుంది. చర్మానికి ఉపయోగించే ప్రొడక్ట్స్ సరైనవై ఉంటే చాలు, చర్మానికి కావల్సిన అందాన్ని కాంతివంతమైన చర్మ సౌందర్యాన్ని అందిస్తుంది.

స్కిన్ టోన్ తెల్లగా మార్చడానికి కొన్ని నేచురల్ ప్రొడక్ట్స్ ఈ క్రింది విధంగా అందివ్వడం జరిగింది. ఇవి చర్మానికి పోషణను అందివ్వడంతో పాటు, చర్మంను ఆరోగ్యంగా ఉంచుతాయి.

పాలు:

పాలు ప్రతి ఒక్కరి ఇల్లలో ఉండే నిత్యవసర ద్రవపదార్థం, ఇది ఎముకలకు క్యాల్షియం అందివ్వడం మాత్రమే కాదు, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇది మెలనోసైట్స్ ను క్రమబద్దం చేస్తుంది, దాంతో కణాలు ఉత్పత్తి అవుతాయి, చర్మం డ్రై కాకుండా నివారిస్తుంది. చర్మానికి పాలను అప్లై చేయ��ం క్లెన్సర్ గా పనిచేస్తుంది. ఇందులో కొద్దిగా బియ్యం పిండి మిక్స్ చేసి అప్లై చేస్తే మెరుగైన ఫలితాలను అందిస్తుంది.

నిమ్మరసం:

స్కిన్ వైటనింగ్ ప్రొడక్ట్స్ లో నిమ్మరసం ఒకటి. ఇది ఆస్ట్రిజెంట్ గా పనిచేస్తుంది. ఇది క్లెన్సర్ గా ఉపయోగపడుతుంది. ఇది డార్క్ స్పాట్స్ ను నివారిస్తుంది. స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది. ఇది చర్మానికి ఎక్సలెంట్ నేచురల్ బ్లీచర్. నిమ్మరసంను నేరుగా చర్మానికి అప్లై చేయవచ్చు , లేదా చర్మం తెల్లగా మారడానికి తేనెను మిక్స్ చేసుకోవచ్చు,

పెరుగు:

, పెరుగులో ల్యాక్టిక్ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. స్కిన్ లైటనింగ్ బిషయంలో ఇది చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. చర్మంలో మెలనిన్ ఉత్పత్తిని పెంచడంతో చర్మం తెల్లగా మారుతుంది. పెరుగును ముఖానికి అప్లై చేసి, అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇందులో తేనె, ఓట్స్ మిక్స్ ��ేసుకుంటే, చర్మానికి నేచురల్ గా పోషణను అందిస్తుంది.

తేనె ఫేస్ ప్యాక్:

తేనెలో క్లెన్సింగ్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో మాయిశ్చరైజింగ్ లక్షణాలు అధికంగా ఉన్నాయి, తేనెకు కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేస్తే ఎక్సలెంట్ ఫేస్ మాస్క్ తయారవుతుంది, దీన్ని రెగ్యులర్ గా ఉపయోగించుకోవచ్చుహాట్ సమ్మర్ లో ఈ మిశ్రమం మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇది చర్మంను స్మూత్ గా మార్చడం మాత్రమే కాదు, సన్ టాన్ నివారిస్తుంది.

ఆరెంజ్ పీల్:

ఆరెంజ్ హెల్త్ కు గ్రేట్ గా సహాయపడుతుంది, అదే విధంగా ఆరెంజ్ తొక్క స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్ గా పనిచేస్తుంది. దీన్ని ఎండలో ఎండ బెట్టి పొడి చేసుకోవాలి. దీనికి కొద్దిగా కొబ్బరి నూనె, వాజిలిన్, లేదా ఇతర క్రీములతో మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి స్క్రబ్ చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల స్కిన్ వైట్ గా మారుతుంది.

బొప్పాయి:

బొప్పాయిలో ఎంజైమ్స్ అధికంగా ఉంటాయి , ఇది మనుష్యుల శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది, ఇంటర్నల్ గా ఇందులో ఉండే ఫైబర్ గ్రేట్ గా సహాయపడుతుంది, అదే విధంగా ఇంటర్నల్ ఆర్గాన్స్ ను క్లెన్సింగ్ చేస్తుంది. చర్మానికి ఎక్స్ ఫ్లోయేటర్ గా పనిచేస్తుంది. బొప్పాయిలో స్కిన్ వైటనింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి, అంతే కాదు ఏజింగ్ స్కిన్ ను నివారిస్తుంది.

కోజిక్ యాసిడ్ :

ఈ నేచురల్ ప్రొడక్ట్స్ సన్ టాన్ నుండి రక్షణ కల్పిస్తుంది. వీటిలో ఉండే యాసిడ్స్ బ్లీచింగ్ ట్రీట్మెంట్ గా పనిచేస్తుంది. చర్మంను లైట్ గా మార్చుతుంది. దీన్ని ఫేస్ క్రీమ్ లలో మిక్స్ చేసి రెగ్యులర్ గా అప్లై చేసుకోవచ్చు. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వారు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది.

మల్బరీ:

స్కిన్ వైటనింగ్ ప్రొడక్ట్స్ లో మరో ప్రొడక్ట్ మల్బరీ ఇది చర్మాన్ని తెల్లగా మార్చడంలో గొప్పగా పనిచేస్తుంది. దీన్ని క్రీములు, లోషన్స్ లో అధికంగా ఉపయోగిస్తుంటారు. ఇది చర్మంలో మెలన్ ఉత్పత్తిని కంట్రోల్ చేస్తుంది. దాంతో డార్క్ స్కిన్ నివారిస్తుంది.

రైస్ పౌడర్:

స్కిన్ వైటనింగ్ లో రైస్ పౌడర్ గొప్పగా సహాయపడుతుంది. రైస్ పౌడర్ ను పాలతో మిక్స్ చేసి పేస్ట్ లా చేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి, 20 నిముషాల తర్వాత ముఖానికి శుభ్రం చేసుకోవాలి. ఇది ముడతలను పోగొట్టడం మాత్రమే కాదు, ఇది చర్మంరంగను మార్చడంలో సహాయపడుతుంది.

అలోవెర:

అలోవెర జెల్ మనకు అందుబాటులో ఉండే స్కిన్ కేర్ ప్రొడక్ట్ , ఈ జెల్ ను రెగ్యులర్ గా అప్లై చేస్తుంటే చర్మం తెల్లగా మారుతుంది. చర్మంలో మచ్చలు ఉండవు, ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ స్కిన్ సాప్ట్ గా , సపెల్ గా మార్చుతుంది. స్కిన్ షేడ్స్ ను లైట్ చేస్తుంది.

English summary

10 Natural Substances For Skin Whitening

Much is said, advertised and done about the skin. There are products for skin texture, color, tone etc. In fact if you watch the commercials on television in every third commercial will be regarding skin care. But how far are these products effective. Instead you can always opt for natural substances for skin whitening. Wondering how? Read to know more.
Please Wait while comments are loading...
Subscribe Newsletter