మానవ శరీరంలో కొన్ని అవయవాలు పనిచేయకపోతే జీవన మనుగడ చాలా కష్టతరం అవుతుంది. శరీరంలోని జ్ఞానేంద్రియాలతో పాటు, చేతులు, కాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే జీవించడానికి సులభతరం అవుతుంది. జ్ఞానేంద్రియాలలో కళ్లు ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం...కళ్లు, కంటిచూపు ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్లు, ఖనిజలవణాలు, మాంసకృత్తులు, ఇతర పోషకాలతో కూడిన సమతుల ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. అందుకు శిశువు గర్భంలో ఉన్నప్పుడు ఇలాంటి ఆహారం తీసుకోవడం చాల మంచిది. అందుకే గర్భిణులు ఇతర పోషకాలతోపాటు డి.హ్‌చ్.ఎ.( డొకొసా హెక్సానిక్ యాసిడ్ ) అనే ఫ్యాటీయాసిడ్ పుష్కలంగా అందేలా చూసుకోవాలి. కోడిగుడ్లు, బాదం లాంటి ఎండు గింజల్లోని పప్పులు, సోయా, అవిస గింజలు, చేపలు, చేప నూనెలు, వెజిటబుల్ నూనెలు తదితరాల ద్వారా ఈ ఫ్యాటియాసిడ్ విరివిగా లభిస్తుంది.
కళ్ల ఆరోగ్యాన్ని కాపాడటంలో బీటా కెరొటీన్‌ను మించిన పదార్థం లేదు. ఇది కొన్నిరకాల పోషకాలను విటమిన్ ఏగా మార్చి, కళ్లకు ఆరోగ్యాన్ని ఇచ్చేందుకు తోడ్పడుతుంది. రే చీకటిని దూరం చేస్తుంది. కంటిచూపునూ మెరుగుపరుస్తుంది. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో క్యారెట్లు, ఆప్రికాట్లు, బొప్పాయి, మామిడి, పాలకూరలను ఎక్కువ మోతాదులో ఉండేలా చూసుకుంటే.. మిలమిలలాడే ఆరోగ్యకరమైన నయన సౌందర్యం సొంతమవుతుంది.
అదేవిధంగా శారీరక వ్యాయామంతో కండరాలు ఆరోగ్యంగా మారతాయనేది ఎంత నిజమో, కనుపాపపై ఏర్పడే ఒత్తిడి దూరమవుతుందనేదీ అంతే నిజం. కంటిపై ఒత్తిడి తీవ్రమైతే గ్లూకోమా సమస్య వచ్చే అవకాశముంది. దానికి వ్యాయామమే విరుగుడు. అందుకే తేలిక పాటి వ్యాయామాన్ని ఎంచుకుని, క్రమం తప్పకుండా చేయడం ప్రారంభించాలి.
అలాగే మంచినీళ్లు తక్కువగా తాగితే కంటిపై ప్రభావం పడుతుంది. ఎక్కువ నీళ్లు తాగకపోతే శరీరంలో తేమ తగ్గుతుంది. కళ్లు జీవం కోల్పోయినట్లు కనిపిస్తాయి. కళ్లకింద ఉబ్బడం మొదలవుతుంది. అలాంటప్పుడు వెంటనే నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. చల్లగా ఉండే టీ బ్యాగులు, చల్లని పాలల్లో ముంచిన దూదిని అప్పుడప్పుడు కళ్లపై పెట్టుకోవడం మంచిది. నల్లగా మారి, ఉబ్బిన కళ్లకు ఇలాంటివి చక్కగా పనిచేస్తాయి.