For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆకర్షణీయంగా కనబడాలనుకుంటున్నారా? ఇదుగో 10 బ్యూటీ టిప్స్...!

|

ప్రస్తుత కాలంలో మహిళలు చిన్న వయస్సు నుండి వృదాప్యం వరకు అందం కోసం ఎంతోకొంత ప్రాముఖ్యత ఇస్తారు. కాని యవ్వన వయస్సులో మాత్రం ఎక్కువ ప్రాధాన్యత సౌందర్యం కోసమే ఇస్తారు. ఈ సౌందర్యం కోసం ఖరీదైన ఉత్పత్తులనే వాడాలనుకోవడం తప్పు. ఇంటిలో దొరికే పండ్లు, కూరగాయలతోనె ఆకర్షణీయంగా యవ్వన సౌందర్యం తెచ్చుకోవచ్చు. ముఖం మీద నల్ల మచ్చలు ఇబ్బందిగా ఉంటాయి. ఈ సమస్యను అధిగమించడానికి ఖరీదైన సౌందర్యోత్పత్తులు అవసరం లేదు. ఇంట్లోనే దొరుకుతుంది పరిష్కారం.

అందం విషయంలో ఏ ఒక్కరూ కాంప్రమైజ్ అవ్వరు. ఎందుకంటే ప్రతిఒక్కరూ తాను అందంగా కనబడాలని, తన సౌందర్యాన్ని ప్రతి ఒక్కరూ చూడాలని కోరుకుంటారు. కొందరు పుట్టకతోనూ అందంగా పుడుతారు. మరికొందరు వారు వేసుకొనే మేకప్ మరియు డ్రెస్ సెన్స్ ను బట్టి ఆకర్షనీయంగా కనబడుతారు. అయితే మీకు సౌందర్యం మీద శ్రద్ద ఉంటేనే అందం ఆకర్షణీయంగా కనబడటానికి సాధ్యం.

ఆకర్షణీయంగా కనబడాలంటే వారి వారి సౌందర్యం పోషణకు లేదా రక్షణ మీద అవగాహన కలిగి ఉండాలి.

మిమ్మల్ని ఆకర్షణీయంగా మార్చే 10 బ్యూటీ టిప్స్

ఫేస్ వాష్: ప్రతి రోజూ 3-4సార్లు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ముఖం శుభ్రం చేసుకోవడానికి సోపు వాడకుండా ఫేస్ వాష్ ను ఉపయోగించండి. ముఖం శుభ్రం చేయడానికి గోరువెచ్చని నీటిని ఉపయోగించండి.

మిమ్మల్ని ఆకర్షణీయంగా మార్చే 10 బ్యూటీ టిప్స్

ఎక్స్ ఫ్లోయేట్: ఎక్స్ ఫ్లోయేట్ చేసుకోవడం వల్ల నిర్జీవమైన చర్మాన్ని తొలగించుకోవచ్చు. వారంలో రెండు మూడు సార్లు స్ర్కబ్బింగ్ తో ఎక్స్ ఫ్లోయేట్ చేసుకోవాలి.

మిమ్మల్ని ఆకర్షణీయంగా మార్చే 10 బ్యూటీ టిప్స్

మాయిశ్చరైజర్: పొడిబారి, జిడ్డు చర్మ తత్వం కలవారికి మాయిశ్చరైజర్ బాగా పనిచేస్తుంది. శరీరంలో హైడ్రేషన్ వల్ల కూడా చర్మం పొడిబారుతుంది. అందుకు తగినంత నీరు త్రాగడం, మాయిశ్చరైజింగ్ క్రీముల ద్వారా, ఆయిల్ మసాజ్ ద్వారా చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు.

మిమ్మల్ని ఆకర్షణీయంగా మార్చే 10 బ్యూటీ టిప్స్

సన్ స్కీన్ లోషన్: ఎండలో ఎక్కువగా తిరగడం లేదా అతి వేడి వల్ల కూడ చర్మం డ్యామేజ్ అవుతుంది. దాంతో వివిధ రకాల చర్మ సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. కాబట్టి సన్ స్రీన్ లోషన్ తోపాటు మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నాం 2 మధ్యల మద్య ఎండలో ఎక్కువగా తిరగకపోవడం మంచిది

మిమ్మల్ని ఆకర్షణీయంగా మార్చే 10 బ్యూటీ టిప్స్

పెదవుల రక్షణ: పొడిబారిన, లేదా పగిలి పెదాలు ముఖ అందాన్ని పోగడుతాయి. కాబట్ట రెగ్యులర్ గా పెదాలకు లిప్ బామ్, జెల్ వంటి వాటిని వాడటం వల్ల పెదాలు తేమగా ఉండి సున్నితంగా మారుతాయి. అలాగే ముఖానికి మేకప్ లేదా పెదాలకు లిప్ స్టిక్ వాడుతుంటారు. రాత్రి పడుకొనే ముందు మేకప్ లేదా లిప్ స్టిక్ ను తొలగించడం వల్ల చర్మ సౌందర్యానికి కాపాడుకోవచ్చు.

మిమ్మల్ని ఆకర్షణీయంగా మార్చే 10 బ్యూటీ టిప్స్

స్టీమింగ్(ఆవిరి)పట్టడం: ముఖానికి స్టీమింగ్ చేయడం చాలా మంచిది. స్టీమింగ్ వల్ల చర్మంలో ఉన్న మలినాలు, దుమ్ము, దూళి తొలగిపోయి, చర్మరంద్రాలు తెరచుకొనేలా చేసి చర్మ గ్రంధులను శుభ్రపరుస్తుంది.

మిమ్మల్ని ఆకర్షణీయంగా మార్చే 10 బ్యూటీ టిప్స్

నిద్ర: ఒక్క రోజు సరిగా నిద్రలేకపోవడం వల్ల కళ్ళక్రింద వలయాలు, నిర్జీవమైనచర్మం, కళ్ళు లోతుగా, ముఖం అందవిహీనంగా కనబడుతాం. కాబట్టి ప్రతి రోజూ తగినంత నిద్ర (7-8గంటలు)పోవడం వల్ల చర్మానికి మాత్రమే కాదు మొత్తం శరీరానికి విశ్రాంతి కలిగి ఉదయం తాజాగా కనబడుతా

మిమ్మల్ని ఆకర్షణీయంగా మార్చే 10 బ్యూటీ టిప్స్

నీరు: రోజుకు 10 నుంచి 12 గ్లాసుల నీరు తాగాలి. జ్యూస్‌ల రూపంలో తీసుకున్నా... ఫలితం ఉంటుంది. విటమిన్లు, మినరల్స్‌ అధికంగా ఉండే పండ్లు తీసుకోవాలి. మంచి నీళ్ళు బాగా త్రాగండి. శరీరంలో ని వేడిని నియంత్రించి హైడ్రేటెడ్ కాకుండా ఉండేందుకు నీరు తోడ్పడుతుంది.

మిమ్మల్ని ఆకర్షణీయంగా మార్చే 10 బ్యూటీ టిప్స్

ఆహారం: స్ట్రాబెర్రీస్, బ్రోకోలి, ఆకుకూరలు మరియు నిమ్మకాయ వంటి ఆహారపదార్ధములను తీసుకోవడం ద్వారా మన చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చును. సమతుల్యమైన ఆరోగ్యకర ఆహారాలని తీసుకోవడం ద్వారా మన చర్మ సౌందర్యం పై ఎన్నో అద్బుతమైన ఫలితాలు పొందవచ్చు.

మిమ్మల్ని ఆకర్షణీయంగా మార్చే 10 బ్యూటీ టిప్స్

వ్యాయామం: వ్యాయామం: ప్రతి రోజూ మంచి ఆహారంతో పాటు వ్యాయామం చేయడం వల్ల శరీరంలో కండరాలు సంకోచ, వ్యాచాలు చెంది, రక్త ప్రసరణ బాగా జరిగి చర్మానికి మంచి నిగారింపును ఇస్తుంది. వ్యాయామంతో శరీరంలో ఉండే మలినాలు బయటకు పంపి చర్మం క్లియర్ గా ఉండేలా చేస్తుంది. దాంతో ముడతులు, తొలగి వయస్సు మీద పడకుండా చేస్తుంది.

English summary

10 Basic Beauty Tips | మిమ్మల్ని ఆకర్షణీయంగా మార్చే 10 బ్యూటీ టిప్స్

Everyone wants to look their best. Some are born beautiful and others grow to become beautiful. Looking healthy and attractive is everyone's dream, regardless of age group. Since lifestyle and skincare contribute a lot to your looks, here's some advice to keep in mind.
Desktop Bottom Promotion