For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్యాస్టోర్ ఆయిల్(ఆముదం)లోని అద్భుత బ్యూటీ బెనిఫిట్స్

|

క్యాస్టోర్ ఆయిల్ (ఆముదం)ఒక నేచురల్ ప్లాంట్ ఆయిల్ ఆముదం మొక్క నుండి వచ్చిన విత్తనాల నుండి నూనెను తయారుచేస్తారు. ఇందులో రిసినోలిస్ యాసిడ్ సంవృద్ధిగా ఉంటుంది, ఇది యాంటీఇన్ఫ్లమేటరి, యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఒక అందమైన శరీరానికి దోహదం చేస్తుంది.

క్యాస్టోర్ ఆయిల్ (ఆముదం నూనె)ను సాధారణంగా ఒక భేదిమందుగా ఉపయోగిస్తారు, కానీ అది అనేక ఇతర అద్భుతమైన లక్షణాలను కూడా కలిగి ఉంది. అలాగే ఇందులో అధిక మాయిశ్చరైజ్ సామర్థ్యాన్ని కలిగి ఉండి, ఇది చాలా బాగా కేశాలను మరియు చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ఆముదం జుట్టును బలోపేతం చేయడానికి మంచి సామర్థ్యం కలిగి ఉందని తెలుసు. ఇది చర్మం మరియు జుట్టు రెండింటి కోసం లోతైన కండీషనర్ గా పనిచేసేటటువంటి ఒక మార్ధవకరమైన నూనె. ఈ లక్షణాలు కలిగి ఉన్నందు వల్ల, ఆ ఆముదం నూనెను, కొన్నివేళ సంవత్సరాల నుండి జుట్టు మరియు చర్మ సౌందర్యాలలో ఉపయోగిస్తున్నారు.

అనేక ఉత్పన్నాలు రిసొనోలేట్, ను కొన్ని సాధారణ కాస్మొటిక్స్ ప్రొడక్ట్స్ సోపులు, ఐలైనర్, డియోడరెంట్, లిప్ స్టిక్, లేదా పెర్ఫ్యూమ్స్ లలో వీటిని విరివిగా ఉపయోగిస్తున్నారు. మరి మీరు కూడా వీటిని ఉపయోగించుకోవాలనుకుంటే, రసాయనాలతో తయారుచేసిన బ్యూటీ ప్రొడక్ట్స్, చికిత్సలకు బదులుగా ఈ క్యాస్టోర్ ఆయిల్ ను ఎంపిక చేసుకోండి. కాబట్టి, మీ బ్యూటీ కిట్ లో కాస్ట్రో ఆయిల్ ను చేర్చుకొని, మీ అందంలో కొత్త మార్పులను చూసి ఎంజాయ్ చేయండి . మీకు ఉపయోగపడే కొన్ని బ్యూటీ బెనిఫిట్స్ ఇక్కడ ఉన్నాయి...

ఏజ్ స్పాట్స్ ను మాయం చేయండి:

ఏజ్ స్పాట్స్ ను మాయం చేయండి:

ఆముదం నూనెను ఉపయోగించి వయస్సుతో వచ్చే మచ్చలను తొలగించడానికి ఒక సులభమైన మార్గం. ఆముదం నూనెను వృద్ధాప్యం మచ్చలున్న ప్రదేశంలో అప్లై చేసి వృత్తాకార మోషన్ లో సున్నితంగా రుద్దాలి. ఈ వ్యాయామంను రోజుకు రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. మీరు ఫలితాలు చూసి, ఆశ్చర్యం చెందుతారు.

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది:

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది:

ఆముదం నూనె జుట్టు పెరుగుదలకు ఎంత సామర్థ్యం కలిగి ఉందో మనందరికీ తెలిసిన విషయమే . క్యాస్టోర్ ఆయిల్ ను తలకు అప్లై చేసి, తర్వాత మసాజ్ చేయాలి. మీ తలకు ఆముదం నూనె అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. మసాజ్ చేసిన తర్వాత అరగంట అలాగే ఉంచి తర్వత మన్నికైన షాంపుతో స్నానం చేయండి.

హెయిర్ కండీషనింగ్:

హెయిర్ కండీషనింగ్:

ఆముదం నూనెలో నేచురల్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి, ఇది ఒక నేచురల్ హెయిర్ కండీషనర్ గా అద్భుతంగా సహాయపడతుంది. ఆముదం నూనెలో మీ జుట్టు పొడవునా అప్లై చేసి, 15నిముషాల తర్వాత షాంపు చేసుకోవడం వల్ల మీ జుట్టు సాఫ్ట్ గా మారుతుంది.

చేతులకు మరియు గోళ్ళుకు చాలా మంచిది:

చేతులకు మరియు గోళ్ళుకు చాలా మంచిది:

క్యాస్టోర్ ఆయిల్ ను ఉపయోగించి మీ చేతులను మరియు గోళ్ళను మసాజ్ చేయండి. దీని వల్ల ముడుతలు తొలగిపోతాయి. ఆముదం నూనెను ప్రతి రోజూ మీరు నిద్రించే ముందు మీ క్యూటికల్స్ కు మరియు గోళ్ళకు అప్లై చేయాలి. ఇది క్యూటికల్స్ ను సాఫ్ట్ చేసి, గోళ్ళు తెగిపోకుండా చేస్తుంది.

చర్మం శుభ్రపర్చడానికి :

చర్మం శుభ్రపర్చడానికి :

ఆముదం నూనె, స్కిన్ కు ఉపయోగపడే నేచురల్ ఆయిల్ వంటిది, ఇది చర్మం మాయిశ్చరైజర్ గా అద్భుతంగా సహాపడుతుంది.

పగిలిన పాదానలకు చికిత్సనందిస్తుంది:

పగిలిన పాదానలకు చికిత్సనందిస్తుంది:

మీరు పగిలిన పాదాలతో బాధపడుతున్నట్లైతే, ఆముదం నూనెను మీ పగిలిన పాదాలకు అప్లై చేయడానికి ఇది ఒక మంచి సమయం.

ముడుతలను నివారిస్తుంది:

ముడుతలను నివారిస్తుంది:

ఆముదం నూనె చాలా ఎఫెక్టివ్ గా ముడుతలను తొలగిస్తుంది. చర్మలోకి శోషించే విధంగా ఆముదం నూనెతో చర్మానికి మసాజ్ చేయండి. కొద్ది సమయం తర్వాత శుభ్రం చేసుకోవచ్చు.

చర్మం మీద మచ్చలను నివారించడంలో చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది:

చర్మం మీద మచ్చలను నివారించడంలో చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది:

రెండు చెంచాలా క్యాస్టోర్ ఆయిల్ కు కొద్దిగా బేకింగ్ సోడా మిక్స్ చేసి, ఈ పేస్ట్ ను మచ్చల మీద అప్లై చేయాలి. కొద్ది సేపటి తర్వాత తొలగించండి. తిరిగి కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఇలాగే చేయండి. ఇలా మచ్చలు పూర్తిగా తొలగిపోయేవరకూ చేస్తూనే ఉండండి.

స్కిన్ మాయిశ్చరైజర్ గా ఉపయోగించండి:

స్కిన్ మాయిశ్చరైజర్ గా ఉపయోగించండి:

డ్రై లేదా రఫ్ స్కిన్ కు క్యాస్టోర్ ఆయిల్ ను చాలా ఎఫెక్టివ్ గా ఉపయోగించి, మీ చర్మాన్ని తేమగా మరియు సున్నితంగా ఉంచుకోవచ్చు. ఇది చర్మాన్ని నిరంతరం తేమగా ఉంచుతుంది.

స్ట్రెచ్ మార్క్స్ ను తొలగిస్తుంది:

స్ట్రెచ్ మార్క్స్ ను తొలగిస్తుంది:

రెండు టేబుల్ స్పూన్ల బాదం ఆయిల్ మరియు ఒక టేబుల్ స్పూన్ క్యాస్టోర్ ఆయిల్ ను మిక్స్ చేసి, స్ట్రెచ్ మార్క్ ఉన్న ప్రదేశంలో అప్లై చేసి, సర్కులర్ మోషన్ లో రుద్దాలి. ఇలా చేసిన తర్వాత పదినిముషాలు అలాగే ఉండనిచ్చి తర్వాత శుభ్రం చేసుకోండి.

సాగే చర్మాన్ని నివారిస్తుంది:

సాగే చర్మాన్ని నివారిస్తుంది:

మన వయస్సు పెరిగే కొద్ది, మన చర్మం కూడా వదులవుతూ వస్తుంది. ఇది చర్మంలోని ఎలాసిటి వల్ల జరుగుతుంది. అందువల్ల చర్మ సాగుతుంది. ఇటువంటి సాగే చర్మాన్ని నివారించడానికి ఆముదం నూనె అద్భుతంగా సహాయపడుతుంది. ఇది చర్మాన్ని తేమగా ఉంచడంతో పాటు, టైట్ గా ఉంచుతుంది.

English summary

10 Beauty Benefits Of Castor Oil

Castor oil is a natural plant oil from the seed of castor plant. It is rich in ricinoleic acid, which possesses anti-inflammatory, anti-bacterial and anti-fungal properties which contributes to a beautiful body.
Desktop Bottom Promotion