For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అందమైన సున్నిత పాదాలకు 10 సులభ చిట్కాలు

|

పొడిబారిన, పగిలిన పాదాలు మీ పూర్తి అందాన్ని చెడగొట్టవచ్చు. మీరు ప్రత్యేకంగా బెల్టు చెప్పులను ధరించడానికి ఇష్టపడితే, గరుకుగా ఉన్న పాదాలు ఇబ్బందిగా అనిపించవచ్చు. అయినప్పటికీ చాలామంది ప్రతిరోజూ ఈ సమస్యని ఎదుర్కుంటున్నారు, కొంతమందికి ఇది కాలానుగుణంగా వచ్చే ఇబ్బంది అయి ఉండవచ్చు.

మీరు ఈ సమస్యని ఏడాది పొడవునా ఎదుర్కొన్నప్పటికీ లేదా ఎపుడో ఒకసారైన మీరు దీనిని నిర్లక్ష్యం చేయవద్దు. అయితే, మీరు వేళ్ళు కనపడే చెప్పులు ధరించాలి అనుకుంటే, పొడిబారిన పాదాలు, వేళ్ళు, గోళ్ళు ఇబ్బందిగా మారితే వీటిని చదవడం అవసరం. అయితే మేము మీకు తెలిపే 10 విలాసవంతమైన చిట్కాలు కేవలం ఆడవారికి మాత్రమే కాకుండా మగవారికి కూడా ఉపయోగపడతాయి.

ఆకర్షణీయమైన పాదాల కొరకు 10 చిట్కాలు

మీ పాదాలను సున్నితంగా కడగండి: మీరు స్నానానికి వెళ్ళినపుడు, పాదాలకు కూడా ప్రాముఖ్యతను ఇవ్వండి. మీ పాదాలను ప్రతిరోజూ శుభ్రంగా కడగండి. మీరు ఉపయోగించే సబ్బుతో లేదా బాడీ వాష్ తో బాగా రుద్దండి. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు మీ పాదాలను శుభ్రంగా కడిగి వాసన, మురికి తొలగినట్లు నిర్ధారించుకోండి. మురికి పాదాలు, పగిలిన పాదాల కంటే చెడ్డవి, వీటివల్ల మీ పాదాలు ఆకర్షణీయంగా కనిపించకపోవచ్చు.

ఆకర్షణీయమైన పాదాల కొరకు 10 చిట్కాలు

పాలతో కూడిన కొన్ని చికిత్సలను ఉపయోగించండి: మీరు 250 మిల్లీలీటర్ల పాలను కొనుగోలుచేసి, నెలకొకసారి వాటిలో మీ పాదాలను నానపెట్టండి. పాలు చిక్కగా, గోరువెచ్చగా ఉండాలి. ఇలాచేయడం వల్ల లాక్టిక్ ఆమ్లం మీ పాదాలలోని గరుకును తొలగించి మీ చర్మాన్ని ఎంతో సున్నితంగా చేస్తుంది.

ఆకర్షణీయమైన పాదాల కొరకు 10 చిట్కాలు

మీ పాదాలను నానపెట్టండి: సున్నితమైన పాదాల కోసం కడగటం మాత్రమే సరిపోదు. పాదాలను రోజూ కడగడంతోపాటు, గోరువెచ్చని నీటిలో కనీసం 5 - 10 నిముషాలు నానపెట్టాలి. ఈ పద్ధతి వల్ల పగిలిన పాదాలు సున్నితమవుతాయి, పొడిపాదాలపై ఉన్న మృతకణాలు తేలికగా తొలగిపోతాయి. మీ పాదాలను ఎక్కువసేపు నానపెట్టకండి.

ఆకర్షణీయమైన పాదాల కొరకు 10 చిట్కాలు

ప్యూమిక్ స్టోన్ తో మృత కణాలను తొలగించ౦డి: ప్యూమిక్ స్టోన్ తో వారానికి కనీసం రెండుసార్లు మీ మడాలు, వేళ్ళు, అరికాళ్ళు సున్నితంగా రుద్దండి. ఈ పద్ధతి వల్ల ప్యూమిక్ స్టోన్ మీ చర్మాన్ని సున్నితంగా, పట్టులా చేసి మృత కణాలు తొలగించడానికి సాయపడుతుంది. మీ పదాలలో గరుకుగా, పొడిగా ఉన్న ప్రాంతంపై రెండు నిమిషాలు ద్రుష్టి పెట్టండి. మీ చర్మం పగిలి, దురద పెట్టకుండా ఉండాలి అంటే గట్టిగా రుద్దకండి.

ఆకర్షణీయమైన పాదాల కొరకు 10 చిట్కాలు

కాలిగోళ్ళను కత్తిరించండి: పెరిగిన కాలిగోళ్ళను కత్తిరించండి. పాదాలను శుభ్రంగా కడిగిన తరువాత కాలిగోళ్ళను కత్తిరించండి. పొడవు గోళ్ళవల్ల మురికి, బాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్లు రావచ్చు.

ఆకర్షణీయమైన పాదాల కొరకు 10 చిట్కాలు

మీ బూట్లను గాలిపోసుకోనివ్వండి: మీరు ప్రత్యేకంగా స్నీకర్లు, బూట్లు తిరిగి ధరించడానికి ఒకరోజు ముందు వాటిని గాలికి వదలండి. మీ స్నీకర్లు దుర్వసనగా ఉంటే, బైట పడేయండి లేదా శుభ్రం చేయండి. వాసన వచ్చే బూట్లు ధరించడం వల్ల కూడా మీ పాదాలు దెబ్బతినవచ్చు.

ఆకర్షణీయమైన పాదాల కొరకు 10 చిట్కాలు

మీ పాదాలని తేమగా ఉంచండి: మీ పాదాలను మాయిశ్చరైజర్ తో మర్దనచేసి, శుభ్రమైన కాటను సాక్సులను ధరించండి. మాయిస్చారైసర్ పడుకోబోయే ముందు రాయడం వల్ల దీని ప్రభావం ఉత్తమంగా ఉంటుంది. క్రీముకి బదులు వంటనూనెను కూడా వాడవచ్చు.

ఆకర్షణీయమైన పాదాల కొరకు 10 చిట్కాలు

సరైన బూట్లను ధరించండి: సరిపోయే బూట్లను ధరించండి. చక్కగా మీ పాదాలకు సరిపోయే బూట్లు పగిలిన మడమలను తగ్గించే అవకాశం ఉంది. మడమలకు సరిపడే విధంగా ఉండటం పాదరక్షల లక్షణం కాని అవి ధరించే విధంగా ఉండాలి. పాదరక్షలు పాదంపైన సౌకర్యవంతంగా ఉండటమే కాక నడిచేప్పుడు ఏ విధమైన నొప్పిని కలిగించ రాదు.

ఆకర్షణీయమైన పాదాల కొరకు 10 చిట్కాలు

విశ్రాంతి అవసరం: గంటల తరబడి నిలబడటం లేదా నడవడం వలన పాదాల పగుళ్ళు ఏర్పడవచ్చు. పగిలిన మడమలు, పుండ్ల నుండి నివారించడానికి మీ పాదాలకు విశ్రాంతిని ఇవ్వడం అవసరం.

ఆకర్షణీయమైన పాదాల కొరకు 10 చిట్కాలు

మీరే మీ పాదాలకు సున్నిత మర్దన చేసుకోండి: పాదాల మర్దన రక్త ప్రసరణను మెరుగు పరిచి మీ పాదాల ఒత్తిడిని తగ్గిస్తుంది. చికిత్సలో నూనెను వాడటం వలన పొలుసులు ఊడిపోయి మీ చర్మాన్ని సున్నితంగా, తాజాగా ఉంచుతుంది.

English summary

10 Simple tips for soft and sexy feet | ఆకర్షణీయమైన పాదాల కొరకు 10 చిట్కాలు

Dry, cracked feet are not sexy as it can drastically spoil your overall look. Especially if you like to wear strappy sandals, rough looking feet can be embarrassing. Even though most of us deal with this problem on a daily basis, for some it can just be a seasonal hazard.
Desktop Bottom Promotion