For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తరచూ అరచేతుల్లో చెమట పడుతుంటే..ఎలా నివారించాలి?

|

మీ అరచేతులకు తరచుగా చెమటలు పడతాయా, చల్లటి వాతావరణం లో కూడా ? మీ అరచేతులకు ఎక్కువగా చెమట పడుతుందనే భయంతో మీరు అప్పుడప్పుడూ బయటకు వెళ్ళడానికి భయపడతారా? ఈ సమస్య వల్ల ఆత్మన్యూనత కలుగవచ్చు. కొంతమందికైతే చేతులు పట్టుకునేటప్పుడు అర చేతులు చెమట ఎక్కుతాయనే భయంతో డేట్ కి వెళ్ళడానికి కూడా భయపడతారు.

శుభవార్త ఏమిటంటే ఈ సమస్యను పరిష్కరించడానికి మార్గాలున్నాయి. పెద్ద వాళ్ళ జనాభా లో 1 – 3% మందికి అధిక స్వేదం సమస్య వుందని అంచనా. సమస్య చేతుల్లోనే అయితే దాన్ని పామర్ హైపర్ హిడ్రోసిస్ అంటారు. కొంతమందికి ఈ సమస్య దానంతకు అదే తగ్గిపోతుంది. మరి కొందరికి చికిత్స అవసరం. మీ సమస్యకు కారణాలు, దాని తీవ్రతను బట్టి మీకందించే చికిత్స ఆధారపడి వుంటుంది. కొంతమందికి ఇంజేక్షన్లతో, మరి కొందరికి శస్త్ర చికిత్సతో తగ్గవచ్చు. అదృష్టవశాత్తు, మీరు సూది మందు, ఆపరేషన్ వద్దనుకుంటే సహజమైన చికిత్సలు కూడా అందుబాటులో వున్నాయి.

తరచూ అరచేతుల్లో చెమటలా..ఇవిగో సులభ చిట్కాలు

మీ అరచేతుల మీద టాల్కం పౌడర్ గానీ, గంజి పిండి గానీ రుద్దుకోండి. ఈ రెండూ తేమను బాగా పీలుస్తాయి. వాటిని ఎక్కువగా కూడా వాడే పని లేదు. మీరు బయటకు వెళ్ళే ముందు చేతులకు కొద్దిగా పట్టిస్తే చాలు.

తరచూ అరచేతుల్లో చెమటలా..ఇవిగో సులభ చిట్కాలు

సుగంధం లేని చెమట నివారిణి మీ చేతులపై వాడండి. కొన్ని చెమట నివారిణులు కేవలం చేతులు, కాళ్ళ కోసం తయారు చేస్తారు. సెంట్ వున్నవి వాడకండి, ఎందుకంటే వాటిలో వుండే రసాయనాలు చెమటను కలిగిస్తాయి. అల్యూమినియం క్లోరైడ్ వున్న చేతి మాయిశ్చరైజర్ వాడండి. ఇది చేతి రంధ్రాలను మూసి వేసి చెమటను నిరోధించగల ఆస్ట్రిన్జేంట్.

తరచూ అరచేతుల్లో చెమటలా..ఇవిగో సులభ చిట్కాలు

కొన్నిసార్లు వత్తిడి లేదా ఆందోళన వల్ల చేతులకు చెమట పట్టవచ్చు. మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడానికి అవసరమైనదంతా చేయండి. రిలాక్సేషన్, ప్రాణాయామం మెళకువలు నేర్చుకోండి - మీకు ఆందోళన కలుగుతు౦దనగా వాటిని వాడండి.

తరచూ అరచేతుల్లో చెమటలా..ఇవిగో సులభ చిట్కాలు

లోంటోఫేరేసిస్ అనే చికిత్స గురించి నేర్చుకోండి. ఇది నీరు, విద్యుత్ తరంగాలతో కూడిన పరికరం. నీరు, విద్యుత్ తరంగాల కలయిక అధికంగా పని చేసే స్వేద గ్రంధుల మీద షాక్ లాగా పని చేసి అధిక చెమటను నిరోధిస్తాయి.

తరచూ అరచేతుల్లో చెమటలా..ఇవిగో సులభ చిట్కాలు

మీ చేతులను రోజులో పలుసార్లు కడుక్కోండి. దుమ్ము, బాక్టీరియా వల్ల చెమట పడుతుంది కనుక చేతులను అన్నివేళలా శుభ్రంగా వుంచుకుంటే చెమటను నిరోధించవచ్చు. బయటకు వెళ్ళేటప్పుడు ఒక హాండ్ సానిటైజర్ ను, చేతి రుమాలును తీసుకు వెళ్ళండి - ఒక వేళ కడిగే అవకాశం లేకపోతె పనికివస్తాయి.

తరచూ అరచేతుల్లో చెమటలా..ఇవిగో సులభ చిట్కాలు

మసాలా ఆహారాలు తినకండి. వాటిలో కాప్సైసిన్ వుంటుంది - అది నరాల చివరలను ప్రేరేపించి, శరీర ఉష్ణోగ్రతను పెంచుతు౦ది. శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు మీకు చెమట ఎక్కువ పడుతుంది.

తరచూ అరచేతుల్లో చెమటలా..ఇవిగో సులభ చిట్కాలు

ఫాస్ట్ ఫుడ్ లేదా పాకేజ్ చేసిన ఆహారం తినకండి. అవి అనారోగ్య కరమైనవే కాక మీకు చెమట ఎక్కువగా కలిగిస్తాయి. దీని వల్ల ఇలాంటి ఆహారంలో ప్రాసెస్ చేసిన పదార్ధాలను జీర్ణం చేయడానికి మీ శరీరం మరింత శ్రమించాలి.

తరచూ అరచేతుల్లో చెమటలా..ఇవిగో సులభ చిట్కాలు

చెమట పట్టకుండా ఉండడానికి మూలికా వైద్యం కూడా ప్రయత్నించండి - వలెరియన్ వేరు, చమోమెయిల్, టీ ట్రీ ఆయిల్, లేదా సెయింట్ జాన్స్ వోర్ట్ లాంటివి. వీటిని నోటిలోకి తీసుకోవచ్చు లేదా చేతుల మీదికి నేరుగా రాసుకోవచ్చు. చెమట పట్టే అరచేతులకు ఉత్తమ వైద్యం సెజ్. ప్రతి రోజూ సేజ్ మాత్రలు లేదా సేజ్ టీ తాగడం వల్ల మంచి ఫలితాలు ఉండవచ్చు.

తరచూ అరచేతుల్లో చెమటలా..ఇవిగో సులభ చిట్కాలు

సేజ్ టీ తో పాటు మీరు ఆపిల్ సిడార్ వినేగార్ లేదా టమాటో రసం కూడా తాగండి. ఈ పానీయాలు అరచేతులకు చెమట పట్టడ౦ నుంచి విముక్తి కలిగిస్తాయి. వీటిలో ఒక దాన్ని ఎంచుకుని రోజూ ఒక కప్పు తాగండి.

తరచూ అరచేతుల్లో చెమటలా..ఇవిగో సులభ చిట్కాలు

ఈ పది చిట్కాలు మీ పామర్ హైపర్ హిడ్రోసిస్ ను బాగా తగ్గించలేక పోవచ్చు, కానీ చెమట పట్టడాన్ని బాగా తగ్గిస్తాయి. అదంతా దానికి గల కారణాలపై ఆధార పడి వుంటుంది. అరచేతికి ఇంకా తీవ్రంగా చెమట పడుతూ వుంటే వె౦టనే వైద్యుడిని సంప్రదించి అది ఒక వైద్య స్థితి వల్ల లేక ఏదైనా జబ్బు వల్ల వచ్చిందా అనేది తెలుసుకోండి.

English summary

10 Tips for Preventing n Controlling Sweating Palms! | తరచూ అరచేతుల్లో చెమటలా..ఇవిగో సులభ చిట్కాలు

Do you often experience sweating palms, even in cool temperatures? Do you sometimes dread going out, because you’re afraid your palms will start sweating excessively? This problem can cause low self-esteem.
Desktop Bottom Promotion