For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చేతులు అందంగా,సున్నితంగా మారడానికి 10 మార్గాలు

|

పగలు లేదా రాత్రి, ఇట్లో లేదా బయట ఎప్పడైనా, ఎక్కడైనా సరే మొదట మీ చేతులు బహిర్గతం అవుతుంటాయి. వాతావరణ కాలుష్యం, సరైజాగ్రత్తలు పాటించకపోవడం, వల్ల చేతులు చాలా అసహ్యంగా కనబడుతుంటాయి. మానవ శరీరంలో ముఖం తర్వాత అందంగా కనిపించేది చేతులు...కాళ్ళు...గోళ్ళు..సాధారణంగా ముఖం చూసిన వెంటనే కాళ్ళు చేతులు గమనిస్తారు. ముఖ్యంగా స్త్రీల శరీరంలో వంపు సొంపులతో పాటు చేతులు, కాళ్ళు ఆకతులు అందంగా కనిపిస్తాయి

శరీరంలో చేతులు సౌందర్య భాగాల్లో ముఖ్యమైనవిగా చెప్పుకుంటాం..చేతులు అందంగా ఉండాలంటే ..కొన్ని సాధారణ హ్యాండ్ మరియు నెయిక్ కేర్ టిప్స్ ఉన్నాయి. ఇవి క్యూటికల్ కట్ అవ్వకుండా, చర్మం పగలకుండా మీ నెయిల్ ఆర్ట్ అద్భుతంగా కనబడుటానికి సహాయపడుతాయి. మరి ఆ చిట్కాలేంటో ఒక సారి చూద్దాం

మిల్కీ హ్యాండ్ వాష్:

మిల్కీ హ్యాండ్ వాష్:

ఎక్కువ సార్లు చేతులను కడగడం వల్ల చేతులు పొడి బారడం జరగుతుంది. కాబట్టి, కఠిన రసాయనాలు,ట్రై క్లోజన్ వంటి కఠిన రసాయానాలు కలిగిన సోపులను వాడటం వల్ల చేతులు పొడిబారడం, లేదా పగుళ్ళు ఏర్పడం జరుగుతుంది కాబట్టి యాంటీబ్యాక్టీరియల్ సోపులకు బదులుగా, టీట్రీ ఆయిల్ లేదా యూకలిప్టస్ ఆయిల్ వంటి నేచురల్ యాంటీబ్యాక్టిరియల్ సోపులను ఉపయోగించండి.

మీ చేతులను మీర చల్లగా (ఐస్ లో)లేద మరీ వేడిగా ఉన్న నీటిలో పెట్టకండి :

మీ చేతులను మీర చల్లగా (ఐస్ లో)లేద మరీ వేడిగా ఉన్న నీటిలో పెట్టకండి :

చల్లని నీరు , చర్మ కణాలను దెబ్బతీస్తుంది. దాంతో చర్మం ఎర్రగా మారుతుంది. అలాగే మరీ వేడిగా ఉన్న నీళ్ళతో చర్మం మీద పెళుసుగా ఏర్పడుతుంది.

లూబ్ అప్ ఆయిల్స్ :

లూబ్ అప్ ఆయిల్స్ :

ఆరోమా ఆయిల్స్ ను ఉపయోగించండి . నిపుణుల సలహా ప్రకారం కొన్ని బాడీ మసాజ్ ఆరోమా ఆయిల్స్ ను చేతులకు కూడా ఉపయోగించండి. బాగా పగిలిన చేతులకు సన్ ఫ్లవర్ ఆయిల్ చాలా బాగా సహాయపడుతుంది.

క్యూటికల్స్ సంరక్షణ పై సరైన అవగాహణ:

క్యూటికల్స్ సంరక్షణ పై సరైన అవగాహణ:

చేతులు మీద పలుచటి చర్మం చాలా సాధారణంగా పొడిబారుతుంటుంది. ఇలా పొడిబారినప్పుడు చాలా త్వరగా ఇన్ఫెక్షన్ అవుతుంది. దాంతో మీ చేతులు చూడటానికి అసహ్యంగా కనబడుతుంటాయి. కాబట్టి మీ చేతులుకు బాడీ స్ర్కబ్ తో ఎక్స్ ఫ్లోయేట్ చేసుకోండి.

సానిటరైజ్ తర్వాత చేతులకు మాయిశ్చరైజ్ చేసుకోవాలి:

సానిటరైజ్ తర్వాత చేతులకు మాయిశ్చరైజ్ చేసుకోవాలి:

ఈ చిట్కా మీకు తెలిసి ఉండకపోవచ్చు . కానీ ఇది చాలా ముఖ్యం. చేతులను శుభ్రం చేసుకొన్న తర్వాత మాయిశ్చరైజ్ రాయడం తప్పనిసరి దాంతో చర్మం మీద, గోళ్ళకు తగినంత తేమను అంధించి, చాలా త్వరగా పాలిష్ గా కనిబడుతాయి.

సన్ స్క్రీన్ :

సన్ స్క్రీన్ :

మీ ముఖంలో లాగే మీ చేతుల మీద కూడా ముడుతలు ఏర్పడుతాయి. కాబట్టి, వీటిని నివారించాలన్నా, సన్ టాన్ నివారించడానికి, చేతులను సున్నితంగా మార్చుకోవడానికి యస్ పి ఎఫ్ 40, కలిగిన సన్ స్క్రీన్ లోషన్ చేతులకు రాయాలి. ఇది రాసిన తర్వాత చేతులు పొడిబారడం జరగుతుంది. అలా ఉన్నప్పుడు యస్ పి ఎఫ్ 22ను ప్రయత్నించండి.

40ఏళ్ళ తర్వాత యాంటీ ఏజింగ్ ఫేస్ క్రీమ్స్ ను ప్రయత్నించండి:

40ఏళ్ళ తర్వాత యాంటీ ఏజింగ్ ఫేస్ క్రీమ్స్ ను ప్రయత్నించండి:

కొంతమంది రివైటలిఫ్ట్ ను ఉపయోగిస్తారు. ఇందులోని రెటినాల్ చర్మ ఎలాసిటిని మెరుగుపరుస్తుంది. కాబట్టి, ముడుతలను తగ్గించుకోవడానికి రాత్రి నిద్రించే ముందు యాంటీఏజింగ్ ఫేస్ క్రీములను అప్లై చేయండి.

మాస్క్:

మాస్క్:

బాదంతో తయారుచేసిన పేస్ట్ ను చేతులకు మాస్క్ లా వేసుకోవాలి. తర్వాత చేతులకు ఒక వెచ్చని టవల్ ను చుట్టాలి. ఇలా చేయడం వల్ల చేతులకు తగినంత వేడి అంధి, రక్త ప్రసరణ జరిగేలా సహాయపడుతుంది.

బయోటిన్ సప్లిమెంట్:

బయోటిన్ సప్లిమెంట్:

బయోటిన్ సప్లిమెంట్ లో విటమిన్ బి అధికంగా ఉంటుంది. ఇది గోళ్ళ మందాన్ని పెంచుతుంది మరియు గోళ్ళు చిట్లడాన్ని మరియు గోళ్ళ బ్రేక్ అవ్వడాన్ని తగ్గిస్తుంది 2.4మిల్లీగ్రాముల బయోటిన్ ను రెగ్యులర్ గా ప్రతి రోజు కొన్ని నెలలపాటు ఉపయోగించినట్లైతే మంచి ఫలితం ఉంటుంది.

అసిటోన్ తో కూడిన పాలిష్ రిమూవర్స్ ను నివారించండి:

అసిటోన్ తో కూడిన పాలిష్ రిమూవర్స్ ను నివారించండి:

డెర్మటాలజిస్ట్ ఈ ప్రొడక్ట్స్ నివారించమని సలహాలిస్తుంటారు. వీటి వల్ల గోళ్ళు చిట్లడం లేదా గోళ్ళు మద్యలో కట్ అవ్వడం జరుగుతుంటుంది.

English summary

10 Ways To Have Beautiful Hands

Day or night, home or outside your hands are on display every time. These few simple hand and nail care tips it won’t let ragged cuticles and cracked skin detract from your fabulous nail art.
Desktop Bottom Promotion