For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషులు కొరకు ప్రత్యేకమైన నేచురల్ షేవింగ్ క్రీములు

|

పురుషులు ప్రతి రోజూ నిద్రలేవగానే బ్రెష్ చేయగానే మొదట చేసే పనేంటో మీకు తెలుసా? వెంటనే షేవింగ్ కిట్ కోసం వెదుకుతాడు, షేవింగ్ కిట్ తో పాటు సాఫ్ట్ క్రీమను తీసుకొని ముఖం మీద అవాఛిత రోమాలాను తొలగించుకుంటారు. ఇది పురుషుల రెగ్యులర్ మరియు రొటీన్ కార్యక్రమం. అయితే కొంత మంది పురుషులు మాత్రం రెగ్యులర్ షేవింగ్ ను ఇష్టపడురు అందుకు కారణం లేకపోలేదు. వారి షేవింగ్ క్రీమ్ అలర్జీ మరియు ఇతర కారణాలు ఉండవచ్చు. కాబట్టి, షేవింగ్ క్రీములతో అలర్జీకి గురయ్యే వారు, రసాయనికంగా తయారుచేసిన షేవింగ్ క్రీములకు ప్రత్యామ్నాయంగా కొన్ని నేచురల్ షేవింగ్ క్రీములను ఎంపిక చేసుకోవడం ఉత్తమైన మార్గం.

పురుషులు వారి సున్నితమైన చర్మానికి రక్షణ కొసం కెమికల్ బేస్డ్ షేవింగ్ క్రీములకు ప్రత్యామ్నాయంగా ఉత్తమ నేచరుల్ షేవింగ్ క్రీములను ఉపయోగించుకోవచ్చు . ముఖ్యంగా చాలా సున్నితమైన చర్మం కలిగిన వారు స్కిన్ రాషెష్ మరియు కఠినమైన ప్రొడక్ట్స్ ఉపయోగించడానికి కొంత భయపడుతుంటారు. సున్నితమైన చర్మం కలిగిన వారు, షేవింగ్ క్రీముల రియాక్షన్ వల్ల ముఖంలో మొటిమలలు, ముఖం ఎర్రగా మారడం, మరియు ఇతర అనేక చర్మ సమస్యలకు గురిఅవ్వాల్సి వస్తుందని భయపడే వారు ఉన్నారు . కాబట్టి, అటువంటి భయాలు కలిగిన వారు ఈ ప్రత్యామ్నాయ షేవింగ్ క్రీములను ఉపయోగించడం ఉత్తమం.

మరి పురుషులకు నచ్చే ఈ ప్రత్యామ్నాయ షేవింగ్ క్రీములు ఏంటో ఒక సారి చూడండి. ఈ క్రింది ఇచ్చిన లిస్ట్ లో కొన్ని నేచురల్ షేవింగ్ క్రీములను కూడా గమనించవచ్చు . ప్రతి రోజూ షేవింగ్ చేసి అవాఛిత రోమాలు తొలగించుకోవడానికి ఈ నేచురల్ ఆల్టర్నేటివ్ షేవింగ్ క్రీములను కూడా ప్రతిరోజూ ఉపయోగించవచ్చు . లేదా వారానికికొకసారి కూడా ఉపయోగించుకోవచ్చు. మరి ఆ నేచురల్ షేవింగ్ క్రీములేంటో ఒక సారి చూద్దాం...

ఎసెన్సియల్ ఆయిల్:

ఎసెన్సియల్ ఆయిల్:

షేవింగ్ క్రీమ్ కు ఒక ఉత్తమ ప్రత్యామ్నాయ షేవింగ్ క్రీమ్ ఎసెన్షియల్ ఆయిల్. ఈ ఆయిల్ ను అవాంఛిత రోమాలు తొలగింపుకు బాగా సహాయపడుతుంది. అయితే ఈ పద్దతిని పాటించే వారు కొంత ఓపిక కలిగి ఉండాలి. ఈ ఆయిల్ షేవింగ్ క్రీముగానే కాదు, చర్మాన్ని సాఫ్ట్ గా చేస్తుంది. కాబట్టే దీన్ని రెకమెండ్ చేయబడింది.

షీబట్టర్:

షీబట్టర్:

మీరు సాఫ్ట్ మరియ సపెల్ స్కిన్ కోరుకుంటున్నట్లైతే , మీ ముఖం మీద అవాంఛిత రోమాల తొలగింపుకు, ఈ నేచురల్ ఆల్టర్నేటివ్ షేవింగ్ క్రీమును ఉపయోగించండి. షీ బటర్ ను ఒక ఉత్తమ మాయిశ్చరైజర్ గా ఉపయోగించుకోవచ్చు. అంతే కాదు ఇది ఒక ఉత్తమ స్కిన్ ప్రొడక్ట్ కూడా.

ఆప్రికాట్ పేస్ట్:

ఆప్రికాట్ పేస్ట్:

తాజాగా ఉండే ఆప్రికాట్ ను మెత్తని పేస్ట్ లా చేసి, ఈ పేస్ట్ ను ఫ్రిజ్ లో నిల్వ చేయాలి. మరుసటి రోజున దీన్ని ఉపయోగించాలి. ఈ ఆప్రికాట్ పేస్ట్ షేవింగ్ క్రీమ్ కు ఒక ఉత్తమ ప్రత్యామ్నాయం. ఈ ఆప్రికాట్ పేస్ట్ ను షేవింగ్ క్రీమ్ గా ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనం షేవింగ్ తర్వాత ఏర్పడే చర్మ సమస్యలను చాలా ప్రభావంతంగా తొలగిస్తుంది.

బాదాం పేస్ట్:

బాదాం పేస్ట్:

షేవింగ్ క్రీమ్ కు మరో అద్భుతమైన ప్రత్యామ్నాయ క్రీమ్ బాదాం పేస్ట్ . ఆప్రికాట్ పేస్ట్ ను తయారుచేసినట్లే బాదం పేస్ట్ ను కూడా తయారుచేసి ఉపయోగించడమే. అయితే ఇక్కడ బాదంను నీళ్ళల్లో నానబెట్టి పేస్ట్ చేసి ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. బాదం పురుషుల చర్మ సంరక్షణకు చాలా మంచిది . అందువల్ల సున్నిత చర్మం కలవారు ఈ నేచురల్ ఆల్టర్నేటివ్ షేవింగ్ క్రీమును ఉపయోగించండి.

డిష్ వాషింగ్ లిక్విడ్:

డిష్ వాషింగ్ లిక్విడ్:

డిష్ వాషింగ్ లిక్విడ్ స్కిన్ ఇరిటేషన్ తగ్గిస్తుంది. మీరు చాలా త్వరగా వెళ్లాల్సి వచ్చినప్పుడు మీకు ఫోమ్ దొరకనప్పుడు కొద్దిగా డిఫ్ వాషింగ్ లిక్విడ్ తో అవాంఛిత రోమాలను తొలగించుకోవచ్చు.

పీనట్ బట్టర్:

పీనట్ బట్టర్:

పీనట్ బటర్ కూడా, షేవింగ్ క్రీమ్ కు మరో ప్రత్యామ్నాయం . పురుషుల చర్మ సంరక్షణలో పీనట్ బట్టర్ ను ఎందుకు చేర్చబడిందంటే ఇది ఫోమ్ కంటే బెటర్ గా పనిచేస్తుంది. పీనట్ బట్టర్ షేవింగ్ చేసుకొన్న తర్వాత చర్మాన్ని సాఫ్ట్ గా మార్చుతుంది.

బాడీ లోషన్:

బాడీ లోషన్:

షేవింగ్ క్రీమ్ కు ప్రత్యామ్నాయంగా బాడీలోషన్ ను ఉపయోగించవచ్చు. ముఖం మీద అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి మీ భార్య లేదా గర్ల్ ఫ్రెండ్ ఉపయోగించే బాడీ లోషన్ ను షేవింగ్ క్రీమ్ గా ఉపయోగించుకోవచ్చు. అంతే కాదు సున్నిత చర్మం కలవారికి చాలా మంచిది.

సోప్:

సోప్:

షేవింగ్ క్రీములకు బదులు సోపులను ఉపయోగించే వారు కూడా చాలా మందే ఉన్నారు. ఇది షేవింగ్ క్రీమ్ కు ఒక ఉత్తమ ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవచ్చు.

షాంపు:

షాంపు:

మంచి సువాసన కలిగిన షాంపును ఇప్పుడు షేవింగ్ క్రీమ్ గా ఉపయోగిస్తున్నారు. కొన్ని చుక్కల షాంపును ఉపయోగించి ముఖంలో అవాంఛిత రోమాలను తొలగించుకోవచ్చు.

కండీషనర్:

కండీషనర్:

షేవింగ్ క్రీమ్ కు మరో ప్రత్యామ్నాయం కండీషనర్. సున్నిత చర్మం కలవారు దీన్ని చాలా వరకూ ఉపయోగిస్తున్నారు. ఎప్పుడైతే ముఖానికి కండీషనర్ ఉపయోగిస్తారో అప్పుడు ముఖంను మంచినీళ్ళతో బాగా కడిగి మరీ శుభ్రం చేసుకోవాలి.

English summary

Alternative Shaving Creams For Men

Do you know what is the first thing a man does as soon as he wakes up each morning after brushing his teeth? He takes his friendly shaver and soft cream to remove the unwanted hair from his face. It is a regular routine for men to shave their beard.
Desktop Bottom Promotion