For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిమ్మలోని అమేజింగ్ బ్యూటీ బెనిఫిట్స్...!

|

అందాన్ని మెరుగు పరుచుకోవడానికి ఎన్నో సహజసిద్ద పదార్థాలున్నాయి. అయితే వాటిలో నిమ్మకాయ కూడా ఒకటి. నిమ్మకాయ వల్ల బ్యూటి బెనిఫిట్స్ అధికం మరియు శక్తివంతమైనవి. ఎందుకంటే తక్షణ ప్రభావాన్ని చూపెడుతాయి. నిమ్మ కాయ వల్ల ముఖ్య బ్యూటీ బెనిఫిట్ శక్తివంతమైన బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. కాబట్టి, నిమ్మకాయ చర్మాన్ని మరియు కేశ అందాన్ని సహాజంగా మెరుగుపరుస్తుంది. నిమ్మకాయలో సిట్రస్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. అంతే కాదు ఇందులో యాంటీసెప్ టిక్ లక్షణాలకు కూడా ఎక్కువగా కలిగి ఉంటుంది. అందుకే అందానికి మాత్రమే కాదు కొన్ని చిన్న చిన్న అంటువ్యాధులను నివారించడానికి కూడా నిమ్మకాయను ఉపయోగిస్తుంటారు.

చాలా తరుచుగా, సాధారణంగా నిమ్మ కాయ చర్మానికి ఏవిధంగా మంచిచేస్తుందనే విషయం మాత్రమే తెలుసు . అలాగే కేశాలకు కూడా అనేక ప్రయోజనాలను కలిగిస్తుందిని తెలుసుకోండి. ఉదా: నిమ్మరసం తలకు మర్ధన చేయడం వల్ల హెయిర్ రూట్స్ ను స్ట్రాంగ్ గా ఉంచుతుంది. మరియు తలలోని చుండ్రును సులభంగా తొలగిస్తుంది. అంతే కాకుండా నిమ్మకాయ సిట్రస్ వాసనతో తల ష్రెష్ గా సువాసన బరితంగా చేస్తుంది.

నిమ్మకాలో చర్మ సౌందర్యానికి సంబంధించి అనేక బ్యూటీ బెనిఫిట్స్ కలిగి ఉన్నాయి. కేశాలు అలాగే గోళ్ళకు కూడా ఉపయోగకరమే. ఒక్క మాటలో చెప్పాలంటే బ్యూటీ విషయంలో అన్ని విధాల ఉపయగకరం. మిమ్మల్ని ఆశ్చర్య పరచడం అద్భుతంగా పనిచేస్తుందని చెప్పడానికి..రుజువు చేయడానికి ఈ క్రింది పద్దతులను ఫాలో అవ్వండి...

బ్లీచింగ్ స్కిన్:

బ్లీచింగ్ స్కిన్:

చర్మానికి నేచురల్ బ్లీచింగ్ గా పనిచేసి, చర్మ రంగును మెరుగుపరుస్తుంది. కాబట్టి నిమ్మ మరియు తేనె తో ఫేస్ ప్యాక్ వేసుకో్ండి. ఈ రెండింటి మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 5నిముషాలు అలాగే ఉంచి తర్వాత ఫేష్ వాష్ ను గోరువెచ్చని నీటితో చేసుకోవడం వల్ల మీ టాన్ తొలగిపోతుంది.

చుండ్రులేకుండా కాపాడుతుంది:

చుండ్రులేకుండా కాపాడుతుంది:

నిమ్మకాయ శక్తి వంతమైన డాండ్రఫ్ ఫైటర్. ఎందుకంటే నిమ్మ రసాన్ని తల మాడుకు మసాజ్ చేయాలి. తర్వాత నిమ్మరసం వల్ల తల పొడిబారుతుంది కాబట్టి వెంటే నూనె రాయాలి అరగంట తర్వాత మేలైన షాంపూతో తలస్నానం చేసుకుంటే చుండ్రు మటు మాయం అవుతుంది.

మోచేతులు మరియు మోకాళ్ళను మెరిపిస్తుంది:

మోచేతులు మరియు మోకాళ్ళను మెరిపిస్తుంది:

శరీరంలో ఇతర భాగాలకంటే మోచేతులు మోకాళ్ళు నల్లగా మారి ఉంటాయి. కాబట్టి ఒక చిన్న నిమ్మ తొక్కను తీసుకొని, దానికి కొద్దిగా ఉప్పు లేదా పంచాదారలో అద్దినల్లగా మారిన మోచేతులు మోకాళ్ళ మీద స్ర్కబ్ (రుద్దాలి). పది రోజుల్లో మీ మోకాళ్ళు మోచేతులు ఆశ్చర్యకరమైన మార్పు వస్తుంది.

స్కిన్ అలెర్జీ :

స్కిన్ అలెర్జీ :

నిమ్మలో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల మరియు యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉండటం వల్ల చిన్న చిన్న స్కిన్ అలెర్జీలను నుండి మనల్ని కాపాడుతుంది.

నిమ్మరసంతో సాఫ్ట్ హెయిర్:

నిమ్మరసంతో సాఫ్ట్ హెయిర్:

కేశ సంరక్షణకు నిమ్మరసం మంచి కండీషనర్ గా ఉపయోగపడుతుంది. మీరు నేచురల్ హెయిర్ వాష్ అంటే శీకాకాయ్ లేదా రీతా వంటివి ఉపయోగించేటప్పుడు మరే ఇతర కండీషనర్లు ఉపయోగించకుండా నిమ్మరసంతో కండీషన్ చేసుకోవడం వల్ల హెయిర్ సాఫ్ట్ గా మారుతాయి.

చర్మ రంధ్రాలను శుభ్రపరుస్తుంది:

చర్మ రంధ్రాలను శుభ్రపరుస్తుంది:

చర్మాన్ని శుభ్రపరచడంలో నిమ్మ రసం బెస్ట్ నేచురల్ క్లెన్సర్. నిమ్మ తొక్కను ఉప్పు లేదా పంచదారలో అద్ది ముఖం మీద మర్ధన చేయాలి. దాంతో ముఖంలో ఉన్న చర్మ రంధ్రాలు శుభ్రపడి, మురికి అంతా తొలగిపోతుంది.

మొటిమలను నివారిస్తుంది:

మొటిమలను నివారిస్తుంది:

మొటిమలను నివారించడానికి నిమ్మకాయ బాగా పనిచేస్తుంది . నిమ్మలోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు చర్మాన్ని శుభ్రం చేసి, ఆయిల్ ను తొలగిస్తుంది.

ఏజింగ్:

ఏజింగ్:

నిమ్మ సిట్రస్ ఫ్రూట్ అంటారు. ఎందుకంటే ఇందులో ఫుష్కలమైన యాంటీఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఈ యాంటీఆక్సిడెంట్స్ చర్మంలో చైతన్య నింపుతుంది మరియు వృద్ధాప్య ప్రక్రియవేగాన్ని అండుకొనేందుకు సహాయకారిగా పనిచేస్తుంది.

హెయిర్ స్మెల్:

హెయిర్ స్మెల్:

నిమ్మకాయ మంచి లక్షణాలను కలిగి ఉండటమే కాదు కేశాలు అద్భుతమైన సువాసన భరితంగా చేస్తుంది. నిమ్మరసంతో తలస్నానం చేసినప్పుడు కేశాలు తాజాగా సువాసనతో మెరిపిస్తుంటాయి. ఇది కేశాలకు నేచురల్ ఫెర్ఫ్యూమ్.

ఆయిల్ స్కిన్:

ఆయిల్ స్కిన్:

చర్మ రంధ్రాలలోని నూనెను సోక్ చేస్తుంది. ఆయిల్ స్కిన్ ఉన్నవారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ముఖం జిడ్డుగా అనిపించినప్పుడు చర్మాన్ని నిమ్మ తొక్కతో రుద్దడం వల్ల మంచి ఫలితం పొందవచ్చు.

 తెల్లని గోళ్ళు:

తెల్లని గోళ్ళు:

నిమ్మలోని బ్లీచింగ్ గుణాలు చేతి గోళ్ళను శుభ్రపరచడానికి కూడా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ వారి గోళ్ళు క్లీన్ గా తెల్లగా ఉంచుకోవాలని కోరుకుంటారు. కాబట్టి మస్టర్ ఆయిల్ ల్లో నిమ్మ తొక్కను అద్ది గోళ్ళమీద రుద్దడం వల్ల అద్భుతమైన గోరు అందాన్ని పొందవచ్చు.

English summary

Amazing Beauty Benefits of Lemon | నిమ్మకాయలోని సౌందర్య రహస్యాలు

Lemon is one of the most versatile natural ingredients to enhance your beauty. The beauty benefits of lemon are numerous and very potent. One of the main beauty benefits of lemon is that it works as natural bleach. So, lemon lightens skin and hair naturally. It is citrus and thus has many antiseptic properties. That is why the beauty benefits of lemon also includes curing minor infections.
Desktop Bottom Promotion