For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అందాన్ని మెరుగుపరుచుకోవడంలో గుడ్డు ప్రాధాన్యత..!

|

కొంత మంది తమను తమూ ఎగ్ టేరియన్స్ గా చెప్పకుంటుంటారు. అందుకు కారణం వారు మాంసాహారం తీసుకోకపోయినా గుడ్డులో అధిక పోషకాలు ఉన్నందు వల్ల, గుడ్డును తినడానికి ఎక్కువగా ఇష్టపడటం వల్ల ఎగేటేరియన్లుగా ఫిక్స్ అయిపోతారు. అంతే కాకుండా గుడ్డును మాసాంహరం అంటారు. కానీ చాలా మంది శాకాహారంగా నే భావిస్తున్నారు కాబట్టే శాకాహారులు కూడా గుడ్డును తినడం మొదలు పెట్టేసారు. గుడ్డులో చెప్పుకోలేనన్ని ఆరోగ్యప్రయోజనాలు మొండుగా ఉన్నాయి. గుడ్డు మంచి పౌష్టికాహారం. చిన్నపిల్లలు మొదలుకొని, ముసలివారి వరకు డాక్టర్లు గుడ్డు తినమని చెబుతారు. కోడిగుడ్డు ఎదిగే పిల్లలకు చాలినన్ని ప్రొటీన్లను అందజేస్తుంది. పోష కాహారలేమితో బాధపడేవారిని రోజుకో గుడ్డు తినాల్సిందిగా వైద్యులు సలహాలిస్తుంటారు. గుడ్డులో పలురకాల లవణాలు, అరుదైన లవణాలతో పాటు ఫాస్పరస్‌, అయోడిన్‌, సెలీనియం, ఐరన్‌, జింక్‌లు ఉన్నాయి. ఇవన్నీ శరీరానికి మేలుచేసేవే.

మరి శరీరానికి మాత్రమే కాదు అందానికి కూడా అద్భతమైన ప్రయోజనాలను అందిస్తుంది. గుడ్డును ముఖానికి మరియు కేశాలకు అప్లై చేస్తే అనేక బ్యూటీ బెనిఫిట్స్ తో మీకు ఆశ్చర్యం కలగక మానదు. గుడ్డు చర్మానికి అద్భుత ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా మెటిమలు మరియు చర్మాన్ని టైట్ చేయడంలో, పొడిబారిన మరియు ఆయిల్ చర్మానికి అద్భుతంగా పనిచేసి మంచి ఫలితాలను అందిస్తుంది. మొట్టిమలు, నల్లమచ్చలు తొలగిస్తుంది. ఫేస్ ప్యాక్ లలో గుడ్డును చేర్చడం వల్ల ముఖంలో కొత్తమెరుపులు తీసుకొస్తుంది.

అలాగే కేశాలకు కూడా అద్భుతమైన ప్రయోజనాలను కలిగిస్తుంది. దీన్ని నేచురల్ కండీషనర్ గాను మరియు కేశాలను మ్రుదువుగా మార్చడానికి మరియు షైనింగ్ పెంచుకోవడానికి సహజంగా కేశ సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి గుడ్డును ఉపయోగిస్తారు. మరి గుడ్డులోని మరిన్ని బ్యూటీ బెనిఫిట్స్ ఏంటో ఒకసారి చూద్దామా...

గుడ్డులో కూడా బోలెడు బ్యూటీ బెనిఫిట్స్...!

ఆయిల్ స్కిన్: ఆయిల్ స్కిన్ పోగొట్టడంలో బాగా సహాయపడుతుంది. గుడ్డులోని తెల్లసొనను సాండిల్ ఉడ్ పౌడర్ లో మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయడం వల్ల జిడ్డు వదిలిపోతుంది.

గుడ్డులో కూడా బోలెడు బ్యూటీ బెనిఫిట్స్...!

మొటిమల నివారణ: మొటిమలను నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఎగ్ వైట్ ఫేషియల్ మసాజ్ చర్మరంద్రాలను టైట్ చేసి మొటిమలను నివారిస్తుంది.

గుడ్డులో కూడా బోలెడు బ్యూటీ బెనిఫిట్స్...!

చర్మాన్ని సున్నితంగా మార్చుతుంది: గుడ్డును పెరుగుతో మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేడం వల్ల చర్మ సున్నితంగా మారుతుంది. మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది.

గుడ్డులో కూడా బోలెడు బ్యూటీ బెనిఫిట్స్...!

సన్ టాన్: ఇది మరో బ్యూటీ బెనిఫిట్. గుడ్డును తేనె మరియు నిమ్మరసంతో మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయడం వల్ల సన్ టాన్ మరియు డార్క్ స్పాట్స్ ను తొలగించి మిమ్మల్ని అందంగా ఉంచుతుంది.

గుడ్డులో కూడా బోలెడు బ్యూటీ బెనిఫిట్స్...!

హెయిర్ మాయిశ్చరైజర్: మీ కేశాలను సుతిమెత్తగా మరియు ఆరోగ్యంగా నిర్వహించాలంటే గుడ్డును ఉపయోగించాల్సిందే. కేశాలను సున్నితంగామార్చుతుంది. ఒత్తిగా, మంచి మెరుపుతో ఉంటుంది.

గుడ్డులో కూడా బోలెడు బ్యూటీ బెనిఫిట్స్...!

చుండ్రు నివారణకు: కేశ సంరక్షణలో చుండ్రు ప్రాధన కారణం. చుండ్రుకు గుడ్డుతో ట్రీట్మెంట్ చేయవచ్చు. గుడ్డును తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేసుకోవడం వల్ల చుండ్రు వదిలిపోతుంది.

గుడ్డులో కూడా బోలెడు బ్యూటీ బెనిఫిట్స్...!

జుట్టురాలడాన్ని అరికడుతుంది: గుడ్డుతో హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల జుట్టు రాలడాన్ని అరికడుతుంది. తలలోని చర్మ సమస్యలను, దురద, మొటిమలను నివారిస్తుంది. గుడ్డును నిమ్మ, హెయిర్ ఆయిల్ తో మిక్స్ చేసి తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. హెయిర్ ఫాల్ తగ్గుతుంది.

గుడ్డులో కూడా బోలెడు బ్యూటీ బెనిఫిట్స్...!

కేశాలు జిడ్డును తగ్గిస్తుంది: వేసవిలో చాలా వరకూ మన కేశాలు జిడ్డుగా మారుతాయి. మరియు చిక్కుకూడా ఎక్కువే. ఈ రెండి సమస్య నివారణకు గుడ్డు అద్భుతంగా పనిచేస్తుంది.

గుడ్డులో కూడా బోలెడు బ్యూటీ బెనిఫిట్స్...!

నల్లటి వలయాలను పోగొడుతుంది: ఎగ్ వైట్ ను బాగా గిలకొట్టి కళ్ళ క్రింద అప్లై చేయాలి. ఇది తడి ఆరిన తర్వాత తిరగి మరో సారి అప్లై చేసి అదీ ఆరిన తర్వా త శుభ్రం చేసుకోవచ్చు. అలాగే కీరదోస ముక్కలను కూడా కళ్ళమీద పెట్టుకోవడం వల్ల డార్క్ సర్కిల్స్ తగ్గిస్తుంది.

Story first published: Friday, April 5, 2013, 15:52 [IST]
Desktop Bottom Promotion