For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తరచూ గోళ్లు విరిగిపోతుంటే! తీసుకోవల్సిన జాగ్రత్తలు

|

వేలిపై గోరు కింది భాగం గులాబీ రంగులో కనిపించాలి. అలా కాకుండా తెల్లగా, నలుపులో కనిపించినా, పైన ముడతలు పడినట్టుగా ఉన్నా గోరు ఆరోగ్యం బాగోలేదని గుర్తించాలి. అలాగే గోళ్లు విరిగిపోతుండటం, పలచబడటం వంటివి కనిపిస్తున్నా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. గోళ్లు బలంగా ఉండటానికి వైద్యుల సలహాతో పాటు ఆహార వ్యవహారాలలోనూ తగినంత జాగ్రత్త వహించాలి.

గోళ్లు విరిగిపోతున్నాయి అని అదేపనిగా ఎక్కువసార్లు మెనిక్యూర్ చేయించకూడదు. కనీసం వారం రోజుల వ్యవధి ఇవ్వాలి. గోళ్లు విరిగిపోవడానికి క్యాల్షియం లోపం, ఇతరత్రా సమస్యలు ఉన్నాయేమో వైద్యులను సంప్రదించి తెలుసుకోవాలి

గోళ్లను కొరకడం మానేయాలి. అందుకు కారణమైన మానసిక ఒత్తిడి, ఇతరత్రా ఆందోళన కలిగించే పనులు, సమస్య లను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి

Get Rid Of Brittle Nails

ఇంటి పనుల్లో ముఖ్యంగా క్లీనింగ్ (ఉతకడం, కడగడం, తుడవడం, ఇంటి శుభ్రత కు రసాయనాలను ఉపయోగించడం.. వంటివి) సమయంలో రబ్బర్ గ్లౌజ్‌లను ఉపయోగించాలి. నీటిని గోర్లు, గోరు చుట్టూ ఉండే పోర్స్ త్వరగా లాగేస్తాయి. అందుకని పనులు పూర్తయిన తర్వాత తడి లేకుండా తుడుచుకోవాలి

శరీరం హైడ్రేట్ కాకుండా ఉండటానికి రోజూ పది గ్లాసుల వరకు మంచినీరు తాగాలి

రాత్రి పడుకునే ముందు గోరు, గోరు చివర్ల చర్మం మృదువుగా మారడానికి హ్యాండ్‌మసాజ్ క్రీమ్ లేదా నూనెతో మసాజ్ చేసుకోవాలి

గోళ్లతో డబ్బా మూతలను తీయడానికి ఉపయోగించకూడదు

మూడు రోజులకు ఒకసారైనా పాత నెయిల్ పాలిష్‌ను తొలగించాలి

గోళ్లలో ఫంగస్ ఏర్పడితే టీ-ట్రీ ఆయిల్‌ను రోజూ రెండు పూటలా మసాజ్‌కు వాడాలి. యాంటీ ఫంగల్ మెడిసిన్స్ తీసుకోవాలి. ఫంగస్ ఉంటే నీటి తడి ఎక్కువ సేపు లేకుండా జాగ్రత్త పడాలి.

సమతుల ఆహారం:
గోళ్లు బలంగా ఉండాలంటే రోజూ కప్పు గ్రీన్ టీ సేవించాలి

బార్లీ, నట్స్, సోయా.. తీసుకునే ఆహారంలో చేర్చాలి

గోళ్లు పెలుసుగా మారుతున్నాయంటే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ లోపం వల్ల అయ్యుంటుంది. అందుకని చేపలు, చేప నూనెలు, కుసుమ నూనెలు ఆహారంలో విరివిగా చేర్చాలి. గోళ్ల మీద తెల్లటి చుక్కలుగా ఏర్పడటానికి కారణం జింక్ లోపం అయ్యుంటుంది. అందుకే మాంసం, గుడ్లు, చేపలను ఆహారంలో చేర్చాలి. వీటి బదులుగా ఛీజ్, బీన్స్, నట్స్, గోధుమ ఊక వంటివి కూడా తీసుకోవచ్చు.

మసాజ్ ముఖ్యం:
గోళ్లు పొడిగా, పెళుసుబారినట్టు ఉంటే రాత్రి పడుకునేముందు పెట్రోలియమ్ జెల్లీతో మసాజ్ చేయాలి. రాత్రి పడుకునేముందు చేతులకు కాటన్ గ్లౌజ్‌లను వాడచ్చు

ఇంటి పనుల్లో రబ్బర్ గ్లౌజ్‌లను ఉపయోగించేవారు వాటిని శుభ్రంగా ఉంచాలి. లేదంటే ఇన్ఫెక్షన్ సమస్యలకు దారితీయవచ్చు

నెయిల్ పాలిష్‌ను తొలగించడానికి ఎసెటేట్ బేస్డ్ రిమూవర్స్ వాడటం మేలు.

ఈ జాగ్రత్తలు పాటిస్తే గోళ్లు అందంగా కనిపిస్తాయి. వేలి కొసల్లో చిరునవ్వులు చిందిస్తాయి.

స్పా, బ్యూటీ సెలూన్లలో గోళ్లను శుభ్రపరచడానికి, అందంగా మలచడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటిలో ఇంటెన్స్ మాయిశ్చరైజింగ్, క్లాసిక్, రేడియంట్ మెనిక్యూర్, పెడిక్యూర్ మొదలైనవి. స్పా పెడిక్యూర్‌లో ముందు వేడినీటిలో షాంపూ కలిపి, కాసేపు వేళ్లను ముంచి ఉంచుతారు. తర్వాత స్క్రబ్ చేసి, మసాజ్ క్రీమ్ వాడతారు. చేతులు, పాదాల రక్తప్రసరణ కోసం ఎక్కువ సేపు మసాజ్ చేస్తారు. అలాగే ప్యాక్ ప్రీమియమ్ ఉత్పత్తులను వాడతారు. ఇన్‌స్టంట్ మెనిక్యూర్, పెడిక్యూర్‌లను గోళ్లు పగుళ్లు వచ్చినప్పుడు ఉపయోగిస్తారు. మెనిక్యూర్, పెడిక్యూర్‌కి విడివిడిగా హ్యాండ్, ఫుట్ మసాజ్ క్రీమ్‌లను తప్పక వాడాలి.

English summary

Get Rid Of Brittle Nails

Do you have brittle and weak nails which make your hands look awful? Don't worry. There are a variety of nail treatments available nowadays which can give your nails a lovely look and make them healthy. But these treatments are very expensive.
Story first published: Friday, November 1, 2013, 10:35 [IST]
Desktop Bottom Promotion