For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెదాల ఆకర్షణకు ఇంట్లోనే ఉందిగా ఓ బ్యూటీ కిట్....!

|

వాతారణంలో మార్పులు శరీరంపై అనేక ప్రభావాలను చూపుతుంది. చలికాలం మెళ్ళిగా జారకుంటోంది. మన శరీరంలో కూడా చాలా మర్పులు చోటు చేసుకుంటాయి. వేసవికాలంలో రాబోతుంది కాదా చర్మం పగుళ్లు తగ్గుతాయనుకుంటే పొరపాటే. పెదవుల పైన చర్మం పొరలుగా వచ్చేయడం, పగుళ్లు బారడం ఎండాకాలంలో కూడా కనిపిస్తుంది. పెదవుల పగుళ్లు సర్వసాధారణం. దీన్ని పట్టించుకోకపోతే పెదవులు నల్లగా మారే అవకాశం కూడా ఉంది. చర్మం సంరక్షణ కంటే పెదవుల సంరక్షణ వేసవిలో చాలా అవసరం..ముఖ్యం.

అందుకు కొన్ని హోం రెమెడీస్(వంటింటి చిట్కాలను)పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ నేచురల్ వస్తువులు పెదాల పొడిబారడం మరియు పగుళ్ళ, ఇతర సమస్యల నుండి రక్షిస్తాయి. హోం రెమడీస్ లో ఉదాహరణకు కొబ్బరి నూనె పెదాలకు మర్దన చేయడం వల్ల నేచురల్ గా మార్పు వస్తుంది. పెదాలను అందంగా... ఆకర్షణీయంగా మార్చే మరొకొన్ని హోం రెమడీస్ మీకోసం.

పెదాల ఆకర్షణకు ఇంట్లోనే ఉందిగా బ్యూటీ కిట్.!

కొబ్బరి నూనె లేదా కోకోనట్ బట్టర్: పెదాల మీద పగుళ్ళు ఉన్నా లేకున్నా కూడా ప్రతి రోజూ పడుకోబోయే ముందు కొబ్బరినూనె లేదా కొబ్బరి వెన్న ను పెదాలకు రాసుకోవాలి. దాంతో పెదాలు పొడిబారనియకుండా చేస్తుంది. కొబ్బరి నూనెలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ పెదాలు, చర్మంమీద మంచి ప్రభావం చూపించి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది.

పెదాల ఆకర్షణకు ఇంట్లోనే ఉందిగా బ్యూటీ కిట్.!

తేనె: రెండు మూడు చుక్కలను మీ చేతి వేళ్ళతో తేనె తీసుకొని, పెదాల మీద సమంగా మర్ధన చేయాలి. తేనె పెదాలను మాయిశ్చరైజ్ చేసి పెదాలను సున్నితంగా ఉంచి, పగుళ్ళ నుండి కాపాడుతుంది.

పెదాల ఆకర్షణకు ఇంట్లోనే ఉందిగా బ్యూటీ కిట్.!

కీరదోసకాయ: కీరదోసకాయ ముక్కలు ఎక్కువగా నీటి శాతాన్ని కలిగి ఉంటుంది. ఇది కూడా ఒక బెస్ట్ రెమడీగా చెప్పొచ్చు. ఇది పెదాల పగుళ్ళను బాగుచేయడమే కాకుండా చర్మసమస్యలను కూడా నివారిస్తుంది. తాజా కీరదోసకాయను స్లైస్ గా కట్ చేసి రోజులో రెండు సార్లు పెదాలు, ముఖం మీద మసాజ్ చేసినట్లైతే మంచి ఫలితం ఉంటుంది.

పెదాల ఆకర్షణకు ఇంట్లోనే ఉందిగా బ్యూటీ కిట్.!

అలోవెరా: అలోవెరా పొడచర్మం బారీ నుండి కాపాడటమే కాకుండా పొడిబారిన పెదాలను, పగిలిన లేదా చీలిన పెదాలను సున్నితంగా మార్చుతుంది.

పెదాల ఆకర్షణకు ఇంట్లోనే ఉందిగా బ్యూటీ కిట్.!

టమోటో: ప్రతి రోజూ టమోటోలను వివిధ రాకలు గా వినియోగిస్తుంటాం. టమోటోను చిన్న ముక్కగా కట్ చేసి పెదాల మీద రుద్దాలి. టమోటోలో ఉన్న జ్యూస్ పెదాల పగుళ్ళను నేచురల్ గా అరికడుతుంది.

పెదాల ఆకర్షణకు ఇంట్లోనే ఉందిగా బ్యూటీ కిట్.!

లిప్ స్టిక్స్: పెదాలు పగలగానికి లేదా చీలడానికి లిప్ స్టిక్స్ కూడా కారణమే. ఒక వేళ మీ పెదాలు పొడిగా అనిపిస్తుంటే అటువంటి సమయంలో లిప్ స్టిక్ వాడకాన్ని తగ్గించండి లేదా మానేయండి. లిప్ స్టిక్ కు బదులు నేచురల్ లిప్ గ్లాస్ ఉపయోగించండి.

పెదాల ఆకర్షణకు ఇంట్లోనే ఉందిగా బ్యూటీ కిట్.!

నీళ్ళు: పెదాల పగుళ్ళు, పొడిబారడం, చీలడం వంటి వాటికి డీహైడ్రేషన్ కూడా ఒక కారణమే. అందుకు ప్రతి రోజూ తగినన్ని నీటిని తాగుతుండాలి.

పెదాల ఆకర్షణకు ఇంట్లోనే ఉందిగా బ్యూటీ కిట్.!

లెమన్-హనీ బామ్: పగిలిన లేదా చీలిన పెదాలకు ఇది చాలా ప్రభావవంతమైన హోం రెమడీ. నిమ్మరసం చర్మం మీద ఉన్న మలినాలను తొలగిస్తుంది. డెడ్ స్కిన్ తొలగిస్తుంది. తేనె మాయిశ్చరైజర్ గా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్ తో పెదాలపై మర్దన చేయడం వల్ల పెదాలు సున్నితంగా, ఆకర్షణీయంగా మారుతాయి. దీన్ని రోజుకు రెండు సార్లు అప్లై చేసినట్లైతే మంచి ఫలితాలు పొందవచ్చు.

పెదాల ఆకర్షణకు ఇంట్లోనే ఉందిగా బ్యూటీ కిట్.!

పెరుగులేదా వెన్న లేదా వెన్న: మీగడ, పెరుగులాంటి వాటిలో ఏదైనా ఒకదానిని పెదవుల మీద రాసుకున్నట్లయితే పెదవులు మృదువుగా నిగనిగలాడుతూ వుంటాయి.

పెదాల ఆకర్షణకు ఇంట్లోనే ఉందిగా బ్యూటీ కిట్.!

గులాబీ రేకులు: పెదవులు నల్లగా వున్నవారు. గులాబీ రేకు లను నీటిలో నానపెట్టి రాత్రి పడుకునే ముందు పదే పదే రాస్తూ వుంటే పెదవులు ఎర్రగా వుంటాయి. ఇలా చేయటం వలన పెదవులకు మంచి రంగు వస్తుంది.

పెదాల ఆకర్షణకు ఇంట్లోనే ఉందిగా బ్యూటీ కిట్.!

ఆలివ్ ఆయిల్: పెదవులపై ఆలివ్ ఆయిల్ ని రోజుకి రెండుసార్లు రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.

పెదాల ఆకర్షణకు ఇంట్లోనే ఉందిగా బ్యూటీ కిట్.!

బీట్ రూట్: పెదవులు నల్లగా అందవిహీనంగా ఉంటే బీట్ రూట్ ముక్కతో పెదవులను బాగా రుద్దితే మెరుపు సంతరించుకుంటాయి.

English summary

Home Remedies To Cure Dry Lips | పెదాల ఆకర్షణకు ఇంట్లోనే ఉందిగా బ్యూటీ కిట్.!

Lip care is very important especially when there is a change in season. Chapped lips are characterized as dry and cracked skin. Even after applying lip balm regularly, the dry lips hardly cure. So, you can opt for some home remedies to cure dry lips and keep them soft. Coconut oil for example is one effective lip care natural ingredient that cures dryness and also prevents the lips from cracking. Check out other home remedies to cure dry lips.
Story first published: Thursday, February 7, 2013, 15:01 [IST]
Desktop Bottom Promotion