For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నాజుగ్గా మారడానికి డైటింగ్ ఎలా పడితే అలా చేసేస్తే ఎలా...?

|

సన్నగా కనబడడానికి, సన్నపడడానికి చాలా మంది టీనేజర్స్ పడరాని పాట్లు పడుతున్నారు. జిమ్‌ల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. బ్యూటీషియన్లకు వేలకు వేలు సమర్పించుకుంటున్నారు. ఇన్ని తిప్పలు పడినా ఫలితం ఆవగింజలో అరభాగం కూడా వుండడంలేదు. వీరి ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. కొన్ని రోజుల పాటు కొన్ని రకాల జబ్బులు కూడా వచ్చి పడుతున్నాయి. రోజుల తరబడి కడుపు మాడ్చుకోవడం వలన జీవప్రక్రియ దెబ్బతింటుంది. దీని ప్రభావం కండరాల మీద పడుతుంది. చిన్న వయసులోనే కీళ్ళనొప్పులు, ఎక్కువ దూరం నడవలేకపోవడం వంటివి బాధిస్తాయి.

సన్నగా, నాజూగ్గా కావాలని కోరుకునేవారు చాలామందే ఉంటారు. అయితే నలుగురూ లావుగా ఉన్నావంటూ వెక్కిరిస్తున్నారనే తొందరలో అప్పటికున్న ఆరోగ్య పరిస్థితులు, శారీరక, మానసిక సామర్థ్యాలను పట్టించుకోకుండా ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు డైటింగ్‌ చేసేస్తే నాజూకుతనం మాట ఎలా ఉన్నా, ఉన్న ఆరోగ్యానికే ముప్పు ఏర్పడి మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. అందుకే డైటింగ్‌ చేయబోయే ముందు కొన్ని నియమ నిబంధనలు తెలుసుకోవడం ముఖ్యం. అవేంటో చూద్దాం!

సన్నబడ్డం కోసం డైటింగ్ ఎలా పడితే అలా చేసేస్తే ఎలా..?

డైయట్ ప్లాన్: మీరు అధిక బరువుతో బాధపడుతూ డైటింగ్‌ చేయాలనుకుంటున్నపుడు ముందుగా డైటీషియన్‌ను కలవండి. అనుభవజ్ఞులైనవారు ఇచ్చిన సూచనల మేరకు డైటింగ్‌ను ప్రారంభించండి. డైటింగ్‌ మొదలు పెడుతున్నారు అంటే అప్పటివరకు మీరు ఎంతో ఇష్టంగా భుజిస్తున్న చాలా రుచులకు దూరం కావాల్సి ఉంటుంది. అలా మీ కిష్టమైనవి మీరూ రోజూ అపరిమితంగా తినేవి, అలవాటుగా భోజనంతో పాటు లేదా భోజనానికి బదులు తీసుకునేవి ఏంటో జాబితా రాసుకోండి. ముందుగా వాటికి దూరంగా ఉండడానికి మానసికంగా సిద్ధంకండి. ముందుగానే ఇవి తినడం వల్లే నేను ఇలా తయారవుతున్నాననే వ్యతిరేక భావనకు రండి. అప్పుడే మీరు వాటికి దూరంగా ఉండగలుగుతారు. ఆ తరువాత ఆహార నియంత్రణ చేయటం చాలా సులభం.

సన్నబడ్డం కోసం డైటింగ్ ఎలా పడితే అలా చేసేస్తే ఎలా..?

అధిక బరువు: లావుగా ఉన్నంత మాత్రాన మీరు అధిక శక్తిమంతులు కాదు అనే విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే ఆరోగ్యం విషయంలో కూడా. అందుకే డైటింగ్‌ ప్రారంభానికి ముందు మీ శారీరక, మానసిక సామర్థ్యాల స్థితిని అంచనా వేసుకోండి. దానికి సంబంధించి అవసరమైతే డాక్టరును సంప్రదించండి.

సన్నబడ్డం కోసం డైటింగ్ ఎలా పడితే అలా చేసేస్తే ఎలా..?

శరీరాకృతి: మీ మొత్తం శరీరాకృతిని నిలువుటద్దం ముందు చూసుకోండి. ఏ ప్రదేశం మీ అందమైన శరీరాకృతికి భంగం కలిగిస్తుందో గుర్తించండి. అది సరైన ఆకృతిలోకి రావాలంటే డైటింగ్‌ తప్పనిసరని భావించండి. పదే పదే మీరు ఇలా చేయటం, కొద్దిరోజులకే వచ్చే మార్పును గమనించి చూసుకోవటం చేస్తే ఇంకా అందంగా నాజూగ్గా తయారవ్వాలన్న ఉత్సాహం కలుగుతుంది. డైటింగ్‌ కచ్చితంగా అమలుచేయాలన్న పట్టుదలా ఏర్పడుతుంది. ఇవి చాలు మిమ్మల్ని క్రమం తప్పకుండా ఆహార నియమాలు పాటించేలా చేయడానికి.

సన్నబడ్డం కోసం డైటింగ్ ఎలా పడితే అలా చేసేస్తే ఎలా..?

సంతోషంగా ఉండటంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి: డైటింగ్‌ను మీకొక శిక్షగా భావించకండి. అది మీకు శక్తినిస్తూ, మిమ్మల్ని అందంగా, ఆరోగ్యంగా, నాజూకుగా తయారుచేసే ఒక సాధనంగా అనుకోండి. అలాగే నవ్వుతూ, ఆనందంగానే పూర్తి ఇష్టంతోనే అవసరమైన ఆహార నియమాలు పాటించండి. అప్పుడే మీరు నిజమైన ఫలితాలు పొందగలుగుతారు.

సన్నబడ్డం కోసం డైటింగ్ ఎలా పడితే అలా చేసేస్తే ఎలా..?

యోగా: సరైన ఆహార నియమాలు పాటించడంతో పాటు ప్రాణాయామం, యోగా వంటివి క్రమం తప్పకుండా చేస్తే అవి మరింత శక్తిని మీకందించటంలో తోడ్పడతాయి. మీకిష్టమైన వంటలను కూడా డైటింగ్‌కు అనుకూలంగా తయారు చేసుకోవచ్చు. ఇలా చేస్తే డైటింగ్‌కూడా బావుందనిపిస్తుంది.

సన్నబడ్డం కోసం డైటింగ్ ఎలా పడితే అలా చేసేస్తే ఎలా..?

వాకింగ్ లేదా మ్యూజిక్: ఏదొక పనిలో నిమగ్నమై ఉండటం, ఖాళీ సమయంలో నడక, మ్యూజిక్‌ వినటం వంటివి మీలో వ్యతిరేక ఆలోచనల్ని దూరం చేస్తాయి.

సన్నబడ్డం కోసం డైటింగ్ ఎలా పడితే అలా చేసేస్తే ఎలా..?

వర్క్: మిమ్మల్ని మీరు గౌరవించుకోవటం, మీలోని మార్పులను చూసుకుని మీతో మీరే మాట్లాడు కుంటూ ఆనందాన్ని వ్యక్తం చేసుకోవటం అప్పుడప్పుడూ చేస్తూ ఉంటే చేసే పనిపై ఆసక్తి పెరుగుతుంది.

సన్నబడ్డం కోసం డైటింగ్ ఎలా పడితే అలా చేసేస్తే ఎలా..?

వ్యాయామం: శరీరానికి క్రమంతప్పకుండా రోజూ వ్యాయామం లేకపోతే ఎలాంటి డైటింగ్‌ అయినా సత్ఫలితాలను ఇవ్వదు. ఇది ప్రధానంగా గుర్తుంచుకోవలసిన విషయం. ఎంత చక్కగా ఆహారనియంత్రణ అమలుచేసినా వ్యాయామం ప్రధానం.

సన్నబడ్డం కోసం డైటింగ్ ఎలా పడితే అలా చేసేస్తే ఎలా..?

ఒత్తిడి: ఒత్తిడికి దూరంగా ఉండాలి, మరీముఖ్యంగా మానసిక ఒత్తిడి బారిన పడకుండా అవసరమైన టెక్నిక్స్‌ పాటిస్తూ ఉత్సాహంగా డైటింగ్‌ కొన సాగిస్తే మీరు కోరుకున్న మార్పులన్నీ మీసొంతం. అందం, ఆరోగ్యంతో సహా.

సన్నబడ్డం కోసం డైటింగ్ ఎలా పడితే అలా చేసేస్తే ఎలా..?

నీరు: 60 నుంచి 70 శాతం ఆహారం తీసుకొని మిగతా 30 నుంచి 40 శాతం నీటిని తాగాలి. అంటే రోజుకి 12 గ్లాసుల నీరు తాగడం తప్పనిసరి. భోజనం తర్వాత కొంచె వేడి నీరు త్రాగడం మంచిది. ఒక రోజుకు 8-10గ్లాసుల నీళ్ళు త్రాగాలి. అలాగే జ్యూసులు కూడా త్రాగాలి.

సన్నబడ్డం కోసం డైటింగ్ ఎలా పడితే అలా చేసేస్తే ఎలా..?

నిద్ర: ఆరోగ్యకరమైన జీవితానికి తగినంత నిద్ర అవసరం. మనిషికి కనీసం 7-8గంటల నిద్రఅవసరం. నిద్రలో వ్యత్యాసం లేకుండా ప్రతి రోజూ ఒకే సమయానికి క్రమంగా నిద్రపోవాలి. నిద్రలో వ్యత్యాసం వల్లే బరువు పెరగడంలో హెచ్చుతగ్గులు ఏర్పడుతాయి. కాబట్టి సరైన నిద్ర, టైమ్ మెయింటెనెన్స్ అవసరం.

English summary

How make Your Body Slim and Beautiful | సన్నబడ్డం కోసం డైటింగ్ ఎలా పడితే అలా చేసేస్తే ఎలా..?

To be perfectly beautiful you need to make the skin on all your body parts equally beautiful to touch. The skin on the different parts of your body need separate attention and care. They are all different in their sensitivity. Take to a special skin care regime to get beautiful skin all over your body. For making your body beautiful you have to take to some special measures. Here are some ways by which you can enhance the beauty of your skin on different parts of the body.
Story first published: Saturday, March 2, 2013, 16:09 [IST]
Desktop Bottom Promotion