For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పసుపుపచ్చ గొర్లను తిరిగి తెల్లగా పొందడం ఎలా?

By Super
|

మానిక్యూర్ చేసిన చేతులు, గోళ్ళు ఎవరి అందాన్నైనా ఇనుమడింప చేస్తాయి. అయితే ఎక్కువమంది స్త్రీలు వీటిని శుభ్రంగా, పొడవుగా, తెల్లని గోళ్ళను పోషించడం చాలా కష్టం. అయినప్పటికీ, ముఖ్యంగా ఆర్ధిక సమస్యలు ఉన్నవారు, తరచుగా మానిక్యూర్ చేయించుకోవడం సాధ్యం కాదు. సెలూన్లు అదేవిధంగా పార్లర్ల వాళ్ళు గోళ్ళ నిర్వహణకు అధిక మొత్తాన్ని వసూలు చేస్తారు. సాధారణంగా స్త్రీలలో వచ్చే అత్యంత సాధారణ గోళ్ళ సమస్య పసుపురంగు గోళ్ళు.
గోళ్ళ చికిత్స ఖరీదైనదే కాకుండా దీర్ఘకాలంలో హానికరమైనది కూడా, ఎప్పుడూ ఇంట్లో సాధారణ నివారణలను చేయాలనీ గుర్తుంచుకోండి. పసుపు గోళ్ళ చికిత్సకు ఇక్కడ ఇచ్చిన కొన్ని చిన్న చిట్కాలను పాటించండి.

పసుపు గూళ్ళకు సహజ చికిత్స

గోర్లు శుభ్రంగా, తెల్లగా ఉండడానికి టూత్పేస్ట్ తో వాటిని కుంచెతో శుభ్రం చేయడం సాధారణ మార్గాలలో ఒకటి. అది కేవలం గొల్లపై ఉన్న మరకలను తొలగించడమే కాకుండా వాటిని తెల్లగా ఉంచి అదనంగా కొంచెం ప్రకాశవంతంగా ఉంచుతుంది.

Nailcare

నిమ్మకాయ మాజిక్

నిమ్మకాయ అసంఖ్యాకమైన ప్రయోజనాలు కలిగిన మరో సహజ ఉత్పత్తి. దీని అత్యంత సాధారణ అంశాలలో ఒకటి రక్తస్రావాన్ని నివారించడం. మీరుచేయవలసినదల్లా పసుపురంగు, మరకలు తొలగించడానికి మీరు మీ వేళ్ళను, గోళ్ళను కాసేపు నిమ్మ నీటిలో నానపెట్టండి. ఈ చికిత్స పూర్తిగా ఉచితం, అన్నిరకాల తరువాతి ప్రభావాల నుండి కాపాడుతుంది. నిమ్మకాయ గొళ్ళపై తెలుపుకోసం నిమ్మ నూనెను కూడా ఉపయోగించవచ్చు. అయితే ఉత్తమ ఫలితాల కోసం మీరు దీనిని ప్రతిరోజూ ఉపయోగించాలి! నూనెని ఒక బౌల్ లోకి తీసుకొని, కొన్ని నిముషాలు గోళ్ళను దానిలో ఉంచండి. ఇది గోళ్ళకు కండిషనింగ్ గా కూడా సహాయపడుతుంది.

బేకింగ్ పౌడర్, నిమ్మరసం మిశ్రమం

మంచి నాణ్యత కలిగిన బేకింగ్ పౌడర్, నిమ్మ రసాన్ని మంచి పేస్ట్ లా తయారుచేయండి. దీనిని గోళ్ళ అంచున పూయండి అదేవిధంగా కొంచెం గోళ్ళ మధ్యలో రాయండి. ఎతువంటి శ్రమ లేకుండా మీ పసుపు రంగు గోళ్ళ చికిత్సకు ఖచ్చితంగా సహాయపడుతుంది.

జింక్, విటమిన్ ఇ సప్లిమెంట్ లను పెంచండి

శరీరంలో జింక్ మినరల్స్ లేకపోవడం అనేది పసుపు గోళ్ళ మూల కారణాలలో ఒకటి. మీ రోజువారీ ఆహారంలో జింక్ సప్లిమెంట్ ఎక్కువ మొత్తంలో ఉండేటట్లు ప్రయత్నం చేయండి. దీనివల్ల మీరు శాశ్వతంగా ఈ సమస్యనుండి బైటికిరావడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా, విటమిన్ ఇ కూడా పసుపు గోళ్ళ నివారణకు అద్భుతమైన మార్గం. కాబట్టి, నివారణ చికిత్సకంటే ఉత్తమమైనది, మీరు పసుపు గోళ్ళతో బాధపడక పోయినప్పటికీ ఈ రెండిటినీ ఉపయోగించవచ్చు.

పదునుగా, తేమగా ఉంచడం

మీరు ఎప్పటికప్పుడు మీ చేతులను, గోళ్ళను పదునుగా, తేమగా ఉంచండి. కొద్దిగా పదునుచేసి, తరువాత కడగండి. ఒకసారి ఆరిన తరువాత, మంచి నాణ్యత కలిగిన చేతి మాయిశ్చరైజర్ ని రాసి, గోళ్ళకు నైల్ పాలిష్ వేయండి. ఇది కండిషన్డ్ గా, బాహ్య కారకాల నుండి రక్షణగా ఉండి పసుపుదనాన్ని పోగొట్టడానికి సహాయపడుతుంది. ఇవి ఎటువంటి సమస్యలు లేకుండా ఇంట్లో మీరు పాటించ దగ్గ కొన్ని ఉత్తమ సహజ నివారణలు. ప్రతిరోజూ వీటిని పాటించడం వల్ల ఉత్తమ ఫలితాలను పొందుతారు! అయితే, మీకు ఈ సమస్య ఎక్కువకాలం కొనసాగినట్లైతే వైద్యుడిని లేదా వృత్తిపరమైన వారిని సంప్రదించడం మంచిది.

English summary

How to treat yellow nails naturally | పసుపుపచ్చ గొర్లను తిరిగి తెల్లగా పొందడం ఎలా?

Manicured hands and nails have always been an added star to anyone’s beauty. However is becomes very difficult for most women to maintain clean, long and white nails. Also, it is not possible to manicure them quite often, especially for those who have financial issues.
Desktop Bottom Promotion