For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాత దంతాలకు గుడ్ బై చెప్పి కొత్త దంతాలను పొందండి...!

|

సాధారణంగా దంతాలు తెల్లగా మరియు మెరుస్తుండేలా ఉంచుకోవడం చాలా మందికి ఇష్టం. అలా మిరిమిట్లు గొలిపే ఓ అందమైన నవ్వు కొన్ని మిలియన్ల గుండెను కరించేస్తాయి. కానీ, తెల్లగా ఉండే మెరిసేటి దంతాల కోసం నోటి ఆరోగ్య సంరక్షణ చాలా అవసరం. అందుకు ప్రతి రోజూ రెండు మూడు సార్లు బ్రెష్ చేయడం వల్ల మరియు కొన్ని డెంటల్ టిప్స్ ఫాలో అవ్వడం చాలా వసరం.

ముఖంలో మరో అందమైన భాగం అందమైన పలువరుస ఎంతో అందంగా ఉంటుంది. అయితే పలువరుస అందంగా ఉన్నా, పళ్ళు పచ్చగా గార పట్టి ఉంటే నలుగురిలో హాయిగా నవ్వలేము. అందుకే, ఎప్పుడూ పళ్ళను శుభ్రంగా ఉంచుకోవాలి. చాలా మంది వారి దంత సంరక్షణ కోసం రెగ్యులర్ గా డెంటిస్ట్ ను కలుస్తుంటారు. రోజులో రెండు సార్లు బ్రెష్ చేసుకోవడం చేస్తుంటారు. అందుకే వారి దంతాలు తెల్లగా మిళమిళలాడుతూ ఆరోగ్యం ఉంటాయి. అయితే మరొకొందరికి ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్న వారి దంతాలు అంత అందంగా కనబడవు, పసుపుపచ్చగా కనబడుతుంటాయి.

అయితే, ఏమేమి తింటే మీ దంతాల అలా ప్రభావితం అవుతున్నాయి తెలుసుకోవాలి. దంతాలకు అంటుకొనే (స్టిక్కీ ఫుడ్స్), బయట తయారు చేసిని తీసి తినుబండారాలు, స్మోకింగ్ మొదలగునవి మీ దంతఆరోగ్యాన్ని పాడు చేసి దంతాలను పసుపు పచ్చవర్ణంలోనికి మార్చేస్తాయి. కాబట్టి అటువంటి ఆహారాలను తీసుకోవడం మానేయాలి. వాటి స్థానంలో కొన్ని టీత్ ఫ్రెండ్లీ ఫుడ్స్ (స్ట్రాబెర్రీ, సిట్రస్ పండ్లు, వెజిటేబుల్స్, )ను చేర్చుకోవాలి. ఇంకా మీరు సహజంగానే మీ దంతాలను తెల్లగా మార్చుకోవాలనుకుంటే..ఈ హోమ్ ఇనిగ్రెంట్స్ మీ దంతాలను నేచురల్ గానే తెల్లగా మార్చేస్తాయి. ఈ వస్తువులు మీ వంటగదిలో అందుబాటులో ఉన్నవే. వీటి వెల తక్కువ మరియు ఫలితమెక్కువ. వీటిని ఉపయోగించి మీ దంతాలను నేచురల్ గానే తెల్లగా మార్చుకోండి...

దంతాలను ముత్యంలా మెరిపించే సులభ చిట్కాలు..!

నిమ్మ: నిమ్మతొక్కతో దంతాల మీద స్ర్కబ్(రుద్దడం)వల్ల పళ్ళు తెల్లగా మారుతాయి. ఇంకా బ్రెష్ మీద నిమ్మరసం పిండుకొని, దానికి కొద్దిగా సాల్ట్ చిలకరించి బ్రెష్(దంతావదానం/పళ్ళు రుద్దుకోవడం)చేసుకోవడం వల్ల దంతాలు తెల్లగా మిళమిళలాడుతుంటాయి.

దంతాలను ముత్యంలా మెరిపించే సులభ చిట్కాలు..!

మస్టర్డ్ ఆయిల్: ఇది ఒక ట్రెడిషనల్ హోం రెమడీ. దీంతో కూడా దంతాలు తెల్లగా మార్చుకోవచ్చు. మీ పళ్ళను పసుపు మరియు మస్టర్డ్ ఆయిల్ ను పేస్ట్ చేసి ఈ రెండింటి మిశ్రమంతో బ్రష్ చేసుకోవడం వల్ల దంతాలు తెల్లగా మారుతాయి. ఆ వ్యత్యాసాన్ని మీరే గమనించండి.

దంతాలను ముత్యంలా మెరిపించే సులభ చిట్కాలు..!

బేకింగ్ సోడా: బేకింగ్ సోడాను ఉప్పుతో మిక్స్ చేస్తే ఇదొక మంచి హోమ్ మేడ్ టూత్ పేస్ట్ లా తయారవుతుంది . ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. దంతాలను నేచురల్ గానే తెల్లగా మార్చుతుంది.

దంతాలను ముత్యంలా మెరిపించే సులభ చిట్కాలు..!

ఉడ్ యాష్(బొగ్గు లేదా బాగా కాలిన కట్టి పౌడర్): ఇది వినడానికి ఆశ్చర్యంమే కావచ్చు. అయితే పొడిని హోం రెమడీగా దంతాలను తెల్లగా మార్చడానికి మంచి ఫలితాలను ఇస్తుంది.

దంతాలను ముత్యంలా మెరిపించే సులభ చిట్కాలు..!

ఉప్పు: ఉప్పుతో దంతాలను స్క్రబ్ లేదా రుద్దడం ద్వారా దంతాలు తెల్లగా మారుతాయి, అంతే కాదు దంతాలు మెరిలా చేస్తాయి. నిమ్మరసంతో ఉప్పు కలిపి దంతాలను శుభ్రం చేసుకోవచ్చు.

దంతాలను ముత్యంలా మెరిపించే సులభ చిట్కాలు..!

ఆరెంజ్ తొక్క: సిట్రస్ పండ్లు దంతాలకు చాలా మేలు చేస్తాయి. వీటిన తరచూ తినడం లేదా వీటి ఉపయోగించి పళ్ళు రుద్దడం వల్ల దంతాలు తెల్లగా మరియు మెరుస్తుంటాయి. ఆరెంజ్ తొక్క లేదా ఆరెంజ్ తొన ఉపయోగించడం వల్ల నోటి శుభ్రతతో పాటు నోటి దుర్వాసన కూడా దూరం అవుతుంది.

దంతాలను ముత్యంలా మెరిపించే సులభ చిట్కాలు..!

వెనిగర్: వెనిగర్ ను నోట్లో వేసుకొని నోటిని పుక్కలించడం ద్వారా నోరు శుభ్రపడటంతో పాటు నోటి దుర్వాసన తొలగిపోతుంది. ఇంకా పసుపు పచ్చని పళ్ళను నివారిస్తుంది.

దంతాలను ముత్యంలా మెరిపించే సులభ చిట్కాలు..!

క్లోవ్ ఆయిల్(లవంగాల నూనె): దంత క్షయం లేదా పంటినొప్పులను నివారించడానికి ఈ వంటగది వస్తువు చాలా బాగా పనిచేస్తుంది. టూత్ బ్రెష్ మీద ఒక చుక్క లవంగపు నూనె వేసి బ్రెష్ చేయడం వల్ల వ్యత్యాసాన్ని మీరే పసిగట్టవచ్చు.

దంతాలను ముత్యంలా మెరిపించే సులభ చిట్కాలు..!

వేప పుల్ల: దంతాలను తెల్లగా మార్చేటటువంటి బెస్ట్ హోం రెమడీ. ఇది నేచురల్ గా దంతాలను తెల్లగా మార్చడంతో పాటు మంచి నోటి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.

దంతాలను ముత్యంలా మెరిపించే సులభ చిట్కాలు..!

బిర్యానీ ఆకు: బిర్యాని ఆకును పౌడర్ చేసి ఈ పొడిని నిమ్మరసంతో జత చేసి, దంతాలను స్ర్కబ్ చేయడం వల్ల దంతాలు తెల్లగా మరుతాయి.

దంతాలను ముత్యంలా మెరిపించే సులభ చిట్కాలు..!

స్ట్రాబెర్రీ: ఊ స్ట్రాబెర్రీల్లో ఉండే మాలిక్ ఆమ్లం పళ్ల మీద మరకలను తొలగిస్తుంది. అందుకోసం మీరేం చేయాలంటే... ఒక స్ట్రాబెర్రీ తీసుకుని మెత్తగా చేసి అందులో కాస్త బేకింగ్ సోడా కలపాలి. ఈ మిశ్రమాన్ని పళ్ల మీద రాసి ఐదు నిమిషాల పాటు సున్నితంగా మర్దనా చేస్తే పళ్లు శుభ్రమవడమే కాకుండా మెరుస్తాయి.

దంతాలను ముత్యంలా మెరిపించే సులభ చిట్కాలు..!

హైడ్రోజెన్ పెరాక్సైడ్: ప్రతి రోజు ఆహారం తిన్న తర్వాత మీ దంతాలను హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో శుభ్రపరచండి. దీంతో మీ దంతాలలోనున్న బ్యాక్టీరియా మటుమాయమవ్వడంతోపాటు దంతాలు మరింత అందంగా తయారవుతాయి. కాని మీరు హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో నోటిని శుభ్రపరిచే సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లోను మింగకూడదు. దీనిని నోట్లో వేసుకుని పుక్కలించి ఉమ్మేయాలంటున్నారు వైద్యులు.

English summary

Kitchen Ingredients For White Teeth | దంతాలను ముత్యంలా మెరిపించే సులభ చిట్కాలు..!

We all wish to get white and sparkling teeth. A beautiful smile can melt millions of heart! But, maintaining white and sparkling teeth requires a lot of oral health care. Brushing twice or thrice every day, using dental floss are few tips to maintain good oral health.
Desktop Bottom Promotion