For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మం దురద తగ్గించటానికి సులభమైన హోం రెమిడీస్

|

సాధారణంగా దురద అనేది ఇబ్బందికరముగా ఉండే ఒక సమస్య అని చెప్పవచ్చు. దురద రావటానికి అలెర్జీలు,పురుగులు కుట్టడం,వాతావరణ కాలుష్యం,అంటువ్యాధులు,సబ్బుల్లో కఠినమైన రసాయనాలు మరియు మందుల వంటి కారణాల వలన రావచ్చు. దురద సమస్య చాలా బాధకరముగాను మరియు చాలా చికాకుగాను ఉంటుంది.

ఆ క్షణంలో ప్రభావిత ప్రాంతంలో గోకడం వలన కొంత ఉపశమనం కలుగుతుంది. కానీ ఇలా చేయుట వలన చర్మ వ్యాధికి దారి తీయవచ్చు. మీరు చర్మం దురదతో బాధపడుతూ ఉంటే ఖచ్చితంగా గోకడం మాత్రం చేయకూడదు.

చర్మంను గోకడం వలన నష్టం ఎక్కువగా జరుగుతుంది. అంతేకాక కొన్నిసార్లు ప్రమాదకరమైన అంటురోగాలకు దారి తీస్తుంది. అటువంటి సందర్భంలో దురద ప్రాంతంలో గోకడం ఎట్టి పరిస్థితిలోను చేయకూడదు. కొన్ని ఇతర సురక్షిత నివారణ మార్గాలను పాటించాలి. మీరు ఉపశమనం కొరకు ఈ నివారణ మార్గాలను పాటించటం చాలా సులువైనది. ఎందుకంటే ఇవి మీ వంటగది అల్మరాలో అందుబాటులో ఉంటాయి. చర్మం దురద కోసం ఈ సాధారణ గృహ నివారణ మార్గాలు వంద శాతం సురక్షితం అని చెప్పవచ్చు. అంతేకాక మీ చర్మంనకు ఎటువంటి దుష్ప్రభావాలు కలగవు.

చర్మం దురదకు సాధారణ గృహ పరిష్కారాలు ఉన్నాయి. ఒక సురక్షిత మరియు సహజ మార్గంలో ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

బేకింగ్ సోడా

బేకింగ్ సోడా

బేకింగ్ సోడా చర్మం దురదకు చాలా సాధారణమైన హోమ్ పరిష్కారాలలో ఒకటిగా ఉంది. ఇది ఒక సహజ ఆమ్ల న్యూట్రలైజ్ వంటి శోథ నిరోధక లక్షణాలు మరియు చర్యలు కలిగి ఉంటుంది. నీటి యొక్క ఒక భాగాన్ని బేకింగ్ సోడా యొక్క మూడు భాగాలతో కలిపి ఒక పేస్ట్ గా చేయండి. ఈ పేస్ట్ ను ప్రభావిత ప్రాంతాలలో రాసి అర గంట సమయం అయిన తర్వాత నీటితో కడగాలి. అయితే మీరు బేకింగ్ సోడాను పగిలిన చర్మం లేదా ఓపెన్ గాయాలకు ఉపయోగించకుండా శ్రద్ధ వహించాలి.

వోట్మీల్

వోట్మీల్

వోట్మీల్ గొప్ప యాంటీ ఇరిటేషన్ మరియు యాంటిఆక్సిడెంట్ కాంపౌండ్స్ కలిగి ఉంటుంది. అందువలన మీ చర్మంపై ఓదార్పు ప్రభావాన్ని చూపుతుంది. ప్రాసెస్ చేయని వోట్మీల్ పిండిని ఉపయోగిస్తే చర్మం దురద చికిత్సకు మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఒక మృదువైన పేస్ట్ తయారు చేయటానికి నీటితో ప్రాసెస్ చేయని వోట్మీల్ పిండిని కలపాలి. దురద ప్రాంతంలో ఈ పేస్ట్ ను రాయాలి. ఆ ప్రాంతాన్ని ఒక వస్త్రంతో కప్పి 30 నిమిషాల తర్వాత నీటితో కడగాలి. అప్పుడు వెంటనే చికాకు నుండి ఉపశమనం కలుగుతుంది.

చల్లని నీరు

చల్లని నీరు

దురద ప్రాంతాల్లో చల్లని నీరు లేదా ఐస్ రాయటం వలన ఇరిటేషన్ నుండి ఉపశమనం కలుగుతుంది. మన చర్మం మీద చల్లని నీరు పోయటం వలన చల్లని అనుభూతి కలుగుతుంది.

నిమ్మకాయ

నిమ్మకాయ

చర్మం దురదకు మరో మంచి హోమ్ పరిష్కారాలలో నిమ్మకాయ కూడా ఉంది. నిమ్మకాయ గొప్ప స్వస్థత మరియు శోథ నిరోధక లక్షణాలు కలిగిన సిట్రిక్ మరియు ఎసిటిక్ ఆమ్లాలను కలిగి ఉన్నది. అందువలన కేవలం ప్రభావిత ప్రాంతంలో మాత్రమే కొంత నిమ్మరసం రాసి అది పొడిగా అయ్యినాక చల్లటి నీటితో కడగాలి. అప్పుడు నాటకీయంగా దురద తగ్గిపోతుంది.

లవంగం నూనె

లవంగం నూనె

లవంగం నూనెలో నరాల తిమ్మిరి సామర్ధ్యంనకు యూగేనోల్ ఉంటుంది.ఇది దురద అనుభూతిని తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రభావిత ప్రాంతాల్లో కొన్ని చుక్కల లవంగం నూనెను రాసి కొంతసేపు అలా వదిలేయాలి. కొంత సమయం అయిన తర్వాత తగ్గిపోతుంది.

కలబంద

కలబంద

కలబందను చర్మం దురద కోసం ఒక అద్భుతమైన నివారణ మార్గంగా చెప్పవచ్చు. ఇది చర్మంపై ఒక చల్లని ప్రభావాన్ని మరియు శోథ నిరోధకత కలిగి ఉంటుంది. దీనిలో విటమిన్ E కలిగి ఉండుట వలన కాలిన మరియు దురద చికిత్స కోసం అద్భుతంగా పనిచేస్తుంది. మీ ఇంటి వద్ద ఒక కలబంద మొక్క ఉంటే అప్పుడు ఒక ఆకును కోసి దురద ప్రాంతంలో ఆ రసాన్ని రాయాలి. మీ ఇంటిలో మొక్క లేనట్లయితే మీరు మందుల దుకాణములో కలబంద జెల్ తీసుకోని రాయవచ్చు.

సుగంధ నూనెలు

సుగంధ నూనెలు

అన్ని సుగంధ నూనెలు శోథ నిరోధక లక్షణాలు కలిగి ఉంటాయి. అవి దురద అనుభూతికి తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాక చర్మంపై ఓదార్పు ప్రభావాన్ని చూపుతాయి. మీరు మీ స్నానం నీటిలో కొన్ని చుక్కల ఈ నూనెను కలపవచ్చు. అలా కాకుండా మీరు ప్రభావిత ప్రాంతంలో నేరుగా ఈ నూనెలను రాయవచ్చు. బాసిల్ ఆయిల్,అగ్రిమోనీ ఆయిల్,కలేన్ద్యుల ఆయిల్,సీమ చామంతి ఆయిల్,గేరనియం ఆయిల్ వంటి సుగంధ నూనెలను చర్మం దురదల కొరకు ఉపయోగించవచ్చు.

English summary

Simple Home Remedies For Itchy Skin


 Itching is a common and an irritating problem. It may result from a number of causes like allergy, insect bites, weather, pollution, infections, harsh chemicals in soaps and sometimes even medication. The problem of itching is very annoying and can be embarrassing too.
Story first published: Thursday, October 31, 2013, 17:47 [IST]
Desktop Bottom Promotion