For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవిలో చర్మ..కేశ సంరక్షణ ఎంత అవసరమో..పాదసంరక్షణ కూడా...

|

వేసవి కాలంలో ఎండ తాపానికి మీరు ఏదైనా లైట్ కలర్ కాటన్ దుస్తులు ధరించడానికి ఎక్కువగా ఇష్టపడుతారు. మేకప్ కు అంత ప్రాధాన్యత ఇవ్వరు. మరియు జుట్టు ముడివేయడం లేదా పోనీటైల్ వేసుకోవడానికి ఇష్టపడుతారుు. ఎండ వేడిమి తట్టుకోవడానికి వివిధ రకాలుగా మార్గాలను వెతుక్కుంటారు. చర్మ సంరక్షణ..కేశ సంరక్షణకు..ఇంకా ఆరోగ్యసంరక్షణ కూడా వేసవి చిట్కాలను పాటిస్తారు. వీటన్నింటి గురించి తీసుకే జాగ్రత్తలు ఒక్క పాదాల విషయంలో మాత్రం వెనుకుంటారు. ఎందకనీ? మనం వేసవి కాలంలో ఓపెన్ స్లిప్పర్ లేదా ఫ్లిప్ ఫ్లాప్స్ వేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతాం. సమ్మర్ ఫాషన్ లో అత్యాధునిక పాదరక్షలు మరియు పాదాలకు ధరించే వివిధ రకాల యాక్ససరీస్ ఉన్నాయి. అయితే, వేసవి కాలంలో ఎండ వల్ల..పొడి వాతావరణం వల్ల మీ పాదాలు పొడిబారడం మరియు దుమ్ము ధూళి మరియు ఎండకు పాదాలు బహిర్గతం అవుతాయి.

వేసవిలో చర్మ మరియు కేశ సంరక్షణలాగే పాదాల సంరక్షణ కూడా చాలా అవసరం. వేసవి వేడికి పాదాలను అలా ఓపెన్ గా ఉంచేయడం లేదా పూర్తిగా షూతో కవర్ చేయడం ఏదో ఒకటి చేయాలి. మీరు ఎటువంటి ఫూట్ వేర్ ధరించినా ఎటుంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్, పాదల నుండి దుర్వాసన రాకుండా చూసుకోవాలి . కాబట్టి వేసవి కాలంలో మీ పాదాలు శుభ్రంగా ఉంచుకోవడానికి కొన్ని ఫూట్ కేర్ టిప్స్ మీకోసం...

body care

1. పాదాలను శుభ్రంగా కడగాలి: బయట నుండి ఇంటికి చేరుకోగాని పాదాలను శుభ్రంగా కడుగుకోవాలి. పాదాల మీదు దుమ్ము చాలా సులభంగా వచ్చి చేరుతుంది. వేళ్ళు మద్య మరియు గోళ్ళు లోపల కూడా దుమ్ము ధూళి చేరుతుంది. కాబట్టి మీ పాదాలను శుభ్రంగా కడగాలి. మరియు స్ర్కబ్ చేయాలి. ప్రతి రోజూ స్నానం చేసేటప్పు తప్పనిసరిగా స్ర్కబ్బింగ్ ను ఉపయోగించాలి. ఇలా తరచూ చేయడం వల్ల పాదాలు మరియు వేళ్ళ మద్యన చెమటలు పట్టకుండా నివారించుకోవచ్చు.

2. ఎక్స్ ఫ్లోయేట్స్: ఇది తప్పనిసరి. ఎక్స్ఫ్లోయేట్స్ చేయడం వల్ల పాదాల మీద డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. ఎక్స్ ఫ్లోయేట్ వల్ల పాదాల మీద చర్మ రంధ్రాలు తెరచుకొనేలా చేసి చర్మాన్ని శుభ్రపరుస్తాయి. దాంతో ఫూట్ ఇన్ఫెక్షన్ ను అరికట్టవచ్చు.

3. పాదాలకు గాలి తగలనివ్వాలి: వేసవి కాలంలో ఫ్లిప్ ఫ్లాప్స్ లేదా స్లిప్పర్ ధరించడం ద్వారా పాదాలకు కావల్సినంత గాలి తగులుతుంది. వేసవికాలంలో పూర్తిగా కవర్ చేయబడ్డి బూట్లు మరియు షూ ను వేసుకోకపోవడమే మంచిది. ఓపెన్ సాండిల్స్ పాదాలను చాలా సున్నితత్వాన్ని కలిగిస్తాయి. పాదాల పగుళ్ళు ఏర్పడకుండా రక్షణ కల్పిస్తాయి.

4. సన్ స్క్రీన్ లోషన్: చర్మం, కేశా మాదిరిగానే పాదాలను కూడా సూర్యకిరణాల నుండి వెలువడే యూవీ కిరణాల నుండి రక్షింపబడాలంటే సన్ స్క్రీన్ లోషన్ తప్పనిసరిగా ఉపయోగించాలి. దాంతో టానింగ్ తగ్గిస్తుంది.

5. మాయిశ్చరైజర్స్: పాదాల సంరక్షణ ప్రతి సీజన్ లోనూ అవసరమే. ఆయా సీజన్ కు తగ్గట్లు పాదాల సంరక్షణ చేసుకోవాలి మీ పాదాల్లో చెమట గ్రంథులు ఉండకపోవడం వల్ల పాదాలు త్వరగా పొడిబారుతాయి. మరియు అతి సులభంగా పగుళ్ళు ఏర్పడుతాయి. కాబట్టి ప్రతి రోజూ కనీసం రెండు సార్లైన మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి. ఒకటి మీరు స్నానం చేసిన తర్వాత. రెండవ సారి మీరు నిద్రకు ఉపక్రమించే ముందు.

6. పెడిక్యూర్: ప్రతి నెలలో రెండు సార్లైనా పెడిక్యూర్ చేసుకోవడం చాలా అవసరం. మీరు పెడిక్యూర్ ఇంట్లో చేసుకోవచ్చు. లేదా స్పా సెంటర్లకు వెళ్ళి చేయించుకోవచ్చు.

7. ఫూట్ మసాజ్: పాదాలను మసాజ్ చేయడం వల్ల శరీరం మొత్తానికి బ్లడ్ సర్క్యులేషన్ జరగుుతుంది. దాంతో విశ్రాంతిపొందుతారు. రిలాక్స్ అవుతారు. ఆరోగ్యానికి మంచిది కూడా...

English summary

Summer Foot Care Tips To Follow

During summers, you only feel like wearing light coloured cotton clothes. You do not prefer loud makeup and tie your hair into a ponytail or bun. What about foot? We generally prefer open slippers or flip flops during summers.
Story first published: Wednesday, May 15, 2013, 12:04 [IST]
Desktop Bottom Promotion