For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నునుపైన చర్మం పొందడానికి మసూర్ దాల్ బాడీ స్క్రబ్.!

|

సాధారణంగా ప్రతి ఒక్కరూ అందంగా ఉండటానికి ఎన్నో రకరకాల క్రీములను వాడుతూ వుంటారు. మీరు అద్దంలో ముఖాన్ని చూసుకున్నప్పుడు మీ చర్మం ఎలా వుందో గమనించండి. కలర్‌ ఎలాంటిదైనా మెరుపులీనుతూ ఉన్నదనుకోండి మీది ఆరోగ్యవంతమైన చర్మం లేదంటే డెడ్‌ స్కిన్‌ బాగా పేరుగుపోయిందని అర్థం. దీన్ని తొలగించాలి.

దీని కోసం మార్కెట్‌లో స్క్రబ్‌లు అనేవి వచ్చాయి. కానీ ఏ రకమైన స్క్రబ్‌ వాడాలో తేలికయక కొంతమంది ఈ స్క్రబ్‌ను దూరంగా వుంచుతారు. ఈ సందేహాలనుండి దూరమవడానికి ఈ స్క్రబ్‌కి మన ఇంట్లోనే తయారుచేసుకుంటే మంచిది. స్క్రబ్‌ అంటే సున్నిపిండి అని అందరికి తెలుసు కానీ సున్నిపిండి వాడరు. దాని దగ్గరకు కూడా వెళ్ళరు.

మీ వంటగదిని పరిశీలించినట్లైతే, మీరు అందం కోసం ఉపయోగించే ఎన్నో రకాలు బ్యూటీ వస్తువులను కనుగొనవచ్చు. ఉదా: పసుపు, వెల్లుల్ి, ఉప్పు, పంచదార, వెనిగర్, నిమ్మ, శెనగపిండి, పెసరపిండి మొదలగునవన్నీ బ్యూటీ కోసం సాధారణంగా ఉపయోగించే వస్తువులే. ఇంకా పప్పులు కూడా.. మసూర్ దాల్ (ఎర్ర కందిపప్పు)ను విరివిగా ఉపయోగిస్తారు. ఎర్ర కందిపప్పుతో బాడీ స్ర్కబ్ చేయడం చాలా పాపులర్ బ్యూటీ టిప్. స్కిన్ ను నేచురల్ గా ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది. మసూర్ దాల్ బాడీ స్ర్కబ్ ను వంటింట్లోని ఇతర వస్తువులో కలిపి తయారు చేసుకోవచ్చు. ఉదా: కందిపప్పు పౌడర్ కు పాలు పెరుగు వంటి వాటిని చేర్చి బాడీ స్ర్కబ్ గా ఉపయోగించి డెడ్ స్కిన్ సెల్స్ ను తొలిగించుకోవచ్చు. మరియు చర్మాన్ని శుభ్రం చేసుకోవచ్చు. మరి మీరు మసూర్ దాల్ బాడీ స్ర్కబ్ చేసుకోవానుకుంటున్నారా..అయితే క్రింది చిట్కాలను పరిశీలించి ట్రై చేయండి...

Try The Masoor Dal Body Scrubs

1. ఎర్రకందిపప్పు-పాలు:ఎర్రకందిపప్పు పిండి, పచ్చి పాలు, కొద్దిగా నెయ్యి... వీటిని పేస్ట్‌లా కలిపి, ముఖానికి వేసుకొని ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. వారానికి మూడుసార్లు ఇలా చేస్తుంటే చర్మకాంతి మెరుగవుతుంది.

2. ఎర్రకందిపప్పు-పసుపు: ఎర్రకందిపప్పు పౌడర్ ను, పసుపుతో కలిపి, అందులోనే కొన్ని చుక్కల తేనె కలిపి, బాగా మిక్స్ చేసి, శరీరం, ముఖానకి బాగా పట్టించి స్ర్కబ్ చేయడం వల్ల చర్మ ఎక్స్ ఫ్లోయేట్ అవడంతో పాటు, శుభ్రపడుతుంది. ఇందులోని తేనె చర్మానికి మాయిశ్చరైజర్ గా పనిచేసి, చర్మాన్ని టైట్ చేస్తుంది.

3. ఎర్రకందిపప్పు-వేరుశెనగ: ఎర్రకందిపప్పు మరియు వేరుశెనగగింజలను రెండింటి కలిపి పొడి చేసుకోవాలి. ఈ పౌడర్ లో కొద్దిగా పసుపు వేసి, పెరుగుతో బాగా మిక్స్ చేస్తే పేస్ట్ లా తయారు చేసుకోవాలి. దీన్ని బాడీ స్ర్కబ్ గా ఉపయోగించడం వల్ల ఇది చర్మాన్ని శుభ్రపరచడంతో పాటు, చర్మాన్ని బిగుతుగా ఉండేలా చేస్తుంది. పసుపు ముఖంలోని మొటిమలతో పోరాడుతుంది. చర్మ కాంతిని పెంచుతుంది. మరియు వృద్ధాప్యంతో పోరాడుతుంది.

4. ఎర్రకందిపప్పు పొడి చేసి ఒక బాక్స్‌లో ఉంచాలి. అవసరమైనపుడు ఒక స్పూన్‌ పొడిలో కాస్త రోజ్‌వాటర్‌ కలిపి మొహానికి రాసి ఆరిన తరువాత చల్లటి నీటితో కడుక్కోవాలి. రోజుకు ఆరు గ్లాసుల మంచినీరు తాగాలి. ఇలా వారం రోజుల స్క్రబ్‌ ఒక రోజు ఫేస్‌పాక్‌ వేసి మంచినీరు తాగి రాత్రిళ్లు ఆలివ్‌ ఆయిల్‌రాసి చూడండి. చాలా తేడా వస్తుంది. వీటన్నింటితో పాటు నిద్రపోయే ముందు ప్రతి రోజూ ఆలివ్‌ ఆయిల్‌ రాస్తే ముఖంపై ముడతలు పడకుండా సున్నితంగా, మృదువుగా మెరుస్తుంది.

5. ముఖాన్ని మృదువుగా ఉంచేందుకు ఉపయోగపడే స్క్రబ్బింగ్-పెసరపండి, బియ్యప్పిండి, ఎర్రకందిపప్పు, గోధుమలు కొంచెం బరకగా పిండి పట్టించి అందులో ఓట్‌ మీల్‌ పౌడరు, నారింజతొక్కల పొడి కలిపి నిల్వ చేసి పెట్టుకోవాలి. ఈ పొడి ఒక స్పూను తీసుకుని దాంట్లో పాలమీద మీగడకానీ, మాయిశ్చరైజింగ్‌ క్రీమ్‌ కానీ కలిపి దాంతో ముఖం అంతా మర్దన చేసుకుంటే చర్మం మృదువుగా తయారవుతుంది.

ఇప్పడు మీరు బ్యూటీపార్లర్‌ చుట్టూ తిరనవసరం లేదు. స్క్రబ్‌ వేయలేని వారు పైన చెప్పినవి చేయడానికి సమయం లేనివారు నిద్రించే ముందు ఆలివ్‌ ఆయిల్‌ రాసుకుని ఉదయం చల్లని నీటితో స్నానం చేస్తే సరిపోతుంది. ఏ ప్యాక్‌ వేసిన తరువాత అయిన సరే చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. సబ్బును ఉపయోగించకూడదు. ఎందువలన నంటే సబ్బు మన ముఖం మీద మురికి తొలగించే ప్రయత్నంలో మీరు ఆప్లై చేసుకున్న ప్యాక్‌ను కూడా తొలగిస్తుంది. ఇంకా ప్యాక్‌ వేసి ఏ ప్రయోజనం వుండదు. వారానికి ఒకసారి సున్నిపిండితో నలుగు పెట్టుకుంటే చర్మం తెల్లబడుతుంది.

English summary

Try The Masoor Dal Body Scrubs

If you look into your kitchen, you can find en number of ingredients that can be used for beauty purposes. For example, turmeric, garlic, salt, sugar, vinegar, lemon, besan etc are commonly used for beauty purposes. Even lentils especially masoor dal (red lentils) is widely used as a beauty ingredient.
Story first published: Thursday, July 18, 2013, 12:01 [IST]
Desktop Bottom Promotion