For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముద్దొచ్చే పెదాలు...ముద్దిచ్చే పెదాల కోసం...!

|

అందంతో పాటు ఆత్మ సౌందర్యం పెంపొందించుకోవాలంటే ఆయా శరీరాల స్వభావాన్ని బట్టి సౌందర్య సాధనాలను ఉపయోగించాలి. మాట మనసుని ఆకర్షిస్తే పెదాలు కంటిని కవ్విస్తాయి. పెదాలతో సైగలు చేస్తే చాలు కొన్నిసార్లు మాటలు అవసరముండవు. చిరు నవ్వు నవ్వినా, కోపాన్ని, సంతోషాన్ని వ్యక్తపరిచే వాటిలో పెదవులూ పాలు పంచుకుంటాయి. బుంగ మూతికి అంత అందాన్ని తెచ్చిపెట్టేవి కూడా పెదవులే.

మగువ అందంగా కనబడాలంటే ముఖంలో కళ్ళు, ముక్కు, పెదాలు అందంగా కనబడాలి. ముఖంలో పెదాలు చాలా సున్నితమైనవి. అలాంటి పెదాలు..ఆరోగ్యంగా..పింక్ కలర్ లో ఉంటేనే చూడ్డానికి చాలా ముచ్చటగా ఉంటాయి. మీ అందం..ఆరోగ్యం గురించి ఎదుటి వారికి తెలియాలంటే పెదాలు స్మూత్ గా..సాప్ట్ గా ఉండాలి.

శరీరంలో కళ్లు తర్వాత పెదాలను అందానికి ప్రతీకలుగా భావిస్తారు. పెదాలు లావున్నా, పల్చగా ఉన్నా పర్వాలేదు. కాస్మటిక్ సర్జరీ సరిచేసుకుని వాటిని మన ఇష్టమెచ్చిన రీతిలో తీర్చిదిద్దుకోవచ్చు. వయస్సుతో నిమిత్తం లేకుండా పెదాలను సర్జరీతో అందంగా, ఆకర్షనీయంగా, యంవ్వనాన్ని అందించవచ్చు. కొంత మందికి పుట్టుకతోనే దేవుడు సహజంగా గిప్ట్ ను ప్రసాధించి ఉంటాడు. మరి ఇతరుల సంగతేంటి అంటే? వారు పెదాలను సంరక్షించుకోవడం చాలా అవసరం. దాంతో కిస్సెబుల్ లిప్స్ సాద్య అవుతాయి.

అయితే అందరికీ అందమైన ఆకర్షించే పెదాలను కలిగి ఉండరు. అందుకే కొంత మంది మాత్రం వారి పెదాలు అందంగా మలచుకోవడానికి లిప్ లైనర్ లిప్ స్టిక్స్ ను వినియోగిస్తుంటారు. అయితే మీరు కిస్సెబుల్ లిప్స్ కనిపించాలంటే మేకప్ కూడా దానిక తగిన విధంగా వేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నేచురల్ గానే కిస్సెబుల్ లిప్స్ పొందడానికి కొన్ని కొన్ని ఖచ్చితమైన లిప్ కేర్ తీసుకొన్నట్లైతే ఆ కిస్సెబుల్ లిప్స్ ను పొందవచ్చు.

ఉదాహారణకు, పెదాలు పొడిబారి పెదవుల మీద పొట్టుగాలా వస్తుంటుంది. అందుకు పంచదారతో రుద్దడం వల్ల ఎక్స్ ఫ్లోయెట్ అవుతుంది. లిప్ కేర్ పద్దతులతో పాటు కొన్ని లిప్ ఎక్స్ సర్ సైజులు చేయడం వల్ల సహజంగా అందమైన పెదాలు, మంచి ఆకారం కలిగాన పెదాలు, కిస్సెబుల్ పెదాలు మీ సొంతం అవుతాయి.అంతే కాదు కొన్ని నేచురల్ ఆయిల్స్ ను వినియోగించడం వల్ల కూడా పొడి బారి పెదాల, డెడ్ స్కిన్ తొలగించబడం అందంగా ఆకర్షణీయంగా ముద్దొచ్చే పెదాలు సొంతం అవుతాయి. అటువంటి అధర సౌందర్యం మరింత పెంచుకోవడం కోసం...

రిలాక్స్:

రిలాక్స్:

ఏదైనా టెన్షన్ లో ఉన్నప్పుడు మీ పెదాలను బింగి పెట్టుకొంటారు. దాంతో పెదాల చుట్టూ ముడుతలు ఏర్పడుతాయి. కాబట్టి పెదాల చుట్టూ ఉన్న కండరాలు రిలాక్స్ అవ్వడానికి పెదాలకు విశ్రాంతి కలిగించాలి.

ఎక్స్ ఫ్లోయేషన్:

ఎక్స్ ఫ్లోయేషన్:

పంచదార బెస్ట్ ఎక్స్ ఫ్లోయేటర్. పంచదారను పెదాల రక్షణకు ఉపయోగించడం చాలా మంచిది. కొంచెం పంచదారను తీసుకొని పెదాల మీద రుద్దడం వల్ల డెడ్ స్కిన్ తొలగించి అందంగా కనబడుతాయి.

తడిచేయడం:

తడిచేయడం:

మీ పెదాలు పొడిగా అనిపించినప్పుడు, ఎండినట్లు అనిపించినప్పుడు కొద్దిగా నాలుకతో తడి చేసుకోవడం వల్ల, ఒది ఒక బెస్ట్ యాంటీసెప్టిక్ గా పనిచేసి పెదాల మీద ఏర్పడే చారలను మరియు ఇన్ఫెక్షన్ ను పోగొడుతుంది.

తేనె:

తేనె:

పెదాలకు బెస్ట్ మాయిశ్చరైజర్ తేనె. రెగ్యులర్ గా పెదాలకు తేనెను అప్లై చేయడం వల్ల పెదాలు తడిగా మంచి మెరుపుతో, నేచురల్ గ్లో అవుతుంది.

స్టాప్ స్మోకింగ్:

స్టాప్ స్మోకింగ్:

స్త్రీ పురుషులకు ఎవరికైనా సరే పెదాలు ఆకర్షణీయంగా కనబడాలంటే స్మోకింగ్ స్టాప్ చేయాలి. దాంతో పెదాలు నల్లగా మరియు పొడిబారడం తగ్గించుకోవచ్చు. కాబట్టి మీకు కిస్సెబుల్ లిప్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా ప్రొగత్రాగడం మానుకోవాలి.

సన్ ప్రొటక్షన్:

సన్ ప్రొటక్షన్:

పెదాల మీద ఉండే చర్మం చాలా సున్నితమైనది. శరీరంలోని చర్మంతో పోల్చితే చాలా పలుచగా ఉంటుంది. అందువల్లే అతి తర్వాత సన్ డ్యామేజ్ కు గురిఅవుతుంటాయి. అందుకు మీరు ఇంటి నుండి బయట అడుగు పెట్టే టప్పుడు, తగిన సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేయాలి.

పెట్రోలియం జెల్లీ:

పెట్రోలియం జెల్లీ:

పెదాలకు పాలిష్ చేయడానికి పెట్రోలియం జెల్లీ బాగా సహాయపడుతుంది. మంచి గ్లోయింగ్ షైన్ అందిస్తుంది. అంతే కాదు పెదాలకు రక్షణ కల్పిస్తుంది.

లెమన్:

లెమన్:

పెదాలు స్మోకింగ్ వల్ల లేదా సన్ డ్యామేజ్ వల్ల నల్లబడి అందవిహీనంగా ఉండటం వల్ల నిమ్మచెక్కను పెదాలమీద రుద్దడం వల్ల పెదాలు మంచి రంగును పొందుతాయి. ఇది నేచురల్ బ్లీచ్ లా పనిచేస్తుంది.

పెదాలకు వ్యాయామం:

పెదాలకు వ్యాయామం:

పెదాలకు కూడా వ్యాయామం చేయడం వల్ల అందమైన ఆహారంతో నిండైన పెదాలు మీ సొంతం అవుతాయి.

నవ్వు:

నవ్వు:

నవ్వడం వల్ల ముఖంలోని కండరాలన్ని కదులుతాయి. రిలాక్స్ కాబడుతాయి. కాబట్టి ముఖంలో కొత్త మెరుపులు సంతరించుకుంటాయి. పెదాలకు కూడా మంచి వ్యాయామంతో పాటు రిలాక్స్ అవ్వడం వల్ల కిస్సెబుల్ లిప్స్ మీ సొంతం అవుతాయి.

English summary

Want Kissable Lips? 10 Steps To Follow | కిస్సెబుల్ లిప్స్ పొందాలంటే...?


 Usually, lips that are so full and perfect that they entice you kiss are considered to be the best lips. Some people are naturally gifted with kissable lips. Others need to care for their lips so that they become kissable. Everyone one is not blessed with perfect pout lips. But some simple lips care tips can help you go a long way to becoming kissable. 
Desktop Bottom Promotion