For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ చిట్కాలు అందమైన..చక్కనైన పాదాలు పొందాలనుకొనే వారికి మాత్రమే...

|

సాధారణంగా మహిళలు తమ సౌందర్యంలో బాహ్య సౌందర్యానికి సంబంధించి ముఖంతోపాటు, చేతులకు మరియు కాళ్ళకు కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. చేతులు, అరచేతులు అందంగా ఉండటం అనేది పుట్టుకతో వచ్చే లక్షణాలు. వాటికి మరికొన్ని అధనపు మెరుగులు దిద్ది సున్నితంగా ఉంచుకుంటే మరింత అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

అలాగే చాలామంది పాదాల సంరక్షణను నిర్లక్ష్యం చేస్తా రు. పాదాలకు చేసే సంరక్షణ మనకు మరింత అందాన్నివ్వడమే కాదు. మంచి ఆరోగ్యం కూడా ప్రసాదిస్తుంది. పాదాలకు సంరక్షణ చేయడాన్ని పెడిక్యూర్ అంటారు. పెడిక్యూర్ బయట చేయించుకొనేటప్పడు అందులో రసాయనాలు ఉండవు కాబట్టి ఈ పెడిక్యూర్ వల్ల చర్మానికి ఎటువంటి హాని ఉండదు. ఒకేసారి నలుగురు కూర్చొని పెడిక్యూర్ చేయించుకోవచ్చు. అయితే వైరస్, బ్యాక్టీరియాల వంటివి ఒకరి నుంచి ఒకరికి సోకకుండా నీళ్లకు యువి స్టెరిలైజేషన్ చేయడం తప్పనిసరి.

పెడిక్యూర్ వల్ల పాదాలు శుభ్రమవడంతో పాటు కండరాల మర్దనా కూడా అవుతుంది. రక్త ప్రసరణ బాగా జరిగి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. పెడిక్యూర్ వల్ల పగుళ్లు, దురద రాకుండా ఉంటాయి. సాల్ట్ కాళ్ల నొప్పులను నివారిస్తుంది. హైడ్రోజన్ పెరాక్సైడ్ / డెటాల్ పగుళ్లలోపల ఉన్న మురికిని తొలగిస్తాయి. నిమ్మచెక్క, గ్లిజరిన్ వల్ల టాన్‌మారిన పాదాలు తిరిగి మునుపటి కాంతిని సంతరించుకుంటాయి. పెడిక్యూర్ లో వివిధ రకాలున్నాయి. అవి ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి. అయితే చాలా మందికి ఈ విషయం తెలియదు. ఫూట్ స్పా లేదా సలోన్ వెళ్ళినట్లైతే అక్కడ మీకు కచ్చితంగా మెను కార్డ్ ఇస్తారు. అందులో వివిధ రకాల పెడిక్యూర్ లిస్ట్ ఉంటుంది. అందులో క్లీనింగ్, ఫిల్లింగ్ నెయిల్స్, స్ర్కబ్బింగ్, మాయిశ్చరైజింగ్ మరియు ఫూట్ మసాజ్ ఉంటాయి. పెడిక్యూర్ కు ఉపయోగించే వస్తువులు కూడా డిఫరెంట్ గా ఉంటుంది.

ఉదాహరణకు, మీ పాదాలను టాన్ ఫీట్(సూర్యరశ్మికి ప్రభావం అయిన పాదాలను)తిరిగి అందంగా తీర్చి దిద్దుకోవాలంటే యాంటీ టాన్డ్ పెడియ్యూర్,ఇది పాదామీద ఉన్న చర్మాన్ని తెల్లగా మార్చుతుంది. పాదాలనొప్పులు ఉన్నప్పుడు నొప్పిని నివారిస్తుంది. హట్ స్టోన్ పెడిక్యూర్ వల్ల ప్రశాంతత లభిస్తుంది. అందుకు మీ పాదాలు చక్కగా.. అందంగా కనబడాలంటే ఎంటువంటి పెడిక్యూర్ మంచిదో ఒక సారి పరిశీలించండి.

చక్కిలిగింతల మర్ధన..మనస్సుకు ప్రశాతం...!

హాట్ వాటర్ పెడిక్యూర్: పూల్లో పాదాలను ముంచి వేడినీళ్ళతో శుభ్రం చేసుకోవడం వల్ల రిలాక్స్ గా ఉంటుంది. అంతే కాదు పాదాలు శుభ్రపడుతాయి.

చక్కిలిగింతల మర్ధన..మనస్సుకు ప్రశాతం...!

ఫ్రెంచ్ పెడిక్యూర్: ఫ్రెంచ్ పెడిక్యూర్ ఫ్రెంచ్ మానిక్యూర్ లాంటిదే. మీ పాదాలు శుభ్రపడుతాయి. మరియు సాధారణ పద్దతుల్లో పాదాలను మర్ధన మరియు మాయిశ్చరై చేయడుతాయి. కాలి వేలిగోళ్ళకు ట్రిమ్ చేసి వైట్ నెయిల్ పాలిప్ పెట్టడం జరగుతుంది.

చక్కిలిగింతల మర్ధన..మనస్సుకు ప్రశాతం...!

ఫిష్ పెడిక్యూర్: పాదాలు, చేతులు అందంగా కనిపించేందుకు ఇక మీదట ప్యుమిక్ స్టోన్‌తో రుద్దించుకోనక్కర్లేదు. మెత్తమెత్తటి చేప మూతులతో సుతిమెత్తగా మర్దనా చేయించుకుంటే చాలు మెరిసే చర్మం మీ సొంతమవుతుంది. శరీరంపై ఉండే మృతచర్మాన్ని నిశ్శబ్దంగా ఆరగించే ఈ చేపలకి దంతాలు ఉండవు. అందువల్ల చర్మంపై చిన్న గీత కూడా పడదు. ఈ చిన్నారి చేపలున్న నీళ్లలో కాళ్లు ఇలా పెట్టారో లేదో ఒక్కసారిగా చుట్టుముడతాయి. మొదటిసారి చేయించుకునే వాళ్లకి కాస్త భయం వేస్తుంది. అంతలోనే చక్కిలిగింతలు మొదలై భయం కాస్తా నవ్వుగా మారుతుంది. ఆ తరువాత అరగంటయినా ఆ నీళ్లలో నుంచి కాళ్లు పైకి తీయాలనిపించదు. అంత హాయిగా ఉంటుంది. రీరానికి చక్కిలిగింతల మర్దన చేస్తాయి. మృతకణాలని తినేసి చర్మాన్ని మృదువుగా చేసి మెరిపిస్తాయి.

చక్కిలిగింతల మర్ధన..మనస్సుకు ప్రశాతం...!

ఫ్లోరల్ పెడిక్యూర్: పాదాలను పూల్లో పెట్టినప్పడు పాదాలను పువ్వుల యొక్క రేకులు చుట్టుముడుతాయి. ఈ పువ్వుల్లోని కొన్ని రసాయనాలు పాదాల మీద ప్రభావం చూపి సున్నితంగా మార్చుతాయి.

చక్కిలిగింతల మర్ధన..మనస్సుకు ప్రశాతం...!

ఆరోమా థెరఫీ పెడిక్యూర్: ఈ పెడిక్యూర్ కొరకు ఆరోమాటిక్ ఆయిల్స్ ను మరియు బాత్ సాల్ట్ ఉపయోగించి పాదాలను స్ర్కబ్ చేస్తారు. దాంతో పాదాలకు కావల్సినంత తేమ అందుతుంది.

చక్కిలిగింతల మర్ధన..మనస్సుకు ప్రశాతం...!

వైన్ పెడిక్యూర్: వైన్ వల్ల చర్మానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది చర్మాన్ని యాంటీఎజింగ్ ఎఫెక్ట్ ను కలిగిస్తుంది. అంటే వయస్సు మీద పడనియ్యకుండా కాపాడుతుంది. అందువల్లే చాలా రకాల ఫేషియల్స్ లో వైన్ ను ఉపయోగిస్తుంటారు. వైన్ కలిపిన నీటిలో పాదాలను ముంచడం వల్ల పాదాల మీద ఉన్న డెడ్ స్కిన్ తొలగిపోయి, ముడుతలు తొలగి వయస్సు పైబడినట్లుగా కనబడనియ్యదు.

చక్కిలిగింతల మర్ధన..మనస్సుకు ప్రశాతం...!

హాట్ స్టోన్ పెడిక్యూర్: మీ పాదాలు తరచూ తిమ్మిర్లకు గురిఅవుతుంటే ఈ హాట్ స్టోన్ పెడిక్యూరి ఒక మంచి చికిత్స. మీ అలసిన కండరాల మీదు, పాదాల ముడుతల పోగొంట్టి కాళ్ళకు ఉపశమనం కలిగిస్తాయి. ఈ హాట్ స్టోన్స్ నరాల ఉద్దీపన కలిగిస్తాయి.

చక్కిలిగింతల మర్ధన..మనస్సుకు ప్రశాతం...!

యాంటీ టాన్ పెడిక్యూర్: మీ పాదాలు సూర్య రశ్మికి గురై నల్లగా, అసహ్యంగా మారినప్పుడు ఈ స్కిన్ లైటనింగ్ పెడిక్యూర్ వాడుతారు.

చక్కిలిగింతల మర్ధన..మనస్సుకు ప్రశాతం...!

డి స్ట్రెస్సింగ్ పెడిక్యూర్: డి స్ట్రెస్సింగ్ పెడిక్యూర్ వల్ల మీ మనస్సు విశ్రాంతి పొందుతుంది. పాదాలు శుభ్రపడుతాయి. ఈ టైప్ పెడిక్యూర్ లో పాదాలు విశ్రాంతి పొందుతాయి.

చక్కిలిగింతల మర్ధన..మనస్సుకు ప్రశాతం...!

పారాఫిన్ పెడిక్యూర్: బ్యూటీ ప్రొడక్ట్స్ లో పారాఫిన్ వాక్స్ చాలా ఉపయోగకరమైనది. ఇది ఒక మైనపు తొడగు వంటింది. ఇవి పాదాల మీద ఉన్న చర్మ రంద్రాలను తెరచుకొనే చేసి మురికిని శుభ్రం చేస్తుంది.

English summary

Which Is The Best Type Of Pedicure For You? | చక్కిలిగింతల మర్ధన..మనస్సుకు ప్రశాతం...!

The mark of a fine lady are her hands and feet. And to have the best pair of feet, you need to get the best pedicure. Many women think that pedicure in the salon is an unnecessary luxury. We would beg to differ. You may skip waxing or facial in the salon, but a pedicure is a must for every woman who wants to be a lady.
Story first published: Saturday, March 16, 2013, 15:27 [IST]
Desktop Bottom Promotion