For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మం తెల్లగా మార్చడంలో నిమ్మచేసే మ్యాజిక్

|

సాధారణంగా చాలా మంది చూడటానికి చాలా అందంగా, తెల్లగా కనబడుతారు. కానీ మోకాళ్ళు, మోచేతుల విషయానికి వచ్చేసరి, కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. చాలా మంది మహిళలకు తమ అందంకోసం ఎక్కు శ్రద్ధ తీసుకుంటారు కానీ, మోకాళ్ళు మోచేతుల మీద మాత్రం కొంత నిర్లక్ష్యం చూపుతారు. అందం విషయంలో శరీర సౌందర్యంలో మోకాళ్ళు, మోచేతులు కూడా ఒక భాగమని తెలుసుకోవాలి. వాటి గురించి సరిగా పట్టించుకోకపోవడం వల్ల ఆ ప్రదేశాలు నల్లగా మారడంతోపాటు, అందవిహీనంగా కనబడుతాయి. అందుకే చాలా స్త్రీలు, షార్ట్స్ , మరియు ష్లేవ్ లెస్, నీ లెగ్గ్ అవుట్ ఫిట్స్ ధరించడానికి సిగ్గుపడుతుంటారు. మోకాళ్ళు మోచేతులు తెల్లగా మార్చడానికి అనేక హోం రెమడీస్ ఉపయోగించడం అంత సులభం కాదు. కానీ, పెరుగు, పాలు, మరియు నిమ్మరసం వంటివి చాలా సాధారణంగా బ్యూటీ వస్తువులుగా ఉపయోగించడం వల్ల మోచేతులు, మోకాళ్ళను నలుపును పోగొట్టుకోవచ్చు.

అందాన్ని మెరుగు పరుచుకోవడానికి ఎన్నో సహజసిద్ద పదార్థాలున్నాయి. అయితే వాటిలో నిమ్మకాయ కూడా ఒకటి. నిమ్మకాయ వల్ల బ్యూటీ బెనిఫిట్స్‌ అధికం మరియు శక్తివంతమైనవి. ఎందుకంటే తక్షణ ప్రభావాన్ని చూపెడుతాయి. నిమ్మకాయ వల్ల ముఖ్య బ్యూటీ బెనిఫిట్స్‌ శక్తివంతమైన బ్లీచింగ్‌ ఏజెంట్‌గా పనిచేస్తుంది. నిమ్మకాయలో సిట్రస్‌ యాసిడ్‌ పుష్కలంగా ఉంటుంది. అంతే కాదు ఇందు లో యాంటీసెప్‌టిక్‌ లక్షణాలుకూడా ఎక్కువ గా కలిగి ఉంటుంది. అందుకే అందానికి మాత్రమే కాదు కొన్ని చిన్న చిన్న అంటు వ్యాధులను నివారించడానికి కూడా నిమ్మ కాయను ఉపయోగిస్తుంటారు. మరి మోకాళ్ళు, మోచేతులు నులుపును పోగొట్టి తెల్లగా మార్చడానికి నిమ్మకాయతో పాటు మరి పవర్ ఫుల్ పదర్థాలతో హోం రెమడీస్ ఎలా తయారు చేయాలో, ప్రయోజనం ఎలా ఉంటుందో ఒక సారి చూద్దాం..మిమ్మల్ని ఆశ్చర్య పడేలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పడానికి... రుజువు చేయడానికి ఈ క్రింది పద్ధతులను ఫాలో అవ్వండి..

నిమ్మరసంతో మసాజ్:

నిమ్మరసంతో మసాజ్:

ప్రతి రోజూ స్నానం చేయడానికి ముందు నిమ్మరసాన్ని మోచేతులకు మోకాళ్ళకు రుద్దాలి. రుద్దిన తర్వాత 20 నిముషాలు పాటు అలాగే ఉంచి తర్వాత స్నానం చేసుకోవాలి. స్నానం చేసిన తర్వాత బాడీలోషన్ అప్లై చేయాలి. లేదంటే చర్మం పొడిబారుతుంది. కాబట్టి నిమ్మరసం చర్మానికి అప్లై చేసిన తర్వాత బాడీలోషన్ లేదా మాయిశ్చరైజర్ అప్లై చేయడం చాలా అవసరం.

కొబ్బరి నూనె మరియు నిమ్మతొక్క:

కొబ్బరి నూనె మరియు నిమ్మతొక్క:

కొబ్బరి నూనె చర్మం రంద్రాల్లోని మరికిని తొలగించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. కొబ్బరి నూనెలో నిమ్మరసం లేదా నిమ్మ తొక్కను మిక్స్ చేసి మోచేతులు మరియు మోకాళ్ళకు రుద్దడం వల్ల నలుపును మాయం చేసి తెల్లగా మార్చుతుంది. ఈ రెండింటి మిశ్రమాన్ని 5-10నిముషాలు చర్మం మీద మర్ధన చేసి, 15నిముషాలు అలాగే ఉంచాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతి రోజూ రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

నిమ్మరసం-ఓట్ మీల్:

నిమ్మరసం-ఓట్ మీల్:

మోకాళ్ళు, మోచేతులను తెల్లగా మార్చడంలో ఇది మరొక అద్భుతమైన హోం రెమడీ. ఓట్ మీల్ పొడిలో నిమ్మరసం, తేనె మిక్స్ చేసి, జాయింట్స్ లో అప్లై చేయాలి. ఇది ఎండిన తర్వాత చల్లటి పాలతో లేదా చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయాలి.

ఎగ్ వైట్ మరియు నిమ్మరసం:

ఎగ్ వైట్ మరియు నిమ్మరసం:

ఎగ్ వైట్ మరియు నిమ్మరసం ఒక గిన్నెలో వేసి బాగా మిక్స్ చేసి డార్క్ గా ఉన్న ప్రదేశంలో ఈ మిశ్రమంతో మసాజ్ చేయాలి. మోచేతులు, మోకాళ్ళను తెల్లగా మార్చడంలో ఇది ఒక ఎఫెక్టివ్ హోం రెమడీ.

శెనగపిండి మరియు నిమ్మరసం :

శెనగపిండి మరియు నిమ్మరసం :

శెనపిండి, నిమ్మరసం, పెరుగుతో వేసుకొనే ఫేస్ ఫ్యాక్ చాలా పాపులర్ హోం రెమడీ. అదే విధంగా మోకాళ్ళు మోచేతులు కూడా తెల్లగా మార్చుకోవడానికి, ఇదే ప్యాక్ ను నల్లగా మారిన మోచేతులు, మోకాళ్ళ మీద అప్లై చేసి, ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

నిమ్మరసం, గ్లిజరిన్, పాలు:

నిమ్మరసం, గ్లిజరిన్, పాలు:

నల్లగా ఉండే మోచేతులు, మోకాళ్ళను తెల్లగా మార్చడంలో ఇది మరొక ప్రభావంతమైన హోం రెమడీ. పాలు, గ్లిజరిన్, నిమ్మరసాన్ని మూడింటిని బాగా మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని నల్లగా మారిన ప్రదేశంలో అప్లై చేసి 10-15నిముషాల అలాగే వదిలేసి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల నేచురల్ గా ఆశ్చర్యకరమైన మార్పు వస్తుంది.

ఉప్పు-నిమ్మరసం:

ఉప్పు-నిమ్మరసం:

ఒకచిన్న నిమ్మ తొక్కను తీసుకొని, దానికి కొద్దిగా ఉప్పు అద్ది నల్లగా మారిన మోచేతులు మోకాళ్ళ మీద స్క్రబ్‌ (రుద్దాలి). పదిరోజుల్లో మీమోకాళ్ళు మోచేతు లలో ఆశ్చర్యకరమైన మార్పు వస్తుంది.

పంచదార -నిమ్మరసం:

పంచదార -నిమ్మరసం:

వారానికి ఒక సారి ఒక స్పూన్ పంచదార, సంగం చెక్క నిమ్మరసం కలిపి మోచేతుల దగ్గర రాసి, నిమ్మచెక్కతో బాగా మర్థన చేసినట్లైతే మంచి ఫలితం ఉంటుంది.

కలబంద, నిమ్మరసం, పసుపు:

కలబంద, నిమ్మరసం, పసుపు:

.మోచేతులు తదితర ప్రాంతాల్లో కొంత మందికి చర్మం నల్లగా ఉంటుంది. ఈ సమస్య ఉన్నవారు కలబంద గుజ్జులో కొద్దిగా నిమ్మరసం, పసుపు కలిపి నిత్యం ఆయా భాగాల మీద రుద్దడం వల్ల నలుపు వర్ణం క్రమేపీ కనుమరుగవుతుంది.

బాదం ఆయిల్, నిమ్మరసం:

బాదం ఆయిల్, నిమ్మరసం:

మెత్తని ఉప్పులో కొద్దిగా బాదం నూనె కలిపి అందులో నిమ్మచెక్క ముంచి మోచేతులపై తరచు రుద్దినట్లైతే నలుపు తగ్గుతుంది.

English summary

Whiten Dark Knees n Elbows With Lemon

Having dark knees and elbows can be a huge turn off. That is why, many women feel shy to wear short sleeve and above knee length outfits.
Desktop Bottom Promotion