For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షేవింగ్ కి బదులుగా వాక్స్ ఉపయోగించడానికి 10 కారణాలు

By Lakshmi Perumalla
|

బహుశా షేవింగ్ అనేది శరీరం నుండి అనవసరమైన జుట్టును తొలగించటానికి ఒక అసమర్ధమైన పద్ధతి అని చెప్పవచ్చు. మీ జుట్టు ఎంత వేగంగా పెరుగుతుందనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మీరు దాని వృద్దిని తగ్గించాలంటే ప్రతి రోజు షేవింగ్ చేయాలి. అదృష్టవశాత్తూ,షేవింగ్ కు ఒక ప్రత్యామ్నాయం ఉంది. చాలా మంది అనేక కారణాలతో వాక్సింగ్ ను ఒక మంచి ఎంపిక గా చేసుకుంటున్నారు.

మొత్తం జుట్టు అంతా కట్ కాదు

మొత్తం జుట్టు అంతా కట్ కాదు

షేవింగ్ లో ప్రధాన ఫిర్యాదుగా మీరు పదునైన బ్లేడ్లను ఉపయోగించుట వలన గాట్లు పడటం అనేది సాధారణంగా జరుగుతుంది. మీకు మీరే కట్టింగ్ చేసుకోవటం ఇష్టంగా ఎప్పటికి ఉండదు. కానీ మెడ , చేతులు కింద మరియు గజ్జ ప్రాంతం వంటి కొన్ని ప్రాంతాలలో చెత్తగా ఉంటుంది. షేవింగ్ సమయంలో మీరు కట్ చేసుకున్నప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి.

వాక్సింగ్ ఎక్కువసేపు ఉంటుంది

వాక్సింగ్ ఎక్కువసేపు ఉంటుంది

వాక్స్ జుట్టు మూలాలను బయటకు లాగుతుంది. అవి తిరిగి పెరగటానికి చాలా సమయం పడుతుంది. సాదారణంగా మీరు వృద్ధి వేగాన్ని తగ్గించటానికి ప్రతి రోజు షేవ్ చేయాలి. కానీ వాక్స్ చేయటం వలన రెండు వారాల వరకు ఏమి చేయవలసిన అవసరం లేదు.అంతేకాక ఇది మీ చర్మం కోసం కూడా మంచిది. అలాగే మీరు ప్రతి రోజు షేవింగ్ చేయాలంటే విసుగుగా కూడా ఉంటుంది.

జుట్టు తిరిగి పలుచగా పెరుగుతుంది

జుట్టు తిరిగి పలుచగా పెరుగుతుంది

మీరు దీర్ఘకాలం జుట్టు తొలగింపు పద్ధతిని కొనసాగిస్తే,మీకు వాక్స్ చేసిన ప్రాంతాల్లో కేవలం గమనించదగ్గ జుట్టు మాత్రమే ఉంటుంది. షేవింగ్ మందపాటి జుట్టు రూపాన్ని ఇస్తుంది. దాని కారణంగా జుట్టు షాఫ్ట్ యొక్క చివరలు మొద్దుబారతాయి. దీని మీద వాక్సింగ్ వ్యతిరేక ప్రభావం ఉంటుంది.

వాక్స్ వలన నొప్పి తగ్గుతుంది

వాక్స్ వలన నొప్పి తగ్గుతుంది

వాక్సింగ్ అనే ఆలోచనే బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే మీ శరీరం మీద వేడి మైనం పెట్టటం జరుగుతుంది. అప్పుడు మూలల నుండి జుట్టు బయటకు వస్తుంది. అప్పుడు భరించలేని నొప్పి ఉంటుంది. కానీ కొంత సేపు అయ్యేసరికి క్రమంగా నొప్పి స్పందనను కోల్పోతారు.

వాక్సింగ్ తర్వాత మీ చర్మం నునుపుగా మారుతుంది

వాక్సింగ్ తర్వాత మీ చర్మం నునుపుగా మారుతుంది

వాక్స్ వాడటం వలన మీ చర్మానికి తేమ వస్తుంది. కేవలం జుట్టు తొలగించటమే కాకుండా చర్మం మృదువుగా మారటానికి సహాయం చేస్తుంది. ఎందుకంటే వాక్స్ లో మాయిశ్చరైజర్ లోషన్స్ ఉంటాయి. ఆ చర్మ ప్రాంతంలో ఉన్న జుట్టు మూలాలను తీయటం వలన మృదువుగా మారుతుంది. తొలగింపు తర్వాత వెంటనే క్లీన్ గా ఉంటుంది.

వాక్సింగ్ షేవింగ్ కంటే వేగంగా ఉంటుంది

వాక్సింగ్ షేవింగ్ కంటే వేగంగా ఉంటుంది

మీరు ఒక ఇబ్బందికరమైన ప్రదేశంలో జుట్టు వదిలించుకోవాలని అనుకుంటున్నప్పుడు షేవింగ్ చేసుకోవటానికి కొంత సమయం పడుతుంది. అయితే ఎవరైనా షేవింగ్ చేయవచ్చు. మీరు ఒక మంచి యాంగిల్ లో షేవింగ్ చేయకపోతే ప్రమాదం జరుగుతుంది.

వాక్స్ ఉపయోగించినప్పుడు మీ శరీరం నుండి విషాలు బయటకు పోతాయి

వాక్స్ ఉపయోగించినప్పుడు మీ శరీరం నుండి విషాలు బయటకు పోతాయి

మీరు మీ కాళ్ళ నుండి జుట్టు తొలగించడానికి వాక్స్ ఉపయోగించినప్పుడు,మీరు లింఫ్ ప్రాంతాలు మరియు చర్మం యొక్క ఉపరితలం మధ్య జుట్టు ఫొలికల్ ద్వారా ఒక రంధ్రం తెరిచుకుంటుంది. అప్పుడు ప్రవాహం సంభవించవచ్చు. ఇది జరిగినప్పుడు మీరు చర్మం మీద ద్రవం పడిపోవడం చూస్తారు. దాని మీద ఒక తడి గుడ్డను కప్పటం ద్వారా రంధ్రం మూసుకొని ప్రవాహం ఆగిపోతుంది.

మీ చర్మం కోసం ఉత్తమంగా పనిచేసే వాక్స్ ఉపయోగించవచ్చు

మీ చర్మం కోసం ఉత్తమంగా పనిచేసే వాక్స్ ఉపయోగించవచ్చు

మీరు సున్నితమైన చర్మం కలిగి ఉంటే,సాధారణ షేవింగ్ వలన ఎక్కువ సమస్యలు వస్తాయి. అయితే మీరు హైపో-అలెర్జీ వాక్స్ ను ఎంచుకోవచ్చు. అలాగే చికాకును తగ్గించటానికి సోయా లేదా చక్కెర ఆధారిత వాక్స్ లను ఎంపిక చేసుకోవచ్చు. ప్రీ కోటెడ్ వాక్స్ వస్త్రాలు కూడా చికాకు తగ్గించేందుకు ఉపయోగించవచ్చు. కాకపోతే సరైన మొత్తంలో వాక్స్ తీసుకోని రాయాలి.

పలుమార్లు వాక్స్ చికిత్సల వలన చివరికి శాశ్వత జుట్టు తొలగింపు జరుగుతుంది.

పలుమార్లు వాక్స్ చికిత్సల వలన చివరికి శాశ్వత జుట్టు తొలగింపు జరుగుతుంది.

అయితే వాక్స్ అవసరం లేకుండా ఉండటానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. పదేపదే వాక్సింగ్ చేయుట వలన జుట్టు పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది. మీ జుట్టు పూర్తిగా పెరుగుదల ఆగినప్పుడు, వాక్సింగ్ ను అరుదుగా ఉపయోగించవచ్చు. వారి అందం రొటీన్ గా లేకుండా స్లిమ్ గా అనుకునేవారికి కోసం,ఇది ఒక పెద్ద ప్లస్ గా ఉంటుంది.

వాక్సింగ్ వలన లోపల వెంట్రుకలు పెరిగే అవకాశం తక్కువ

వాక్సింగ్ వలన లోపల వెంట్రుకలు పెరిగే అవకాశం తక్కువ

మీరు షేవింగ్ చేసుకున్నప్పుడు, మీరు చర్మం స్థాయి వద్ద జుట్టు కత్తిరించిన లేదా దాని కింద కత్తిరిస్తారు. జుట్టు చివరలు మొద్దుబారి ఉంటాయి. అంతేకాకుండా అది పక్కకి లేదా సర్కిల్ల్లో పెరుగటం ఆరంభమవుతుంది. అప్పుడు చర్మం కింద బంధించబడి ఉండవచ్చు. లోపల పెరిగిన వెంట్రుకల వలన తరచుగా బాధాకరమైన అంటువ్యాధులు ఏర్పడతాయి. ఇటువంటి సమస్యలు మెడ మరియు బికినీ ప్రాంతం వంటి కొన్ని ప్రాంతాల్లో సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదేమైనా,వాక్సింగ్,సరైన మూలాన్ని తగ్గించి మొత్తం జుట్టు షాఫ్ట్ ను తొలగిస్తుంది. కొత్త జుట్టు చివరిలో పలుచగా ఉంటుంది. చర్మం పై పొర కింద జుట్టు బంధించబడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.

English summary

10 Reasons to Wax Instead of Shave

Shaving is a rather inefficient method of removing unwanted hair from the body. Depending on how fast your hair grows, you could end up shaving daily just to keep up with the growth.
Story first published: Thursday, August 14, 2014, 12:58 [IST]
Desktop Bottom Promotion