For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చంకల్లో నలుపు ప్యాచ్ లను తగ్గించే 5సింపుల్ చిట్కాలు

|

అండర్ ఆర్మ్(భుజాల యొక్క క్రింది భాగం లేదా చంకలు) పరిశుభ్రంగా ఉంచుకోవడం శరీరం అందంలో ఇది కూడా ఒక బ్యూటీకి సంబంధించిన విషయమే. ప్రస్తుతం ఎండలు అధికంగా ఉన్నాయి. వేడి, ఎండలను బీట్ చేయాలంటే, బహుమూలల్లో అవాంఛిత రోమాలాను తొలగించాలి. దాంతో పాటు వేసవి సీజన్ లో సాధ్యమైనంత వరకూ మినిమల్ దుస్తులు(పొట్టి దుస్తులు)దరించడానికి చాలా మంది ఇష్టపడుతారు. అయితే, సన్ టాన్ కు గురై, చంకల్లో నలుపు ప్యాచ్ లుగా ఉన్నప్పుడు స్లీవ్ లెస్ డ్రెస్సులు కానీ, బ్లౌైజులు కానీ ధరించడానికి సాధ్యం కాదు.

చంకల్లో నలుపు ప్యాచ్ లు కలిగి ఉండటం చాలా మందిలో చాలా ఇబ్బందికరమైన విషయం. ఈ సమస్యను నివారించుకోవడానికి చాలా మంది స్కిన్ కేర్ క్లీనిక్స్ మరియు సలూన్స్ లో ఎక్కువ డబ్బును ఖర్చు చేస్తుంటారు. అయితే, సన్ టాన్ కు గురైన అండర్ ఆర్మ్ ను సమస్య నివారించడానికి, సన్ టాన్ నివారించడానికి కొన్ని చిట్కాలను ఇక్కడ అందివ్వడం జరిగింది . అంతే కాదు, కొన్ని హోం రెమడీస్ కూడా సన్ టాన్ ను నివారిస్తాయి.

కాబట్టి, ఈ సింపుల్ చిట్కాలను ఉపయోగించి ప్రత్యక్షంగా ఎఫెక్టివ్ మార్పులను గమనించండి. ఈ చిట్కాలలో ఏవి ఉపయోగించినా అండర్ఆర్మ్ నుండి సన్ టాన్ ను తగ్గిస్తుంది...

తేనె మరియు నిమ్మరసం

తేనె మరియు నిమ్మరసం

ఈ రెండింటి కాంబినేషన్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. నిమ్మరసం సూపర్ క్లీనింగ్ ఏజెంట్ లక్షణాలను కలిగి ఉంది. అండర్ ఆర్మ్ నుండి సన్ టాన్ నివారించడానికి ఇది అద్భుతంగా సమాయపడుతుంది. చంకల్లో కొద్దిగా తేనె రాసి, తర్వాత నిమ్మ తొక్కతో రుద్ది కాసేపు అలాగే ఉంచి తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

బంగాళదుంప

బంగాళదుంప

నిమ్మతర్వాత మరో మంచి నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్ బంగాలదుంప. బంగాళదుంప ముక్కలతో చంకల్లో బాగా రుద్ది తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల సన్ టాన్ తొలగించబడుతుంది. సన్ టాన్ నివారించడానికి ఇది ఒక ఎఫెక్టివ్ హోం రెమడీ.

అలోవెరా

అలోవెరా

అలోవెరాలోని స్కిన్ మరియు హెయిర్ బ్యూటీ బెనిఫిట్స్ మీకు తెలిసిందే . అలోవెరా ఇంకా సన్ టాన్ నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. చంకల్లో నలుపు, సన్ టాన్ నివారించడానికి అలోవెరా జెల్ ను చంకల్లో బాగా మర్దన చేసిన తర్వాత వెచ్చటని నీటితో కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా కొన్ని రోజులు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

పసుపు-పాలు

పసుపు-పాలు

పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటర్ లక్షణాలు కలిగి ఉంటుంది. కాబట్టి, ఇది చర్మానికి కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. సన్ టాన్ నివారించడంలో ఈ రెండింటి కాంబినేషన్ చాలా చక్కగా పనిచేసి, స్కిన్ కాంప్లెక్స్ ను మార్చుతుంది. చంకల్లో టాన్ నివారించడానికి పసుపు, పాలతో పేస్ట్ లా చేసి చంకల్లో అప్లై చేసి పది నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

రోజ్ వాటర్-లెమన్

రోజ్ వాటర్-లెమన్

ఇంతక మునుపే, నిమ్మరసం ఒక అద్భుతమైన బ్లీచింగ్ ఏజెంట్ అని చెప్పడం జరిగింది . అయితే దీన్ని నేరుగా ఉపయోగించడానికి లేదు. ఎందుకుంటే ఇందులో అసిడ్ ఎక్కువగా ఉండటం వల్ల అండర్ ఆర్మ్ స్కిన్ ను డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి, నిమ్మతో పాటు మరో కాంబినేషన్ ఖచ్చితంగా ఉండాలి. ఈ రెండింటి కాంబినేషన్ లో సన్ టాన్ నివారించడంతో పాటు, చంకల్లో నలుపును కూడా తగ్గిస్తుంది. రోజ్ వాటర్ చర్మాన్ని నునుపు చేస్తుంది.

English summary

5 Simple Ways To Remove Tan From Underarms

It is the summer season and each one of us want to beat the heat by wearing minimal clothing. But are most of us still not comfortable in wearing sleeveless because of tanned underarms?
Story first published: Monday, May 5, 2014, 16:47 [IST]
Desktop Bottom Promotion