For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గోళ్ళు స్ట్రాంగ్ గా మరియు పొడవుగా పెరిగేందకు ఈ ఫుడ్స్ తీసుకోండి...

|

కొంతమంది స్త్రీలు ముఖ సౌందర్యానికి ఇచ్చే ప్రాధాన్యత, మిగతాశరీర భాగాలకు ఇవ్వరు. ముఖ్యంగా చేతిగోళ్ళు, కాళ్ళ గోళ్ళను అలక్ష్యం చేస్తుంటారు. గోళ్ళు కూడా మన శరీరంలో భాగమే అనే విషయం మరిచిపోకూడదు. ముఖ్యంగా గోళ్లను చూసి మనిషి ఆరోగ్య స్థితిగతులను చెప్పేస్తారు. కాబట్టి దీన్ని బట్టే గోళ్ళు మన శరీరంలో ఎంత ముఖ్యమైనవో అర్థం చేసుకోవచ్చు. మగువలు మరింత అందంగా కనబడాలంటే గోళ్ళు కూడా దోహం చేస్తాయి. కానీ, ఈ గోళ్లను పెంచుకోవాలన్నా మరియు వాటిని మెయింటైన్ చేయాలన్నా సులభం కాదు. గోళ్ళు ఎల్లప్పుడు యాక్టివ్ గా ఉండాలి. సాధ్యమైనంత వరకూ స్ట్రాంగ్ గా ఉంచుకోవాలి. చాలా పెళుసుగా లేదా బలహీనంగా ఉండే గోళ్ళను అప్పటికప్పుడు కట్ చేయాలి లేదా గోరు పొడవును దెబ్బతీస్తుంది.

గోళ్ళ పెంచుకొనే విధానంలో కూడా 5 రకాలున్నాయి. ఈ 5రకాల గోళ్ళకు 5 రకాలుగా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. నార్మల్ నెయిల్స్ ఎటువంటి లోపాలుండవు. డ్రై నెయిల్స్ : మీరు ఆలివ్ ఆయిల్ ను అప్లై చేయాల్సి ఉంటుంది. పెళుసుగా ఉన్న గోళ్ళు: తరచూ మాయిశ్చరైజ్ అవసరం. పెళుసుగా మారే గోళ్ళును ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే కొన్నివైద్యపరమైన సూచనలు కూడా కావాలి. సాప్ట్ నెయిల్స్: చాలా తక్కువ నీళ్ళు ఉపయోగించాలి.

మరి మీ గోళ్ళు ఏవిధంగా ఉన్నాయన్నది పెద్ద విషయం కాదు, గోళ్ళు ఎలాంటి రకమైన మీరు తీసుకొనే ఆహారపు అలవాట్లు మ్యానేజ్ చేయాల్సి ఉంటుంది. అందమైన గోళ్ళు మీరు పొందాలంటే అందకు జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకోసం వ్యక్తిగత పరిశుభ్రత, బ్యూటీ ట్రీట్మెంట్ మరియు సరైన సమతుల్య ఆహారం తీసుకొన్నట్లైతే అందమైన నక సౌందర్యాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు. పొడవైన మరియు అందమైన గోళ్ళు పొందడానికి మీరు తీసుకొనే డైట్ మీద ఎక్కువగా ఏకాగ్రతను పెట్టాలి. మరి మీ గోళ్ళ సంరక్షణ కోసం తీసుకొనే జాగ్రత్తలతో పాటు, మీ గోళ్ళను స్ట్రాంగ్ గా ఉంచే కొన్ని ఆహారాలను ఈ క్రింది విధంగా ఉన్నాయి...

సాల్మన్ ఫిష్

సాల్మన్ ఫిష్

గోళ్ళు స్ట్రాంగ్ గా ఉంచే ఆహారాలో మొదటిది సాల్మన్. సాల్మన్ ఫిష్ లో ఒమేగా 3 అండ్ ఫ్యాటీ యాసిడ్స్ రెండూ అంశాలు కూడా గోళ్ళ ఆరోగ్యానికి చాలా అవసరం అయినవి. అలాగే ఇవి చర్మానికి తగినంత హైడ్రేషన్ ను అందిస్తాయి. వారంలో రెండు మూడు సార్లు సాల్మన్ ఫిష్ ను తీసుకోవడం వల్ల మీ గోళ్ళను బలంగా ఉంచుతాయి. పెళుసుబారడంను తగ్గిస్తాయి.

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్

గోళ్ళ సంరక్షన చిట్కాలో మన శరీరానికి విటమిన్ ఎ, బి మరియు సి ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం ముఖ్యం. ఇవి జుట్టు మరియు గోళ్ళను బలోపేతం చేస్తాయి. అయితే ఈ అంశాలు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో ఎక్కువగా కనుగొనబడనవి. విటమిన్ సి ఐరన్ షోషణ ప్రోత్సహిస్తుంది కాబట్టి, ఆరోగ్యకరమైన గోళ్ళు మరియు జుట్టుకు చాలా అవసరం.

బీన్స్

బీన్స్

బీన్స్ మరియు లెంటిల్స్ గోళ్ళను స్ట్రాంగ్ గా ఉంచుతాయి. ఎందుకంటే వీటిలో బయోటిన్, ఐరన్ మరియు ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. బయోటిన్ హెయిర్ మరియు నెయిల్స్ యొక్క గ్రోత్ ను పెంచుతుంది. బీన్స్ మరియు లెంటిల్స్ లో ఉండే ఐరన్ మరియు ప్రోటీన్స్ జుట్టును మరియు గోళ్ళను బలోపేతం చేయడానికి సహాయపడుతాయి. అలాగే మిల్క్ మరియు గుడ్లు కూడా ఎక్కువగా ఐరన్ ను ఉత్పత్తిని కలిగి ఉంటాయి.

తృణధాన్యాలు

తృణధాన్యాలు

గోళ్ళను స్ట్రాంగ్ గా మెయింటైన్ చేయడానికి మరియు ఫ్రీరాడికల్స్ తో పోరాడటానికి తృణధాన్యాలు చాలా గ్రేట్ గా సహాయపడుతాయి. ముఖ్యంగా ఈ ఫ్రీరాడికల్స్ స్కిన్ మరియు హెయిర్ ను డ్యామేజ్ చేస్తాయి. అందుకు ఓట్స్ , బ్రౌన్ రైస్ మరియు ఇతర తృణధాన్యాలు, మొలకలు తీసుకోవడం చాలా మంచిది. ఫ్రీరాడికల్స్ తో పోరాడే శక్తి ఈ యాంటీఆక్సిడెంట్స్ లో పుష్కలంగా ఉన్నాయి. వీటిలో ఉండే సిలికా గోళ్ళు స్ట్రాంగ్ గా ఉండేందకు సహాయపడుతాయి.

నీళ్ళు

నీళ్ళు

నీళ్ళు మొత్తం మన శరీర ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో మనకు తెలిసిందే, ఇతర ఆహారాలతో పాటు, నీరు కూడా తీసుకోవడం చాలా అవసరం. కాబట్టి, ఎల్లప్పుడు మీ జుట్టు, చర్మంతో పాటు, గోళ్ళను కూడా తేమగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఎంత హైడ్రేషన్ కలిగిస్తే అంతే ఆరోగ్యంగా గోళ్ళు పెరుగుతాయి. మరియు శరీరం హైడ్రోషన్ తో ఉండటం వల్ల శరీరం మొత్తంను హైడ్రేషన్ లో ఉంచడం వల్ల హెయిర్ ఫోలిసెల్ కు మరియు గోళ్ళను బలోపేతం చూస్తుంది.

బాదం

బాదం

బాదంలో ప్రోటీన్స్ అధికంగా కలిగి ఉండటం మాత్రమే కాదు, మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటుంది. మెగ్నీషియం కూడా హెల్తీ హెయిర్ అండ్ హెల్తీ నెయిల్స్ మెయింటైన్ చేయడానికి కూడా బాదం గొప్పగా సహాయపడుతుంది. అలాగే సోయా బీన్స్ మరియు గ్రీన్ లీఫ్స్ లో కూడా మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల, ఇవి గోళ్ళను స్ట్రాంగ్ గా ఉంచుతుంది.

English summary

6 Foods For Strong & Long Nails

Long nails add an extra charm to your beautiful fingers. But, growing and maintaining it is not easy. Nails will stay attractive only if they are strong enough. Weak nails will break before they reach the desired length.
Desktop Bottom Promotion