For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చలికాలంలో తప్పక గుర్తించుకోవల్సిన 7 స్కిన్ కేర్ టిప్స్

|

ఇప్పటికే చలికాలం ప్రారంభమైంది, మనస్సులో ఇప్పటికే చర్మ సంరక్షణ మరియు ఆరోగ్య సంరక్షణ కోసం ఆలోచనలు మొదలై ఉంటాయి. ఈ చలికాలంలో చర్మాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోవసం ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి. ఎటువంటి క్రీములు, వాడాలి అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. గడిని నెలలు హాట్ గా ఉన్నా, చలికాలం మనకు ఇక వరం లాంటిందే అనిచెప్పవచ్చు. అయితే ఆరోగ్యం మరియు బ్యూటీ కోసం ఈ చలికాలంలో తీసుకోవల్సిన కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తల కోసం తయారవ్వడం మెదలు పెట్టే ఉంటారు.

మరి ఈ చలికాలంలో చల్లని వాతారణం నుండి ఇటు అందాన్ని మరియు అటు ఆరోగ్యానికి కాపాడుకోవడం కోసం ఆరోగ్యకరమైన డైట్ మరియు కరెక్ట్ వ్యాయామం అనుసరించడం ఒక ఉత్తమ పరిష్కారమార్గం. ముఖ్యంగా దుస్తుల విషయంలో మందంగా ఉండే కాటన్ దుస్తులను ధరించడం మరియు స్వెటర్లు, షాలవాలు అవసరం అయినప్పుడు ఉపయోగించడం చాలా అవసరం. చలికాలంలో ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకోవడం కోసం వీటితో పాటు అనుసరించాల్సి మరికొన్ని చిట్కాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి...

1. ఎక్కువగా ద్రవాలను మరియు నీటిని తీసుకోవాలి: సీజన్ ఏదైనా శరీరానికి సరిపడా నీరు అవసరం, చర్మం తేమగా ఉండాలంటే, తగినన్ని నీరు తీసుకోవడం చాలా అవసరం. నీరు అంతర్గత అవయవాలను శుభ్రం చేయడానికి అవసరం అవుతాయి. అంతేకాదు, ప్రతి రోజూ తెలిసి, తెలియక అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకుంటుంటారు కాబట్టి, ఆరోగ్యానికి హానికలిగించే రసాయనిక ఆహారాలను క్లీన్ చేయడానికి నీరు, ఫ్రూట్ జ్యూస్ లు ఎక్కువగా సమాయపడుతాయి. చాలా వరకూ చలికాలంలో ఎక్కువదాహం అవ్వడం లేదని నీరు త్రాగడాన్ని మానేస్తుంటారు.హెల్తీ బాడీ కోసం కనీసం 4 లీటర్ల నీరైనా త్రాగాల్సిందే. అలాగే ఈ చలికాలంలో గ్రీన్ టీ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. కాఫీ మరియు టీలు కూడా ఒక రకంగా ఉపశమనం కలిగిస్తాయి. వీటివల్ల మీరు హెల్తీగా మరియు ఫ్రెష్ గా భావిస్తారు.

2. తగినంత నిద్ర: మీరు రాత్రుల్లో సినిమాలు చూడటం లేదా స్నేహితులతో చిట్ ఛాట్ చేయడం వంటి చేయడం వల్ల నిద్రలేమి సమస్యను ఎదుర్కోవల్సి వస్తుంది. చలికాలంలో గాఢ నిద్ర చాలా అవసరం. బాగా నిద్రపోవడం వల్ల ఇటు అందం అటు ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది . మీరు సరిగా నిద్రపోనట్లైతే, అది మీ శరీరం మీద ప్రభావం చూపుతుంది. నిద్రలేమి వల్ల కళ్ళక్రింద నల్లని వలయాలు చారలు ఏర్పడటం మాత్రమే కాదు, అది శరీరం మీద చెడు ప్రభావాన్ని చూపుతుంది. వ్యాధినిరోధకతను ఎదుర్కోవడానికి తగినంత నిద్ర చాలా అవసరం అవుతుంది.

3. ఆరోగ్యకరమైన (తాజా పండ్లు-కూరలు)తీసుకోవడం: చలికాలంలో ఎక్కువగా కారంగా మరియు వేడిగా ఉన్న ఆహారాలను తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు . ఇది మంచి ఉపాయమే అయినప్పటికీ, హాట్ అండ్ స్పైసీ ఫుడ్స్ మీ ఆరోగ్యం మీద ప్రభావ చూపుతుంది. కాబట్టి, ఎక్కువగా చల్లని సలాడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. హెల్తీ అండ్ ఫిట్ బాడీ కలిగి ఉండాలంటే, తాజాగా ఉండే పండ్లు మరియు కూరగాయలు తీసుకోవాలి.

4. వేచ్చని స్నానం: చలికాలంలో వేడినీళ్ళ స్నానం అంటే ఎరికి ఇష్టముండదు చెప్పండి. కానీ చాలా వేడిగా ఉన్న నీళ్ళతో స్నానం మరియు 10నిముషాల కంటే ఎక్కువ సమయం చలికాలంలో స్నానం చేయడం ఆరోగ్యానికి హాని కలుగుతుందని కొన్ని పరిశోదనలు తెలుపుతున్నారు. కాబట్టి, మీ స్నానం చాలా తక్కువ సమయంలో ముగించేయాలి. ఎక్కువ సమయం షవర్ క్రింద ఉండటం వల్ల చర్మంలోని తేమను తగ్గించేసి, చర్మాన్నిమరింత డ్రైగా మార్చేస్తాయి. తరచూ మీరు మాయిశ్చరైజర్స్ అప్లై చేయాల్సి ఉంటుంది. మరియు మీరు స్నానానికి ఉపయోగించే సోపులను కూడా మాయిశ్చరైజ్డ్ పోపులను ఎంపిక చేసుకోవాలి.

5. మంచి వ్యాయామం: చలికాంలో మీరు ఎంత ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు అంత వ్యాయామాన్ని చేయాల్సి ఉంటుంది. సాధ్యమైనంత వరకూ శరీరానికి కొంత శ్రమను కలిగించండి . చలికాలంలో ఆరోగ్యంగా ఉండటానికి వ్యాధినిరోధకతను పెంచుకోవడానికి ఇది ఒక ఉత్తమ మార్గం. జిమ్ లేదా యోగా చేయడం మంచి మార్గం. చలికాలంలో చెమట పట్టించడం అంటే కొంచెం కష్టమే కాబట్టి రోజుకు కనీసం ఒక గంట వ్యాయామం చేయడం మంచిది.

6. చలికాలంలో చర్మానికి రక్షణ: చలికాలంలో కఠిమైన ఈదురు గాలులు చర్మానికి హాని కలిగించి డ్రైగా మార్చుతుంది. కాబట్టి, కాటన్ దుస్తులను, ఉలెన్ స్వెటర్లు, షాల్స్ శరీరానికిరక్షణగా కప్పి ఉంచుకోవాలి. రాత్రుల్లో బయటకు వెళ్ళాలనుకొనే వారు, తప్పనిసరిగా చెవులకు కవర్ చేసి ఉండేట్లు, స్కార్ఫ్ కట్టుకోవాలి.

7 Skin Care Tips To Remember This Winter

English summary

7 Skin Care Tips To Remember This Winter

Winter is already here and you must be worried about the harsh weather taking a toll over your health and skin. After the last few months of hot and sticky weather, winter truly comes as a blessing. But this season, there are certain winter preparedness tips that you must follow for good health and beauty.
Story first published: Friday, November 28, 2014, 16:16 [IST]
Desktop Bottom Promotion