For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మనకు తెలిసిన 9 గ్రేట్ ఆయిల్స్: వాటిని ఎలా ఉపయోగించాలి

By Super
|

నూనెలు అందించే అన్ని రకాల ప్రయోజనాలను మనం ఉపయోగించుకోవటం లేదు. ఇవి అంతర్గతంగా మరియు బాహ్యంగా రెండు విధాలుగా ఉపయోగపడతాయి. వంటగదిలో సలాడ్ తయారుచేయటానికి మరియు బాత్రూంలో మీ జుట్టు శుభ్రం చేసుకోవటానికి సహాయపడుతుంది. నూనెలు గొప్ప మాయలు చేస్తాయి. ఈ నూనెలు మనకు అనేక రకాలుగా ఉపయోగపడతాయి. ఈ నూనెలు స్టార్స్ గా ఉన్నప్పటికీ,మీరు వాటిని ఉపయోగించవచ్చు. ఇవి మిగిలిన వాటి కన్నా ప్రత్యేకంగా ఉంటాయి.

ఆహారం మరియు వ్యాయామం,కొన్ని నూనెలు మీ చర్మం ఇతరుల కంటే మెరుగ్గా ఉండటానికి సహాయపడతాయి. కాబట్టి ప్రేరణగా ఈ జాబితాను ఉపయోగించండి. మీ శరీరం కోసం ఉత్తమ నూనెలను కనుగొనే సమయంలో మీరు చర్మం రకం,జుట్టు,అభిరుచులు మరియు అవసరాలను గుర్తుంచుకోవాలి. టాప్ తొమ్మిది నూనెలను ఎలా ఉపయోగించలో ఇక్కడ తెలుసుకుందాము.

జనపనార ఆయిల్

జనపనార ఆయిల్

నా అభిప్రాయంలో,జనపనార నూనె ప్రత్యేకించి మోటిమలకు గురయ్యే వారి చర్మం కొరకు ఉత్తమ నూనె అని చెప్పవచ్చు. నేను ప్రతి సాయంత్రం ముఖం కడిగేటప్పుడు ఉపయోగిస్తాను. ఇది మేకప్ ను తొలగిస్తుంది. అంతేకాక చర్మంను లోతుగా శుభ్రపరుస్తుంది. ఇది ముదురు ఆకుపచ్చ రంగు మరియు ఎరుపు రంగు మచ్చల పోరాటంలో అద్భుతంగా పనిచేస్తుంది. మీ చర్మ రంద్రాలు మూసుకొనిపోవు. ఎందుకంటే సేంద్రీయ జనప విత్తనాల నూనె ఒక ప్రక్షాళన మరియు మాయిశ్చరైజర్ గా బాగా పనిచేస్తుంది. జనపనార నూనెలో 57% లినోలెనిక్ ఆమ్లం ఉంటుంది. మీ చర్మంలో లినోలెనిక్ ఆమ్లం జోడించడం (మరియు మా ఆహారంలో) వలన మృదువైన మరియు సున్నితమైన నూనె గ్రంధులను సృష్టిస్తుంది.

మీ ఆహారంలో జోడించినప్పుడు కూడా జనపనార నూనె అద్భుతాలను చేస్తుంది. ఇది సలాడ్ డ్రెస్సింగ్ లో అద్భుతంగా ఉంటుంది (కేవలం ఆపిల్ సైడర్ వెనీగర్,సముద్ర ఉప్పు,ఒరేగానో మరియు వెల్లుల్లి తో మిక్స్) లేదా మీ స్మూతీస్ లో జోడించండి. ఈ నూనె తాజాగా ఉండాలంటే తప్పనిసరిగా ఫ్రిడ్జ్ లో పెట్టాలి. దీనిని మీరు ఏ ఆరోగ్య ఆహార స్టోర్ లోనైనా కనుగొనవచ్చు.

వేప నూనె

వేప నూనె

ఇది ఒక వండర్ నూనె అని చెప్పవచ్చు. ఇది మోటిమలు, మచ్చలు,కట్స్ మరియు గాయాలు తగ్గించటానికి చాలా బాగా పనిచేస్తుంది. నాకు ఒక మచ్చ వస్తే నేను రాత్రి పూట నునెను రాసి,మరల ఉదయం చుస్తే మాయం అయిపొయింది. ఇది చర్మం కోతలు లేదా గాయాల వైద్యం కోసం ఇంట్లో ఉంచుకోవటం గొప్ప పని.ఈ నూనెను మీ నోటితో ఉపయోగించకూడదు. ఎందుకంటే ఒక గాఢమైన వాసన కలిగి ఉంటుంది. అందువల్ల బాహ్యంగా మాత్రమే ఉపయోగించాలి.

ఆముదం

ఆముదం

ఈ నూనె మలబద్ధకం నుండి ఉపశమనం మరియు డెలివరి ప్రేరణ కోసం ఉపయోగించవచ్చు. ఆముదముతో నా ఇష్టమైన ఉపయోగం జుట్టు పెరుగుదల కొరకు ఉంది.ప్రతి సాయంత్రం నేను కొంచెం ఆముదం తీసుకోని నా జుట్టుకి బాగా పట్టించాను. దీని వలన జుట్టు బాగా పెరగటం,తేమ మరియు కొత్త జుట్టు పెరుగుదల ఉత్పత్తిలో సహాయపడుతుంది.

నేను భోజనం చేసిన కొన్ని గంటల తర్వాత నా పొట్టను ఆముదంతో రుద్దటం వలన జీర్ణక్రియకు సహాయపడుతుంది. మీ పొట్ట మీద రాసిన తర్వాత మీ చర్మం దాన్ని బాగా గ్రహించటానికి పైభాగంలో వేడి నీటి బాటిల్ ను జోడించవచ్చు. మీరు హెక్సేన్ లేని అధిక నాణ్యత గల బ్రాండ్ వాడాలని నిర్దారించుకోండి. ఎందుకంటే ఈ నూనె చాలా లోతుగా గ్రహిస్తుంది.

కొబ్బరి నూనె

కొబ్బరి నూనె

కొబ్బరి నూనె వంటగదిలోను,బయట రెండు చోట్ల రాక్ స్టార్ గా పనిచేస్తుంది. ఇది వంటలకు ఉత్తమమైనది. కొబ్బరి నూనె అత్యధిక స్మోక్ పాయింట్లను కలిగి ఉంటుంది. దీనిని వేడి చేసినప్పుడు ఇతర నూనెల వలె పులిసిపోదు. దీనిలో బాక్టీరియా మరియు శిలీంద్ర నివారక లక్షణాలు ఉండుట వలన ఒక సూపర్ ఫుడ్ గా భావిస్తారు. అంతర్గతంగా కూడా వాడవచ్చు. ఇది స్మూతీస్ కి అద్భుతంగా జోడించబడుతుంది. దీనిని సంపన్న మేకింగ్ కాఫీ లేదా టీ లో వేస్తె రుచికరముగా ఉంటుంది. మీ మెదడుకు ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకురావడం ద్వారా పోషకాలను మరింత అందిస్తుంది.

కొబ్బరి నూనె చర్మం మరియు జుట్టు రెండింటి కోసం అద్భుతముగా పనిచేస్తుంది. నేను కంటి మేకప్ తొలగించడానికి రాత్రి సమయంలో కాటన్ మీద కొబ్బరి నూనె వేసి శుభ్రపరుస్తాను. నా జుట్టుకు మాయిశ్చరైజింగ్ కోసం హెయిర్ మాస్క్ వేస్తాను. అంటే రాత్రి పూట నా జుట్టుకు నూనెను బాగా పట్టించి ఉదయం శుభ్రం చేసుకుంటాను. కొబ్బరి నూనెను ఆయిల్ పుల్లింగ్ ఆయుర్వేద సాధన కోసం ఉపయోగించడానికి ఉత్తమం. దీనిలో బాక్టీరియా మరియు శిలీంద్ర నివారక లక్షణాలు ఉండుట వలన కాండిడా తో సహాయపడుతుంది.

ఇది శరీరానికి కూడా మాయిశ్చరైజర్ గా ఉపయోగిస్తారు.ఎండలో బయటకు వెళ్ళినప్పుడు ముఖానికి రాసుకుంటే సుమారు SPF 10 మాదిరిగా పనిచేస్తుంది. ఇది థైరాయిడ్ ఫంక్షన్ తో సహాయపడుతుంది. థైరాయిడ్ గ్రంధి బాహ్యంగా రాయవచ్చు. ఇది జీవక్రియ మరియు శక్తిని పెంచుతుందని చెబుతారు. ఈ నూనె సహజ దుర్గంధనాశని తయారీలో ప్రధాన మూలవస్తువుగా ఉంటుంది.(యారోరూట్ పిండి, బేకింగ్ సోడా మరియు నూనెను సమాన భాగాలుగా కలపాలి)

కొబ్బరి నూనె సాలిడ్ గా ఉంటుంది. కొన్ని ఉపయోగాల కొరకు కరగటం అవసరం కాబట్టి గది ఉష్ణోగ్రత వద్ద కరుగుతుంది.

మకాడమియా గింజ నూనె

మకాడమియా గింజ నూనె

ఒక వగరు, తీపి వాసన మరియు రుచి కలిగి ఉన్న దీనిని వంటగదిలో ఉపయోగించవచ్చు. ఇది పలు ఇతర నూనెల కంటే కాస్త ఎక్కువ స్మోక్ పాయింట్ ఉంటుంది. అయితే,ఈ నూనెతో నాకు ఇష్టమైన ఉపయోగం ఏమిటంటే జుట్టు చిట్కాల కోసం మాయిశ్చరైజర్ గా ఉంటుంది. ఇతర నూనెల వలె ఈ నూనె జిడ్డుగా ఉండదు. దీనిని వంట గదిలోనూ జుట్టు రెండింటి కొరకు ఉపయోగించవచ్చు.

ఇది కూడా శరీరంనకు మాయిశ్చరైజర్ గా ఉపయోగించవచ్చు. అంతేకాక షేవింగ్ జెల్ లేదా ఆఫ్టర్ షేవ్ పెరిగిన జుట్టు లేదా రేజర్ మంటను నిరోధిస్తుంది.

అవెకాడో నూనె

అవెకాడో నూనె

జనపనార నూనె వలె ఈ నూనె కూడా ఎర్రగా మారిన చర్మం,దోషాలు మరియు మచ్చలను తగ్గించటంలో చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాక ఒక చురుకైన షేవింగ్ జెల్ మరియు శరీరం మొత్తం మరియు హెయిర్ కు మాయిశ్చరైజర్ గా బాగా పనిచేస్తుంది. అవోకాడో నూనెలు సలాడ్లకు మంచి రుచిని ఇస్తాయి. అంతేకాక వంటలలో తక్కువ ఉష్ణోగ్రతల వద్ద వేడి చేయవచ్చు.

జొజోబా నూనె

జొజోబా నూనె

ఈ నూనె చర్మం కోసం అద్భుతముగా ఉంటుంది. కానీ అంతర్గతంగా ఎటువంటి ఉపయోగాలు లేకపోవుట వలన దీనిని వంటగదిలో ఉంచవలసిన అవసరం లేదు. ఈ నూనె చర్మ ప్రక్షాళన మరియు మాయిశ్చరైజర్ కోసం ఒక గొప్ప ఎంపికగా ఉంటుంది. దీనికి మా సహజ ఆయిలీ చర్మంనకు చాలా సారూప్యత ఉంటుంది. దీనిలో బాక్టీరియా లక్షణాలు ఉండుట వలన మోటిమలు ఉన్న వారి చర్మానికి మంచి ఎంపిక గా ఉంటుంది.

ఈ నూనెలో A, B మరియు E విటమిన్లు ఉంటాయి. ఇది మేకప్ రిమూవర్ మరియు జుట్టు మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. అలాగే ఈ కీలకమైన నూనె లిప్ కండిషనర్ గా కూడా ఉపయోగించవచ్చు.

నువ్వుల నూనె

నువ్వుల నూనె

ఈ నూనె కూడా ఆయిల్ పుల్లింగ్ కోసం మరొక గొప్ప ఎంపికగా ఉంటుంది. అయితే కొబ్బరి నూనెలా రుచిగా ఉండదు. ఈ నూనె వంటలకు చాలా బాగుంటుంది. దీనిలో ఆరోగ్యకరమైన కొవ్వు మరియు జింక్ అధికంగా ఉండుట వలన చర్మం కోసం చాలా ప్రయోజనకరముగా ఉంటుంది. నువ్వుల నూనెలో విటమిన్ E లో అధికంగా ఉంటుంది. అందువల్ల తేలికపాటి సూర్యుని రక్షణ కోసం కూడా చాలా ప్రభావవంతమైనది.

హాజెల్ నట్ నూనె

హాజెల్ నట్ నూనె

దీనిలో విటమిన్ E అధికంగా ఉంటుంది.ఈ నూనె అన్ని రకాల చర్మాలకు పోషణ మరియు సున్నితమైన చర్మం కోసం మంచిగా ఉంటుంది. హాజెల్ నట్ నూనెలో తేమ లక్షణాలు ఉండుట వలన జిడ్డు చర్మం ఉన్నవారికీ అధిక చమురు ఉత్పత్తి లేకుండా చేస్తుంది. ఇది దోషాలకు కారణమవుతుంది. అంతేకాక దీనిలో రక్తస్రావ నివారిణి గుణాలు ఉన్నాయి. అలాగే రంధ్రాలు బిగుసుకుంటాయి. నూనె స్రావాలు పరిమితంగా ఉంటాయి.

English summary

9 Great Oils + How To Use Them


 Oils don’t get enough credit for all the benefits they provide. How many items can be useful both internally and externally, in the kitchen and in the bathroom, in your salad and in your hair? Oils are magical and the these oils are going to blow your mind with their many different uses.
Desktop Bottom Promotion