For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హాట్ సమ్మర్: కూల్ బాడీ-సమ్మర్ టిప్స్

వేసవిలో వేడి చర్మాన్ని ప్రభావితం చేస్తుంది. చర్మం కమిలిపోవడం..స్నానం చేసిన గంటకే తాజాదనం తగ్గి శరీరం వడిలిపోయినట్లు అవడం..లాంటి సమస్యలు ఓన్నో అలాంటి వాటిని అదుపులో ఉంచి చర్మం తాజాదంన సంతరించుకునేలా చే

|

వేసవిలో వేడి చర్మాన్ని ప్రభావితం చేస్తుంది. చర్మం కమిలిపోవడం..స్నానం చేసిన గంటకే తాజాదనం తగ్గి శరీరం వడిలిపోయినట్లు అవడం..లాంటి సమస్యలు ఓన్నో అలాంటి వాటిని అదుపులో ఉంచి చర్మం తాజాదంన సంతరించుకునేలా చేయాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

వేసవికాలంలో ఆరోగ్యాన్ని శరీరసౌందర్యం దెబ్బతినకుండా ఎదుర్కోవడానికి కొన్ని చిట్కాలను ప్రయత్నించి చూద్దాం...

నిమ్మతొక్క:

నిమ్మతొక్క:

వాడేసిన నిమ్మడిప్పలు కొద్దిగా నీటిలో బాగా ఉడికించి చాల్లార్చిన తర్వాత గట్టిగా పిండి రసం తీసి, అందులో అరచెంచాడు లావెండర్ ఆయిల్ కలుపుకుని, శరీరానికి లైట్ గా రాసుకుంటే ఎండవల్ల కలిగే ఇబ్బందులు తగ్గడమేకాక, చమట వాసన, చెమటపొక్కులు రాకుండా అరికడుతుంది. రోజంతా తాజాగా ఉంచుతుంది.

ఉల్లిపాయ:

ఉల్లిపాయ:

ఎండకాలం అంతా తరిగిన ఉల్లిపాయ ముక్క దగ్గర ఉంచుకుంటూ, అడపాదడపా వాసన చూస్తూవుంటే వడదెబ్బ తగలదు. అలాగే, చేతి రుమాలుతో చిటికెడు బియ్యపు గింజలు హారతికర్పూరంతో కలిపి మూటకట్టి వాసన పీలుస్తూ వుంటే, ఎండాకలంలో వేడివల్ల కలిగే జలుబు రాకుండా చేస్తుంది.

దుస్తులు:

దుస్తులు:

ఈ కాలంలో పల్చటి నూలు వస్త్రాలు వాడటం ఎంతైనా మంచిది. కొందరు ఎండతాపం తట్టుకోలేక బట్టలు తడిపి ఒంటిమీద వేసుకుని సేద తీరుతూ ఉంటారు. ఇది మరీ ప్రమాదం. ఎండవున్నంత సేపూ, శరీరానికి తడి ఎంత తగలకుండా ఉంటే అంతమంచిది.

కొబ్బరి నీళ్ళు:

కొబ్బరి నీళ్ళు:

వేసవిలో చాలామందికి ముఖంమీద, వీపుమీద ఎక్కువగా చెమటకాయలు వచ్చి దురద, మంట కలిగిస్తాయి. వీటితో ఎంతో అస్థిమతం అయిపోతాం. అటువంటప్పుడు, కొబ్బరి నీరుశరీరానికి లేపనం చేసుకుంటే చెమటకాయలు, దురుదా మానిపోతాయి. ఇవేవీ లేకుండా ఉన్నప్పటికీ రాసుకోడం వల్ల ముందు ముందు ఈ బాధ రాకుండా ఉంటుంది.

తాటి ముంజలు:

తాటి ముంజలు:

అలాగే వేసవి తాటి ముంజలకి సీన్ ఈ సీజన్ లో వీలైనవన్ని తాటిముంజలు తినడం మంచిది. ఎండదెబ్బ తగలగకుండా కాపాడుతుంది. ఇక శరీరానికి కూడా లేపనం చేసుకుంటూ ఉంటే శరీరం కాంతివంతంగా, మృదువుగా ఉంటుంది.

ఎలక్ట్రాల్ పౌడర్/గ్లూకోజ్:

ఎలక్ట్రాల్ పౌడర్/గ్లూకోజ్:

ఈకాలంలో ఎప్పుడూ మనవద్ద ఎలక్ట్రోల్ పౌడర్, గ్లూకోస్ దగ్గర ఉంచుకోడం ఎంతో మంచిది. ఇంట్లో పిల్లలకి కూడా అడపాదడపా తాగిస్తూ ఉంటే, వాళ్లు ఆరోగ్యంగా ఉంటారు.

నీళ్ళు:

నీళ్ళు:

దాహంగాఉన్నా, లేకపోయినా, చమట పడుతుందేమో అనే సంశయం లేకుండా ఎంత నీరు తాగగలిగితే అంత మంచిది.

స్నానం :

స్నానం :

సూర్యోదయానికి ముందు, సూర్యస్తమయం అయిన తరువాత స్నానం చేయడం మంచిది. మంచి ఎండలో స్నానం చేయకూడదు.

సాల్ట్ వాటర్ :

సాల్ట్ వాటర్ :

వేసవిలో శరీర ఉష్ణోగ్రత వల్ల విరేచనాలతో బాధపడవలసి వస్తుంది. శరీరం శక్తిని కోల్పోతూ ఉంటుంది. నీరసం, నిస్త్రాణా కలిగి శరీర కాంతిసన్నగిల్లుతుంది. అటువంటప్పుడు గ్లాసుడు మంచినీటిలో కాస్తంత ఉప్పు, పంచదార కలిపి తాగితే వెంటనే ఉపశమనం ఉంటుంది.

కర్డ్ రైస్ :

కర్డ్ రైస్ :

సహజంగా వేసవిలో మనకి ఆకలి తక్కువగా వుంటుంది. ఎక్కువ ద్రవపధార్థాలతోనే కడుపు నిండిపోతూ ఉంటుంది. అటువంటప్పుడు ఒక్కోసారి భోజనం తినాలనిపించదు. ఈ గుణం పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. అందుకు మంచి మార్గం ఏమిటంటే, రాత్రి పడుకునే ముందు అన్నంలో పాలుపోసి సన్నని ఉల్లిపయా ముక్కలు వేసి తోడుపెట్టి ఉంచుకుని ఉదయాన్నే తింటే ఎండ తీవ్రత మనల్నేమి చేయలేదు.

English summary

Body Care Tips for Summer Season

Every season needs a particular type of the body care. You need to amend few of the health care tips as per every season. During the summer season there is lot of heat persistent in the atmosphere, thus we nee to take the body care accordingly.
Desktop Bottom Promotion