For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మ రక్షణకు రసాయినిక ఉత్పత్తులకన్నా, టమోటో మిన్న

|

టమాటతో ఆశ్చర్యకరమైన బ్యూటి బెనిఫిట్స్

టమోటో మనందరికి అత్యంత పరిచయం అయిన వంటింటి వస్తువు. వంటలకి అద్భుత రుచిని అందిస్తుంది. అంతే కాదు, ఆరోగ్యానికి కూడా పలు విధాలుగా సహాయపడుతుంది. అందుకే ప్రతి ఒక్కరి వంటగదిలోనూ తప్పని సరిగా నిల్వ ఉంటుంది. ఈ రెడ్ జ్యూసీ టమోటోను వివిధ రకాల వంటల్లో విరివిగా ఉపయోగిస్తుంటారు. చాలా మందికి ఈ జ్యూసీ రెడ్ టమోట ఇంటర్నల్ గా హెల్త్ కు సంబంధించిన ప్రయోజనాలు మాత్రమే కాదు, ఎక్స్ టర్నల్ గా బాడీ కేర్ అద్భుతంగా సహాయపడే లక్షణాలు తెలుసుకుంటే, ఆశ్చర్యం కలగకుండా ఉండదు.

టమోటలో విటమిన్ ఎ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అంతే కాదు అన్ని రెడ్ ఫ్రూట్స్ లోలాగే ఈ రెడ్ కలర్ టమోటోలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ కారణం చేతనే ఈ టమోటోను బ్యూటీ ట్రీట్మెంట్స్ లో విరివిగా ఉపయోగిస్తుంటారు . టమోటోల్లోని అసిడిక్ యాసిడ్ చర్మం యొక్క పిహెచ్ స్థాయిలను బ్యాలెన్స్ చేస్తుంది మరియు చర్మంలోని అదనపు నూనెను నివారిస్తుంది. టమోటలోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు శరీరంలో ఫ్రీరాడికల్స్ ను తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

అందాన్ని మెరుగుపరుచుకోవడానికి మార్కెట్లో వివిధ రకాల కెమికల్స్ మరియు కాస్మోటిక్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే అవి ప్రస్తుతానికి తాత్కాలిక ఉపశమనం కలిగించినా, దీర్ఘకాలంలో వీటి దుష్ప్రభాలు ఎక్కువగా ఉంటాయి . కాబట్టి, సురక్షితమైన పద్దతిలో బ్యూటీ కేర్ తీసుకోవడం చాలా ముఖ్యం. అందానికి ఉపయోగపడే వస్తువుల్లో మనకు లభించే నేచురల్ బ్యూటీ ప్రొడక్ట్స్ లో టమోటో కూడా నేచురల్ గా అందుబాటులో ఉంటుంది. కాబట్టి, మీ బ్యూటీ కోసం టమోటోలను ఉపయోగించి వ్యత్యాసంను గమనించండి...

సన్ స్ర్కీన్ :

సన్ స్ర్కీన్ :

టమోటోల్లో లికోపిన్ అనే యాంటీఆక్సిడెంట్ అత్యధికంగా ఉంటుంది. ఇది శరీరానికి ఒక సన్ స్ర్కీన్ లా పనిచేస్తుంది. బాడీకేర్ విషయంలో టమోటో ఆహార రూపంలో తీసుకోవడం లేదా టమోటో రసాన్నిచర్మానికి అప్లై చేస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది.

యాంటీఏజింగ్:

యాంటీఏజింగ్:

టమోటోలో ఉన్న యాంటీఆక్సిడెంట్స్ సెల్యులార్ డ్యామేజ్ తో పోరాడుతుంది. శరీరంలోని ప్రీరాడికల్స్ ను నివారించడంతో చిన్న వయస్సులోనే ఏర్పడే వృద్ధాప్య ఛాయలను నివారిస్తుంది. ఇది ఒక అద్భుతమైన కారణం చేత టమోటోలను బ్యూటీ వస్తువుగా ఉపయోగించుకోవచ్చు.

చర్మరంధ్రాలు కుచించుకుపోయేలా చేస్తుంది:

చర్మరంధ్రాలు కుచించుకుపోయేలా చేస్తుంది:

శరీరానికి టమోటలను ఉపయోగించడానికి మరో కారణం. చర్మరంధ్రాలను నివారించడానికి టమోటో జ్యూస్ లో కొద్దిగా నిమ్మరసం చేర్చి, రెగ్యులర్ గా చర్మానికి అప్లై చేయడం ద్వారా చర్మ రంధ్రాలను నివారించుకోవచ్చు.

మొటిమలను నివారిస్తుంది:

మొటిమలను నివారిస్తుంది:

మొటిమలు మరియు మచ్చలు నివారించుకోవడానికి చాలా మంది అనేక విధాలుగా టెక్నిక్స్ ను ఉపయోగిస్తారు. అయితే ఒక సారి టమోటను ట్రై చేసి చూడండి. బాడీకేర్ లో టమోటలను ఉపయోగించడంలో మొటమలను నివారిస్తుంది. అందుకు టమోటలో ఉన్నవిటమిన్ ఎ మరియు విటమిన్ సి బాగా సహాయపడుతుంది.

ఆయిల్ స్కిన్ :

ఆయిల్ స్కిన్ :

సాధారణంగా మనలో చాలా మందికి ఆయిల్ స్కిన్ కలిగి ఉంటుంది. అందువల్ల ఆయిల్ స్కిన్ నివారించడం కోసం రసాయనాలతో తయారుచేసిన కాస్మొటిక్స్ ను అప్లై చేయవల్సిన అవసరం లేదు. టమోటో రసాన్ని రెగ్యులర్ గా ఆయిల్ స్కిన్ మీద అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. టమోటోలను ఉపయోగించడానికి బాడీకేర్ లో ఇది మరో టెక్నిక్.

సన్ బర్న్ స్కిన్:

సన్ బర్న్ స్కిన్:

ఎండలో తిరిగినప్పుడే, చర్మం నల్లగా మారడం, మంట మరియు ఇతర చర్మ సంబంధిత సమస్యలను నివారించుకోవడానికి టమోటో రసం చర్మానికి కూలింగ్ ఎఫెక్ట్ మరియు దురద పెట్టే చర్మాన్ని నివారిస్తుంది.

చర్మాన్ని ప్రకాశించేలా చేస్తుంది:

చర్మాన్ని ప్రకాశించేలా చేస్తుంది:

బాడీకేర్ లో టమోటోలతో మరో బ్యూటీకేర్ టిప్ ఏమిటంటే, ప్రతి ఒక్క మహిళ తను అందంగా, ప్రకాశించే నునుపైన చర్మం ఉండాలిన కోరుకుంటుంది. అందుకు తేనెతో టమోటో జ్యూస్ ను మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి ఇది ఫర్ ఫెక్ట్ గ్లోయింగ్ స్కిన్ ను అంధిస్తుంది.

చుండ్రును నివారిస్తుంది:

చుండ్రును నివారిస్తుంది:

టమోటోలను స్కిన్ కేర్ కు మాత్రమే కాదు ఇది హెయిర్ కేర్ కూడా చక్కగా ఉపయోగపడుతుంది. టమోటో రసాన్ని రెగ్యులర్ గా తలకు పట్టించడం వల్ల తలలో దురద మరియు చిక్కు నివారిస్తుంది మరియు చుండ్రును పూర్తిగా తగ్గిస్తుంది.

ఆరోగ్యకరమైన జుట్టుకు:

ఆరోగ్యకరమైన జుట్టుకు:

నాణ్యమైన మరియు షైనీ హెయిర్ పొండం కోసం వివిధ రకాల షాంపులు, మరియు హెయిర్ ప్రొడక్ట్స్ ను వాడటం కంటే, టమోటోలను జుట్టు సంరక్షణలో ఒక బాగంగా చేర్చుకుంటే, జుట్టును ఆరోగ్యంగా ఉంచతుంది. టమోటో మీ జుట్టు యొక్క పిహెజ్ స్థాయిలను పెంచుతుంది మరియు ఇది జుట్టుకు సహజ రంగును తీసుకొస్తుంది.

English summary

Body Care With Tomatoes

Tomatoes are something you will find in almost every kitchen. It is a staple ingredient in many dishes. Most of us are quite fond of this red fleshy vegetable. But, you may get astonished when you realize that these simple tomatoes have innumerable uses in body care.
Story first published: Tuesday, March 25, 2014, 15:21 [IST]
Desktop Bottom Promotion