For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వర్షాకాలంలో మీ పాదాల సంరక్షణ కొరకు సులభ చిట్కాలు

By Super
|

వర్షాకాలం త్వరలోనే వచ్చేస్తుంది. అప్పుడు రోడ్డ్లు చాలా వరకు వరద నీటితో నిండిపోతాయి. అప్పుడు బయటకు రావటం అనేది అనివార్యం అయినప్పటికీ,నీటితో నిండిన వీధులలో మీరు నడవటం వలన మీ పాదాలు నాశనం మరియు పాడుఅవుతాయి. దాని పలితంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏర్పడతాయి. ఇక్కడ వాటి కోసం ఈ సీజన్లో తీసుకొనే సంరక్షణ గురించి ఉన్నది.

మీ పాదాలను శుభ్రంగా ఉంచుకోండి

మీ పాదాలను శుభ్రంగా ఉంచుకోండి

మీ పాదాలకు ఫంగల్ దాడి యొక్క తీవ్రతను తగ్గించటానికి శుభ్రంగా ఉంచుకోండి. మీరు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత పాదాలను సబ్బు మరియు నీటితో శుభ్రంగా కడగాలి. అలాగే వాటిని ప్రత్యేకించి మీ కాలి వేళ్ళ మధ్య పొడిగా మరియు తేమ లేకుండా తుడవాలని గుర్తుంచుకోండి.

మీ గోళ్ళపై క్లిప్ చేయండి

మీ గోళ్ళపై క్లిప్ చేయండి

గోర్ల కింద చాలా దుమ్ము పేరుకుని ఉంటుంది. కాబట్టి వర్షాకాలంలో మీ గోళ్ళను చిన్నగా ఉంచడం ఒక తెలివైన పని. క్రమం తప్పకుండా మీ గోళ్ళపై క్లిప్పింగ్ చేయుట వలన సులభంగా మీ పాదాలను శుభ్రంగా ఉంచుకోవడం కోసం సహాయపడుతుంది.

సరైన పాదరక్షలను ధరించాలి

సరైన పాదరక్షలను ధరించాలి

కాన్వాస్ బూట్లు మరియు అధిక హీల్ కలిగిన బూట్లను ఈ సీజన్లో దూరంగా ఉంచండి. కొన్నిసార్లు మీ పాదాలు తడిగా ఉన్నప్పుడు కూడా పాదరక్షలు ధరించడం మంచిది కాదు. కానీ తడిగా మరియు మూసి ఉన్న బూట్లను ధరించటం వలన ఇన్ఫెక్షన్ వస్తుంది. దానికి బదులుగా,వాటర్ ప్రూఫ్ పదార్థంతో తయారుచేసిన,ఫ్లిప్ ఫ్లాప్ లేదా ఇతర ఓపెన్ బొటనవేలు పాదరక్షలను ఎంపిక చేసుకోవాలి.

మీ పాదరక్షలను శుభ్రంగా ఉంచండి

మీ పాదరక్షలను శుభ్రంగా ఉంచండి

మీ పాదాల వలే మీ పాదరక్షలు కూడా శుభ్రంగా ఉండటం ముఖ్యం. మీ ఫ్లిప్ ఫ్లాప్ లేదా బూట్లలో నీరు లేకుండా రాత్రి పూట వాటిని పొడిగా ఉండేలా శుభ్రం చేయండి. మొత్తం మురికి మరియు మలినాలు పోయాయని నిర్ధారించుకోండి. ఈ విధంగా చేయుట వలన ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలు తగ్గుతాయి.

పెడిక్యుర్ చేయించుకోండి

పెడిక్యుర్ చేయించుకోండి

వర్షాకాలంలో మీ పాదాలకు నెలకు ఒకసారి పెడిక్యుర్ తప్పనిసరిగా చేయించుకోవాలి. సంవత్సరంలో ఈ సమయంలో మీ పాదాలకు గాయాలు అవుతూ ఉంటాయి. అందువలన పెడిక్యుర్ చేయించుకోవటం వలన మంచి విలసవంతముగా ఉండవచ్చు. కానీ శుభ్రంగా మరియు క్రిమిరహిత పరికరాలను ఉపయోగించాలి

English summary

Care for your feet this rainy season

The rains are finally here, and for most of us that means flooded roads. While it's inevitable to venture out, wading through waterlogged streets can wreck havoc on your feet and can also result in fungal infections. Here's how to care for them this season...
Desktop Bottom Promotion