For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమ్మమ్మల యొక్క అందమైన చర్మం మరియు జుట్టు రహస్యాలు

By Super
|

ఒక మొటిమ ఓవర్నైట్ బయటకు రావటం,జుట్టు తగినంత మెరుపు లేకపోవటం,చర్మం చాలా పొడిగా అనిపిస్తుంది! మేము అనేక జుట్టు మరియు చర్మ భాదలను ఎదుర్కొంటున్నాము.

కానీ భయాందోళనలకు గురి అయి తప్పు క్రీమ్ ఉపయోగించకుండా,నమ్మలేని అమ్మమ్మ అందం రహస్యాలను ఎందుకు పరీక్ష మరియు ప్రయత్నించకూడదు. తరువాత,ఆమె దాదాపు అన్ని అందం సమస్యలకు పరిష్కారాలు చూపుతుంది.

ఇక్కడ వాటిలో కొన్ని ఉన్నాయి. నమ్మండి,ఖచ్చితంగా వీటిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

పసుపు పొడి తీసుకోని దానికి నీరు మరియు కొన్ని చుక్కల నిమ్మ రసంను జోడించండి. ఈ మిశ్రమాన్ని మొటిమల మీద రాసి,పదిహేను నిమిషాల తర్వాత శుభ్రంగా కడగాలి. ముల్టాన మట్టి ముఖం నుండి మొటిమలు, ధూళి మరియు నూనెను వదిలించుకోవటం కొరకు మరొక గొప్ప అంశంగా ఉంటుంది. దీనిలో కొంచెం రోజ్ వాటర్ కలిపి ముఖానికి సమానంగా రాయాలి. ఇది ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. మీ ముఖం పొడిగా మారుతుంది.

అనేక ప్రయోజనాలు కలిగిన శనగపిండి,పసుపు,కొన్ని నిమ్మ చుక్కలు,పాల మీగడ కలిపిన ప్యాక్ మీ ముఖానికి వేస్తె మీ ముఖం మెరుపు సంతరించుకుంటుంది. మీ చర్మం కాంతి జోడించడానికి మరొక మార్గం ఉంది. మసూర్ పప్పు,తేనే లేదా పెరుగు, కొన్ని చుక్కల రోజ్ వాటర్,నారింజ తొక్కల పొడిలో కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇది మీ చర్మానికి కాంతిని ఇవ్వటమే కాకుండా ఎక్స్ ఫ్లోట్ చేస్తుంది.

Grandma’s secrets for beautiful skin and hair

చుండ్రు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే,రాత్రి పూట నీటిలో మెంతులను నానబెట్టి మరుసటి ఉదయం పేస్ట్ గా చేయాలి. మీ తల పై చర్మం మీద ఈ పేస్ట్ రాసి,కొన్ని గంటల తర్వాత సీకాయి లేదా షాంపూ తో శుభ్రం చేసుకోవాలి. మరో మంచి పరిహారం ఏమిటంటే తెలుపు మిరియాలతో పెరుగు కలిపి మీ నెత్తిమీద చర్మంపై రాయండి. పెరుగు చుండ్రు మరియు ఇతర జుట్టు మరియు చర్మం సమస్యలను బహిష్కరించటానికి సహాయం చేసే వ్యతిరేక శిలీంధ్ర లక్షణాలను కలిగి ఉంటుంది.

ఆలివ్ నూనెలో కొన్ని చుక్కల తేనెను కలపండి. ఆపై మీ జుట్టులోకి బాగా మసాజ్ చేయండి. ఒక అరగంట తర్వాత ఒక తేలికపాటి షాంపూతో ప్రక్షాళన చేయండి. పెరుగులో గుడ్డు పచ్చసోన కలిపి,మీ తల పై చర్మం మీద రాయాలి. మంచి సిల్కీ మృదువైన జుట్టు మీ సొంతం అవుతుంది. ప్రకాశవంతమైన జుట్టును పొందటానికి సీకాయి సహాయపడుతుంది.

కఠినమైన చేతులు మరియు మడమల్లో పగుళ్లు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే,అప్పుడు వాటి ఉపశమనం కొరకు తేనెటీగ మైనంను ఉపయోగించండి. వాటిని మృదువుగా ఉంచటానికి పెట్రోలియం జెల్లీ రాయటం మరో మంచి మార్గం. నిద్ర పోయేముందు సాక్స్ వేసుకొని ఉదయం శుభ్రం చేయాలి. తేనెతో తయారుచేసిన చక్కెర స్క్రబ్ కూడా సహాయపడుతుంది. దీనిని మోకాలు, మోచేతులు,చర్మం పైపొరలకు రాస్తే మృదువుగా మారతాయి.

English summary

Grandma’s secrets for beautiful skin and hair


 A pimple pops overnight, hair not shiny enough, skin feels too dry! We all have faced these and many other similar hair and skin woes.
Desktop Bottom Promotion