For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అందం పెంపొందించుకోవడంలో మహిళలు చేసే తప్పిదాలు

By Super
|

ప్రస్తుత రోజుల్లో చాలా మంది అందానికి అలంకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అందంగా కనబడుటానికి ముఖ వర్చసు, చర్మ ఛాయ మాత్రమే కాదు, వస్త్రాధారణలో కూడ తగినటువంటి అభిరుచులు, అవగాహన కలిగి ఉండాలి. అందంగా కనబడాలని ఏది పడితే అది, వంటికి నప్పినా నప్పకపోయినా వేసేసుకుంటుంటారు అక్కడే కొన్ని ప్రాధమిక తప్పిధాలను చేస్తుంటారు. అలాగే ప్రతి రోజూ తలస్నానం చేయడం లేదా జుట్టు అందంగా కనబడాలని జుట్టుకు ఎక్కువ కండీషనర్ ను ప్లై చేయడం వంటి పనులు చేస్తుంటారు. అయితే వస్త్రాధారణలో, బ్యూటీ విషయంలో మరియు జుట్టు సంరక్షణ విధానంలో తన బేసిక రూల్స్ ను పాటించినట్లైతే మీరనుకొనే బ్యూటీ మీ సొంతం చేసుకోవచ్చు...

కొంత మంది తలస్నానం చేయరు మరియు మేకప్ బ్రష్ లను శుభ్రం చేయరు మరియు ఐబ్రోస్ ను ప్లక్కింగ్ చేయడం. ఇటువంటి వంటి చిన్న తప్పిదాలే చాలా తీవ్రంగా చర్మాన్ని మరియు హెయిర్ డ్యామేజ్ చేస్తాయి. అందుకు మీరు గుర్తుంచుకోవల్సిన కొన్ని విషయాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి...

బ్యూటీ కోసం ఉపయోగించే బ్రష్ లను శుభ్రంగా ఉంచాలి:

బ్యూటీ కోసం ఉపయోగించే బ్రష్ లను శుభ్రంగా ఉంచాలి:

ముందుగా మీరు గుర్తుంచుకోవల్సిన విషయాల్లో ఇది ఒకటి, అయితే వీటి గురించి బాధపడాల్సిన అవసరం లేదు. మీరు మీ బ్యూటీ కోసం ఉపయోగించే బ్రష్ లను క్లీన్ గా ఉంచుకోకపోతే, అందులో బ్యాక్టీరియా చేరడానికి మీరు అనుమతిస్తున్నట్లే అవుతుంది. అందువల్ల మీరు ఉపయోగించే బ్యూటీ బ్రష్ లను ఒక వారానికి లేదా 15 రోజులకొకసారి తప్పనిసరిగా బ్రష్ చేయాలి.

ప్రతి రోజూ తలస్నానం చేయకూడదు:

ప్రతి రోజూ తలస్నానం చేయకూడదు:

ప్రతి రోజూ తలస్నానం చేయడం వల్ల మీ జుట్టు శుభ్రంగా మరియు మంచి కండిషన్ తో ఉంటుదని నమ్ముతారు. అయితే అది అక్షరాల తప్పే. రెగ్యులర్ గా జుట్టును శుభ్రం చేసుకోవడం వల్ల జుట్టులోని నేచురల్ ఆయిల్ తగ్గిపోతాయి, అందువల్ల మీరు సాధరణంగా కాంటే ఎక్కువ తలస్నానం చేస్తున్నారని గమనించాలి. వారంలో రెండు మూడు సార్లు మాత్రమే తలస్నానం చేయాలి.

ఎక్కువ కండీషనర్ అప్లై చేయడం హానికరం:

ఎక్కువ కండీషనర్ అప్లై చేయడం హానికరం:

చాలా మంది జుట్టుకు షాంపుతో తలస్నానం చేసిన తర్వాత, తల మరియు జుట్టుకు కండీషనర్ ను అప్లై చేస్తుంటారు. జుట్టు మొదలు ఆరోగ్యకరంగా పెరిగేవి కాబట్టి, వాటిమీ ఎక్కువ శ్రద్ద తీసుకోవాలి.

ముఖంకు తీసుకున్న జాగ్రత్తలే మెడ మీద కూడా తీసుకోవాలి:

ముఖంకు తీసుకున్న జాగ్రత్తలే మెడ మీద కూడా తీసుకోవాలి:

రోజూ మీరు తీసుకొనే రెగ్యులర్ స్కిన్ కేర్ కాకుండా, మీ చర్మాన్ని శుబ్రం చేసుకోవడం మరియు మాయిశ్చరైజర్ ను రాసుకోవడం?మెడ మీద గడ్డం క్రింద కూడా రాసుకోవడం మర్చిపోకండి. ఈ ప్రదేశం చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి, ముఖంతో పాటు మెడభాగాన్ని కూడా క్లీన్ గా ఉంచుకోవాలి.

 మేకప్ ను ఓపికగా వేసుకోవాలి:

మేకప్ ను ఓపికగా వేసుకోవాలి:

మేకప్ వేసుకోవడానికి ముందు చర్మం మీద మాయిశ్చరైజర్ ను అప్లై చేస్తే, అది పూర్తిగా తడి ఆరనివ్వాలి. కాబట్టి, ఫౌండేషన్ వేసుకోవడానికి 5 నిముషాల ముందే మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి. బ్యూటీ ప్రొడక్ట్స్ తో ఆత్రుత ప్రదర్శించకూడదు, ఓపికగా మేకప్ వేసుకోవడం వల్ల ఉత్తమ ఫలితాలను అంధిస్తుంది. మీరు ఆత్రుతగా మేకప్ వేసుకోవడం వల్ల మాయిశ్చరైజర్ క్రీమ్స్ మరింత ఎక్కువగా కనబడేలా చేస్తుంది. అలాగే మీరు త్వరగా వేసుకోవడం వల్ల స్టిక్కీగా కూడా కనబడుతుంది.

సులభ పద్దతులతో కరెట్ట్ చేసుకోవాలి:

సులభ పద్దతులతో కరెట్ట్ చేసుకోవాలి:

మొటిమల, మచ్చలు వచ్చిన వంటేనే ఏదో ఒక క్రీమ్ ను అప్లై చేస్తుంటారు. అలా ఎప్పటికీ చేయకూడదు. ఈ క్రిమ్స్ మీ చర్మం మీద ఎక్కువ సమయం నిల్వఉంటుంది కాబట్టి, క్రీమ్ ప్యాకెట్ మీద ఉన్న సలహాలు, సూచనలు తప్పకుండా తెలుసుకోవాలి. వాటి మీద తిక్ గా మర్దన చేయకూడదు

 హెయిర్ స్టైల్ చేయించుకోవడానికి ముందు ప్రొటెక్టర్ ను ఉపయోగించాలి:

హెయిర్ స్టైల్ చేయించుకోవడానికి ముందు ప్రొటెక్టర్ ను ఉపయోగించాలి:

హెయిర్ డ్రయ్యర్స్ మరియు హెయిర్ స్ట్రెయిటనర్స్ ను ఉపయోగించడానికి ముందు తగినంత రక్షణ కల్పించాలి. తలకు వేడి హెయిర్ డ్రయ్యర్ ఉపయోగించడం వల్ల జుట్టు పొడి, చిక్కుతో హార్డ్ గా మరియు నిర్జీవంగా కనబడుతుంది.

అద్దం చాలా దగ్గరగా ఉంచుకొని ఐబ్రోస్ ను ప్లక్క్ చేయడం:

అద్దం చాలా దగ్గరగా ఉంచుకొని ఐబ్రోస్ ను ప్లక్క్ చేయడం:

అద్దంకు దగ్గరగో ఐబ్రోస్ ప్లక్ చేయడం వల్ల, మీ ఐబ్రోషేప్ కంటే, మీరు రిమూవ్ చేయాల్సిన వెంట్రుకల మీద ఎక్కువ ఏకాగ్రత్త ఉంటుంది. దాంతో ఐబ్రోస్ మరింత పల్చగా కనబడుతాయి. అందువల్ల పెద్ద అద్దం ముందు నిలబడటం వల్ల ముఖంతో పాటు కనుబొమ్మలు పెద్దగా కనబడుట వల్ల సులభంగా మంచి ఆకారంతో ఐబ్రోప్లక్కింగ్ చేసుకోవచ్చు.

Desktop Bottom Promotion