For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చలికాలంలో పగిలిన పెదాలకు ఉపశమనం కలిగిద్దామిలా

|

అమ్మాయి అందంగా కనబడాలంటే శిరోజాల దగ్గర్నించి పాదాల వరకూ జాగ్రత్తగా సంరక్షించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అసలే చలికాలం...మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పెదువులు పొడిగా అయిపోవడం, పగలడం..వంటివి జరుగుతూ ఉంటాయి. అంతమాత్రాన బాధపడాల్సిన అవసరం ఏమి లేదు. ఎందుకంటే ఇంట్లో అభించే పదార్థాలతోనే తిరిగి వాటిని సాప్ట్ గా మార్చేయవచ్చు. మరి అవేంటో తెలుసుకుందామా...

చలికాలంలో పెదవులు పగలడానికి కేవలం చల్లగాలులే కారణం కాదు, విటమిన్ ఇ లోపం, శరీరంలోని తేమ శాతం తగ్గడం, పొగతాగడం, అలాగే పెదవులను తరచూ నాలుకతో తడి చేసుకుంటూ ఉండటం...ఇలా అనేక అంశాలు కూడా అందుకు దోహదం చేస్తాయి. అయితే ఈ సమస్యకు ఇంట్లో లభించే వస్తువులతోనే స్వస్తి చెప్పి, సాఫ్ట్ గా ఉండే అదరాలను సొంతం చేసుకోవచ్చు. మరి ఆ హోం రెమెడీస్ ఏంటో ఒక సారి చూద్దాం...

పంచదార

పంచదార

రెండు చెంచాలా పంచదార, చెంచా తేనె జత చేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదవులకు రాసుకుని కొన్ని నిమిషాలు అలానే ఉంచాలి. తర్వాత వేళ్ల చివర్లతో పెదవుల చుట్టూ మెల్లగా రుద్దాలి. ఇప్పుడు గోరువెచ్చిని నీళ్లతో శుభ్రం చేసుకుంటే సరి. ఇలా చేయడం వల్ల పై పొరల్లో ఉండే మృతకణాలు తొలగిపోతాయి. ఫలితంగా పెదవులు మృదుత్వాన్ని సంతరించుకుంటాయి.

కొబ్బరినూనెతో

కొబ్బరినూనెతో

కొబ్బరి నూనె సహజ మాయిశ్చరైజర్ లా పనిచేసి పగిలిన పెదాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకువస్తుంది. రోజంతా ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు పెదాలకు కొద్దిగా కొబ్బరినూనె రాసుకుంటూ ఉండాలి. ఈ విధంగా చేయడం వల్ల పెదవుల్లోని తేమ ఎక్కువ సమయం నిలిచి ఉండటానికి అవకాశం ఉంటుంది. కొబ్బరి నూనెకు బదులు ఆలివ్ ఆయిల్ ని కూడా ఉపయోగించుకోవచ్చు.

పాలక్రీమ్ తో

పాలక్రీమ్ తో

ఇందులో సహజంగా ఉండే కొవ్వు పదార్థాల శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, ఇది కూడా సహజసిద్ధ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. పెదవులకు ఈ క్రీమ్ ని రాసుకుని 10నిముషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లలో ముంచిన దూదితో శుభ్రంగా తుడుచుకోవాలి. ఇలా రోజూ చేయడం వల్ల పెదవులు మృదువుగా మారుతాయి.

గులాబీ రేకలతో

గులాబీ రేకలతో

పగిలిన పెదవులను సాధారణ స్థితికి తీసుకురావడానికి పెరట్లో ఉండే గులాబీ రేకులు కూడా ఉపయోగపడుతాయి. కొన్ని గులాబీ రేకులు తీసుకుని నీళ్లతో బాగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత వాటిని కొన్ని గంటల పాటు పాలలో నానబెట్టాలి. ఇప్పుడు వాటిని మెత్తని ముద్దలా చేసుకుని రోజుకు 2 లేదా 3 సార్లు రాసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పెదవుల పగుళ్ళు తగ్గి సాధారణ స్థితికి రావడమే కాదు. మంచి రంగును కూడా సంతరించుకుంటాయి.

తేనె

తేనె

తేనెలో ఉండే యాటీబ్యాక్టీరియల్, గాయన్ని మాన్పించే గుణాల వల్ల పగిలిన పెదవులకు ఇది కూడా ఇక చక్కని పరిష్కారంగా ఉపయోగపడుతుంది. పెదవులు పొడిగా అనిపించిన ప్రతిసారి తేనెను తరచూ రాసుకుంటూ ఉండాలి. అలాగే తేనెకు కొద్దిగా గ్లిజరిన్ జతచేసి ఈ మిశ్రంను రోజూ పడుకునే ముందు పెదాలకు రాసుకోవాలి. ఫలితంగా కొద్ది రోజుల్లోనే లేలేత అధరాలు మన సొంతమవుతాయి.

ఆముదం

ఆముదం

ఆముదం, గ్లిజరిన్ ఒక్కో చెంచా చొప్పున తీసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేయాలి. ఈ మిశ్రామాన్ని రోజూ పడుకునే ముందు పెదవులకు రాసుకోవాలి. పొద్దున్న లేవగానే గోరువెచ్చని నీళ్లలో ముంచిన దూదితో పెదాలను శుభ్రం చేసుకోవాలి. పెదవుల పగుళ్లు తగ్గేవరకూ ఈ విధంగా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

పెట్రోలియం జెల్లీ

పెట్రోలియం జెల్లీ

కొద్దిగా తేనె తీసుకుని దానికి పెట్రోలియం జెల్లీ జతచేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం పెదాలకు రాసుకుని 10 నుంచి 15 నిముషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చిని నీళ్లలో ముంచిన దూదితో పెదాలను శుభ్రం చేసుకోవాలి.

కీరదోస

కీరదోస

కీరదోసకాయను ముక్కలుగా కోసుకొని వాటితో 10 నుండి 15నిముషాల పెదాలపై రుద్దాలి. ఇలా చేయడం వల్ల పెదవుల పగుళ్ళు తగ్గుముఖం పడుతాయి.

మరికొన్ని జాగ్రత్తలు

మరికొన్ని జాగ్రత్తలు

ఇవే కాకుండా కలబంద, నెయ్యి వంటివి కూడా పెదాలకు రాసుకోవచ్చు. అలాగే వీటిని పాటిస్తూనే వీలైనంత ఎక్కువ మొత్తంలో శరీరానికి నీటిని అందించాలి. అలాగే చలికాలంలో అధరాల సంరక్షణకు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి...

* చలిగాలుల వల్ల పెదవులపై ఏర్పడే పొరలను లాగకూడదు.

* అలాగే పెదాలను తరచూ తడుపుతూ ఉండటం లేదా కొరుకుతూ ఉండటం వంటి పనులు కూడా అస్సలు చేయకూడదు.

*పెదవుల పై ఏర్పడే డెడ్ స్కిన్ సెల్స్ ను ఎప్పటికప్పుడు బ్రష్ తో తొలగించుకుంటూ ఉండాలి.

English summary

Home Remedies for Chapped lips

Chapped or dry lips are a common problem that can be painful and unattractive. Common symptoms are dryness, redness, cracking, flaking, and tender or sore lips.
Desktop Bottom Promotion