For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాదాల దుర్వాసనను నివారించే ఉత్తమ చిట్కాలు

|

సాధారణంగా కొంతం మంది క్రమం తప్పకుండా పాదాలను శుభ్రం చేసుకుంటున్నప్పటికీ కొంత మందికి పాదాల నుంచి దుర్వాసన వస్తూనే ఉంటుంది. కొంతమంది శరీరల మీద కొన్ని రకాల బ్యాక్టీరియా జాతులు ఎక్కువుగా పెరుగుతూంటాయి. ముఖ్యంగా ఇవి పాదాలను ఆశ్రయించుకొని వృద్ధి చెందుతూంటాయి. ఇలాంటి వాళ్ళల్లో పాదాలు వాసన వస్తూంటాయి. ఒకవేళ మీకు చెమట ఎక్కువ స్థాయిలో పట్టే తత్వం ఉంటే ఈ పాదాల దుర్వాసన అనే సమస్య మరింత ఎక్కువ స్థాయిలో ఇబ్బంది పెడుతుంది. పాదాల్నుంచి ఒకరకమైన చేపల వాసన వస్తూంటుంది. చర్మంలోపల ఉండే బ్యాక్టీరియా చెమట ద్వారా మరింత వ్యాప్తి చెంది చెడు వాసనకు దారితీస్తుంది.

నోటి దుర్వాసనను దూరం చేసే సులభ చిట్కాలు:క్లిక్ చేయండి

ఒకవేళ మీ పాదాలు ఇలా అన్ని వేళలా చేమటోడుతూంటే సాధ్యమైనంత వరకు పాదాలను పొడిగా ఉంచుకోండి. బూట్ల వాడకాన్ని తగ్గించాలి. ముఖ్యంగా బూట్లూ, సాక్సులు ఎక్కువగా ఉపయోగించే వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. మీరు వేసుకునే సాక్సులని ప్రతిరోజూ ఉతికి ఆరేసుకుంటుండాలి. పాదాల నుండి తక్షణం వాసన నివారించాలంటే టాల్కం పౌడర్ ను పాదాల మీద చిలకరించుకోవాలి. టాల్కం పౌడర్ బ్యాక్టీరియాను నివారించడానికి మరియు దుర్వాసను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇంకా యాంటీపర్సిపరెంట్ ను కూడా ఉపయోగించి మీ పాదాలను పొడిగా ఉంచుకోవడం వల్ల దుర్వాసన తగ్గించుకోవచ్చు. ఇన్ని చేసినప్పటికీ మీ పాదాల నుంచి ఆమోదయోగ్యంకాని స్థాయిలో వాసన వస్తూంటే చెమటని తగ్గిస్తూ పాదాలను సువాసనిచ్చే ఔషధాలు కొన్ని ఉన్నాయి...

నోటి దుర్వాసనకు గల ఆశ్చర్యకరమైన కారణాలు..:క్లిక్ చేయండి

బేకింగ్ సోడ

బేకింగ్ సోడ

సోడియం బైకార్బొనేట్-మనం సాధారణంగా బేకింగ్ సోడా అని పిలుస్తాం. ఇది పాదాల్లో బ్యాక్టీరియాని నివారించడానికి ఒక ఎఫెక్టివ్ మార్గం. చెమట యొక్క పిహెచ్ స్థాయిని న్యూట్రిలైజ్ చేస్తుంది మరియు బ్యాక్టీరియాను నివారిస్తుంది

* షూ మరియు సాక్సులు వేసుకోవడానికి ముందు బేకింగ్ సోడాను షూ మరియు సాక్సుల్లో కొద్దిగా చిలకరించి వేసుకోవాలి.

* అలాగే మీ సాక్సులను ఉతికే ముందు బేకింగ్ సోడాలో కొద్దిసమయం నానబెట్టి తర్వాత శుభ్రం చేసుకోవాలి.

ల్యావెండర్ ఆయిల్

ల్యావెండర్ ఆయిల్

ల్యావెండర్ ఆయిల్ వాసన మంచిగా ఉండటం మాత్రమే కాదు, ఇది బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది . మరియు ఇది యాంటీ ఫంగల్ ఆయిల్ . మరియు ఇది మరింత ఎఫెక్టివ్ గా పాదాలను వాసను తొలగించడానికి సహాయపడుతుంది. ఒక బౌల్లో కొద్దిగా లావెండర్ ఆయిల్ వేసి, మీ పాదాలను కొద్దిసేపు అందులో నానబెట్టి శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతి రోజూ రెగ్యులర్ గా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఆలమ్

ఆలమ్

ఆలమ్ పౌడర్ ఒక ఆస్ట్రిజెంట్ మరియు యాంటీ సెప్టిక్ లక్షణాలున్నది. అందువల్ల, ఇది బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది.

*ఒక కప్పు వేడి నీటిలో ఒక చెంచా ఆలమ్ పౌడర్ మిక్స్ చేసి, మీ పాదాలను శుభ్రం చేసుకోవాలి. 10-15నిముషాల తర్వాత తడి ఆరిన తర్వాత పాదాల మీద తిరిగా ఆలమ్ పౌడర్ ను చిలకరించుకోండి. ఇలా రోజుకొకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఎప్సమ్ సాల్ట్:

ఎప్సమ్ సాల్ట్:

పాదాల నుండి వచ్చే దుర్వాసను నివారించడంలో ఎప్సమ్ సాల్ట్ అద్భుతంగా సహాయపడుతుంది.

*అరబకెట్ వేడి నీళ్ళలో రెండు చెంచాలా ఎప్సమ్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి, అందులో మీ పాదాలను 10-15నిముషాలు నానబెట్టుకోవాలి. మంచి ఫలితం కోసం మీరు నిద్రించే ముందు ఇలా చేస్తే ఫలితం మరింత బెటర్ గా ఉంటుంది.

బ్లాక్ టీ

బ్లాక్ టీ

పాదాల దుర్వాసనకు కారణం అయ్యే బ్యాక్టీరియాను నివారించుకోవడానికి బ్లాక్ టీ ఒక టానిక్ వంటిది. పాదాల చర్మ రంద్రాలను బ్లాక్ చేయడానికి కూడా ఇది సహాయపడుతుంది. అందువల్ల బ్యాక్టీరియా పెరగకుండా సహాయపడుతుంది.

* ఒక కప్పు హాట్ వాటర్ లో రెండు టీ బ్యాగ్స్ వేసి బాగా మరిగించాలి. తర్వాత ఈ నీటిలో అరబకెట్ నార్మల్ వాటర్ తో మిక్స్ చేసి గోరువెచ్చని ఈ నీటిలో మీ పాదాలను 15-20నిముషాలు నానబెట్టుకొని తర్వాత శుభ్రం చేసుకోవాలి.

వెనిగర్

వెనిగర్

పాదాల దుర్వాసన నివారించడం కోసం యాపిల్ సైడర్ వెనిగర్ తప్ప మిగిలే ఏ హోం రెమెడీ అయినా సరే ఉపయోగించవచ్చు.

* హాట్ వాటర్ లో వెనిగర్ వేసి బాగా మిక్స్ చేసి అందులో మీ పాదాలను డిప్ చేసి 5-10నిముషాలుంచి తర్వాత సోప్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి.

బోరాక్స్

బోరాక్స్

బోరాక్స్ ఒక డిస్ ఇన్ఫెక్టెట్ ఇది దుర్వాసనకు కారణం అయ్యే బ్యాక్టీరియాను నివారిస్తుంది . బోరాక్స్ ను మీ షూలోపలో స్ర్పే చేయవచ్చు. అలాగే మీరు మీరు షూ వేసుకొనే ముందు షూలోపలో ఎటువంటి పౌడర్(బోరాక్స్) లేకుండా జాగ్రత్త వహియంచండి.

షుగర్ మరియు ఐసోప్రొపిల్ ఆల్కహాల్

షుగర్ మరియు ఐసోప్రొపిల్ ఆల్కహాల్

చెమట మరియు బ్యాక్టీరియా వల్ల దుర్వాసన వచ్చే పాదాలు, ప్రతి రోజూ స్ర్కబ్బింగ్ చేసి క్లీన్ చేసుకోవాలి. బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా నివారించడానికి స్ర్కబ్బింగా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

* పంచదారను నీటిలో మిక్స్ చేసి మరియు ఐసోప్రొపిల్ ఆల్కహాల్ ను మిక్స్ చేసయాలి. చిక్కటి మిశ్రమంగా చేసతి మీ పాదాల మీద వేసి బాగా రుద్దాలి. 10నిముషాల తర్వాత మంచి నీళ్ళుతో శుభ్రం చేసుకోవాలి.

సేజ్

సేజ్

పాదాలలో చెమట వల్ల ఏర్పడే బ్యాక్టీరియాను నివారించడంలో సేజ్ ఒక ఎఫెక్టివ్ టానిక్ వంటిది.

*పొడి చేసిన సాసేజ్ ను షూ మరియు సాక్సుల్లో సాజ్ పొడిని చిలకరించడం వల్ల ఒక మంచి సువాసను కలిగి ఉంటుంది.

*సాసేజ్ టీలో మీ పాదాలను కొంత సేపు నానబెట్టి, శుభ్రం చేసుకోవాలి. అలాగే ప్రతి రోజూ నిద్రించే ముందు సాసేజ్ టీని కూడా త్రాగవచ్చు.

అల్లం వేరు

అల్లం వేరు

పాదాల దుర్వాసన నివారించడానికి అల్లం కూడా ఒక ఎఫెక్టివ్ రెమడీ...

*తాజాగా ఉండే మీడియం సైజ్ అల్లం వేరును మెత్తగా పేస్ట్ చేసి, ఒక కప్పు హాట్ వాటర్ లో వేసి బాగా మరిగించి, ఒక గిన్నెలోకి వడగట్టుకొని, ఆనీటితో పాదాలకు మసాజ్ చేసుకోవాలి. ఈ వాటర్ తో ప్రతి రోజూ రాత్రి నింద్రించే ముందు చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

మంచి ఫలితాలకోసం వారంలో రెండు సార్లు ఇలా ప్రయత్నించి చూడండి.

English summary

Home Remedies for Foot Odor

Foot odor or smelly feet, technically known as bromhidrosis, can be really embarrassing for those suffering from this problem. This usually occurs when your feet sweat and it does not evaporate because you are wearing shoes or socks.
Desktop Bottom Promotion