For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవిలో చెమట-వివిధ చర్మ సమస్యలకు: పరిష్కార మార్గం

|

ప్రిక్లీ హీట్ ఇది వేసవిలో వచ్చే ఒక సాధారణ ఆరోగ్య సమస్య. ఈ సమస్యలను చాలా వరకూ వేసవిలో ఎక్కువ మంది ఈ సమస్యను ఎదుర్కొంటారు. ఈ సమస్య వల్ల చర్మం దురద వల్ల చికాకు మరియు నొప్పి కలిగిస్తుంది. ముఖ్యంగా ఇది అధిక చెమటకు గురైనప్పుడు, ఇటువంటి సమస్యలు ఎదురవుతాయి. శరీరంలో కొన్ని ప్రదేశాల్లో హీట్ కు గురై, దురదకు దారి తీస్తుంది. ఎండాకాలంలో చాలా మందికి చర్మం తీవ్రమైన నొప్పి లేదా గాయాల కారణంగా దురదలు, చిన్నచిన్నగా ఎర్రమచ్చలు వంటివి వస్తుంటాయి. శరీరంలో ఎక్కడైన రావటానికి వీలుంది. కానీ సాధారణంగా నుదుటిపై, ముఖం, మెడ, వీపు, ఛాతీ, తొడల మీద ఏర్పడుతుంది. చర్మం ఎర్రపొక్కులతో నిండి, గోకుడుతో ప్రకోపించి కందిపోయి రక్తం కారడం జరుగుతుంది.

ప్రిక్లీ హీట్‌లో రకాలు: చర్మంపై కనిపించే అసాధారణ వ్యత్యాసాలపై ఆధార పడి, ప్రిక్లీ హీట్‌ని మూడు రకాలుగా విభజించవచ్చు. చర్మం ఎర్రపొక్కులతోనిండి, గోకుడుతో ప్రకోపించి కందిపోయి స్ఫటికాకారంలో ఉండడం. దీని అవరోధ గుల్లగా ఉన్న ఎగువ భాగంలో ఎక్కువగా సంభవిస్తాయి.

ప్రిక్లీ హీట్ లక్షణాలు: స్వేదగ్రంధి నాళంలో ఏదైనా అడ్డుపడి ఉంటే, చమట ఆగిపోయి చికాకు, దురద, మంటలకు కారణమౌతుంది. ప్రిక్లీ హీట్ సాధారణంగా చర్మంపై చాలా చిన్న ఎరుపు రంగు బొప్పిలు కట్టి బొబ్బలు లాగా కనిపిస్తాయి. ఇది నీటిబిందువు రూపంలో స్పష్టమైన ద్రవాన్ని కలిగి 1-2 మిల్లీమీటర్ల చిన్న బుడగ పరిమాణంలో ఉంటుంది, కానీ చర్మం ఎర్రగా కనపడదు.

ఇవి పెద్దవాళ్ల కంటే పిల్లలకే ఎక్కువగా వస్తాయి. పుట్టిన బిడ్డ నుంచి సంవత్సరంలోపు వయసున్న పిల్లలలో అప్పుడే ఈ చెమటకాయల సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే చిన్న పిల్లలో ఈ స్వేదనాళం పూర్తిస్థాయిలో పనిచేయదు. అంటే అప్పటికి పూర్తిగా అభివృద్ధిచెందదు. అందువల్ల చెమట పట్టినప్పుడు, ఈ నాళిక త్వరగా పగిలినట్టు అయి, చెమట కాయలు వస్తాయి. ఇవి క్రింది కారణాల వల్ల వస్తాయి.

ప్రిక్లీ హీట్ కి కారణాలు : ప్రిక్లీ హీట్ కి ప్రధాన కారణం స్వేద గ్రంధులు రంధ్రాలను మూసివేయడం. వేసవిలో చర్మం చెమటపడుతుంది, ఎందుకంటే చర్మంపై చెమట ఉండిపోయి నిరోధించడం వల్ల చిన్న ఎర్రటి బుడిపెలు కనిపిస్తాయి. ఎక్కువ వేడి, చెమట పట్టడం వల్ల మాత్రమె కాకుండా, ప్రిక్లీ హీట్ కి అధిక శ్రమ, ఆల్కహాల్ తీసుకోవడం, పొగతాగడం, ఆరోగ్యంలేని, ఒత్తిడితో కూడిన జీవన విధానం, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, అకాల ఆహార అలవాట్లు, ఎసిడిటీ, విషాహారం, కొన్ని మందుల వల్ల దుష్ప్రభావాల వ౦టి అనేక ఇతర కారణాలు ఉన్నాయి. మీరు ఇంట్లో నివారణలతో ప్రిక్లీ హీట్ ని ఎలా తొలగించుకోవాలో ఇక్కడ కొన్ని చిట్కాలు ఇవ్వబడ్డాయి.

ఓట్ మీల్:

ఓట్ మీల్:

ఓట్ మీల్ ప్రిక్లీ హీట్ కి అద్భుతమైన ఇంటి చికిత్స. ఒక స్నానాల తొట్టెలో కొంచెం ఓట్ మీల్ వేసి బాగా కలపండి. 15 నిముషాలు ఆ తొట్టెలో ఉంటే అది మీ మనసుకి తేలికని, చర్మానికి స్వాంతనని కలిగిస్తుంది. ఇలా రోజుకు రెండుసార్లు చేయండి.

టాల్కం పౌడర్:

టాల్కం పౌడర్:

ఖచ్చితంగా ఇది ఒక సాధారణ హోం రెమడీ. ప్రిక్లీ హీట్ ను తొలగించడంలో ఇది అద్భుతంగా సహాయపడుతుంది. స్నానం చేసిన వెంటనే టాల్కం పౌడర్ ను చంకల్లో, మొడమీద, గొంతు క్రింద అప్లై చేసుకోవాలి. అలాగే సువాసన లేని టాల్కం పౌడర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.

అలోవెరా జెల్:

అలోవెరా జెల్:

ప్రిక్లీ హీట్ ను నివారించడానికి, అలోవెరా జెల్ ను ఉపయోగించడం కంటే ఉత్తమమైన ఎంపిక మరోకటి ఉండదు. ఎందుకంటే, అలోవెరా జెల్లో యాంటీఇన్ల్ఫమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి.

కోల్డ్ కంప్రెస్:

కోల్డ్ కంప్రెస్:

మన శరీరంను ఎంత చల్లగా ఉంచుకుంటే అంత వేడిని తగ్గించుకోవచ్చు. కోల్డ్ కంప్రెసర్ ప్రిక్లీ హీట్ ను నివారించడంలో ఒక ఎఫెక్టివ్ హోం రెమడీ .

కార్న్ స్టార్చ్:

కార్న్ స్టార్చ్:

ప్రిక్లీ హీట్ ను నివారించుకోవడానికి కార్న్ స్టార్చ్ ఒక అద్భుతమైనటువంటి హోం రెమెడీ. ప్రిక్లీ హీట్ ను నివారించుకోవడంలో ఇది అద్భుతంగా సహాయపడుతుంది. కొద్దిగా నీటిలో మిక్స్ చేసి పేస్ట్ లా చేసుకొని, ఈ పేస్ట్ ను చర్మానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే, శరీరం చల్లగా ఉంటుంది.

మార్గొస లీవ్స్:

మార్గొస లీవ్స్:

ప్రిక్లీ హీట్ ను తగ్గించుకోవడానికి మార్గొస ఒక ఎఫెక్టివ్ నేచురల్ పద్దతి. మర్గొస ఆకులను నీటిలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చర్మ దురద, చెమటకాయలు ఉన్నప్రదేశంలో అప్లై చేసి కొద్ది సమయం అలాగే వదిలేసి, తర్వాత స్నానం చేసుకోవాలి.

వ్యక్తిగత ఎంపిక :

వ్యక్తిగత ఎంపిక :

ప్రిక్లీ హీట్ కు మీ లైఫ్ స్టైల్ కూడా ఒక కారణం అనిచెప్పవచ్చు. టైట్ గా ఉన్న దుస్తులను ధరించకూడదు. కాటన్ కు బదులుగా సింథటిక్ డ్రెస్సులను ఉపయోగించాలి. తక్షణ ఉపశనమం పొందడానికి వ్యక్తిగత పరిశుభ్రత అనుసరించాలి. చర్మం చెమట, చెమటకాయలకు గురైనప్పుడు, గోకకూడదు. అలా చేస్తే చర్మం ఇన్ఫెక్షన్ కు గురి అవుతుంది.

హైడ్రేషన్:

హైడ్రేషన్:

వేసవి కాలంలో శరీరంను సాద్యమైనంత వరకూ హైడ్రేషన్ లో ఉంచుకోవాలి. ముఖ్యంగా ప్రిక్లీ హీట్ ఉన్నప్పుడు. వేసవిలో తగినంత నీరు త్రాగాలి. ఇంట్లో పిల్లలు కూడా ఈ సమస్యకు గురైనప్పుడు, అధనపు జాగ్రత్తలు తీసుకొని, వారు ఎక్కువ నీరు త్రాగేలా చూసుకోవాలి.

English summary

Home Remedies For Prickly Heat

Prickly heat is a common problem that most of the people face during summer. It is both irritating and painful. This occurs mainly when the excess sweat that accumulates in your body parts causes redness and itching. The presentation of prickly heat will be as small red bumps on the skin surface.
Story first published: Wednesday, April 2, 2014, 17:47 [IST]
Desktop Bottom Promotion