For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కంటి దురదను నివారించే ఉత్తమ హోం రెమెడీస్

By Mallikarjuna
|

ఎలర్జీల వల్ల గాని, ఇతర కారణాల వల్ల గానీ కొంతమందికి కళ్లలో దురదగా, అసౌకర్యంగా అనిపిస్తూ ఉంటుంది. దురదతోపాటు వాపు, నొప్పి కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కంటి అలర్జీ విపరీతంగా బాధిస్తుంటుంది. ఆ దురద తాళలేక చాలామంది తరుచూ కళ్లు నలుపుకుంటారు. అదే అసలు పొరపాటు.. నలపడం ఎక్కువైతే కెరటోకోనస్ వస్తుంది. అది కంటిచూపుకే ప్రమాదం.

కాలుష్యం, దుమ్ము, ధూళి వల్ల కళ్ళకు ఇన్ఫెక్షన్ వస్తే అది దురద, అలర్జీ, కారణం ఏదైనా కావచ్చు. తరుచుగా, విపరీతంగా కళ్లు నులిమితే చాలా సమస్యలు మొదలవుతాయి. కంటి మీద విపరీతంగా రుద్దడం వల్ల కనుగుడ్డు మీద ఉండే కార్నియా పొర పల్చబడుతంది. అంతేకాదు ఆ పొర అక్కడి నుంచి ముందుకు తోసుకొస్తుంది. ఈ పరిణామమే కెరటోకోనస్. కంటి వైద్యులు తరుచుగా వైద్యం చేసే సమస్య ఇదే. అందుకే కెరటోకోనస్ మొదలైందనే అనుమానం కలిగిన వెంటనే చికిత్స తీసుకోవడం చాలా అవసరం.

అయితే ఒకసారి ఈ సమస్య తలెత్తితే దాన్ని భరించాల్సిందే తప్ప, పూర్తిగా తగ్గించడం చాలా కష్టమైన పని. అందుకే ఈ కెరటోకోనస్ అవగాహన పెంచుకోవటం అవసరం. ముఖ్యంగా తరుచూ కంటి అలర్జీతో బాధపడేవారు ఈ విషయంలో తక్షణ ఉపశమనం కలిగించేందుకు కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి. మన వంటగదిల లభించే ఈ పదార్థాలతో కళ్ళ దురద నుండి ఉపశమనం పొందండి.

కళ్ళకు చల్లగా ఏదైనా పెట్టండి :

కళ్ళకు చల్లగా ఏదైనా పెట్టండి :

కళ్ళకు చల్లగా ఏదైనా పెట్టడం ద్వారా కళ్ళకు తక్షణ ఉపశమనం పొందవచ్చు. పత్తిని ఐస్ కోల్డ్ వాటర్ ల డిప్ చేసి దాన్ని కళ్ళ మీద మరియు కళ్ళ చుట్టు పెట్టుకోవాలి. ఇంగా చల్లని టీ బ్యాగ్స్, ఐస్ ముక్కలను పెట్టుకోవడం వల్ల తక్షణ ఉపశమనం కలుగుతుంది.

చమోమెలి టీ బ్యాగ్స్ :

చమోమెలి టీ బ్యాగ్స్ :

మొదటి దానికి ప్రత్యామ్నాయంగా చమోమెలి టీ బ్యాగ్స్ తీసుకొచ్చి ఫ్రిజ్ ల పెట్టి, అరగంట తర్వాత వాటిని బయటకు తీసి, కళ్ళ మీద పెట్టుకోవాలి. వాటని 5 నుండి 10 నిముషాల వరకూ పెట్టుకోవాలి. ఇలా రోజుకు మూడు నాలుగు సార్లు రిపీట్ చేయాలి.

కీరదోస కాయ:

కీరదోస కాయ:

కీరదోస నేచురల్ కూలింగ్ ఏజెంట్, ఇందులోని యాంటీఇరిటేషన్ లక్షణాలు, ఇన్ఫెక్షన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. అదే లక్షణాలు, కళ్ళ ఉబ్బును., కళ్ళు ఎరుపుదనాన్ని , మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. కీరదోసకాయను తీసుకొచ్చి బాగా శుభ్రంగా కడిగి, చక్రాల్లా కట్ చేసి ఫ్రిజ్ లో 10 నుండి 15నిముషాలు పెట్టి, తర్వాత బయటకు తీసి కళ్ళ మీద పెట్టుకోవాలి. ఇలా రోజుల 5సార్లు చేయండి. మంచి ఫలితం ఉంటుంది.

రోజ్ వాటర్ :

రోజ్ వాటర్ :

రోజ్ వాటర్ మీ అందాన్ని మెరుగుపరుస్తుంది, కానీ ఇంకా మీ కంటి దురదను కూడా నివారిస్తుంది. కేవలం కొద్దిగా రోజ్ వాటర్ తీసుకొని, వాటితో మీకళ్ళను శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజులో రెండు మూడు సార్లు చేయడం వల్ల తక్షణ ఉపశమనం పొందవచ్చు.

చల్లని పాలు:

చల్లని పాలు:

చల్లని పాలను ఉపయోగించి మీకళ్ళ చికిత్స చేసుకోవచ్చు. పత్తి ఉండలను చల్లని పాలలో డిప్ చేసి , ఇన్ఫెక్షన్ గురియైన ప్రదేశంల రుద్దాలి. తర్వతా అదే కాటన్ బాల్స్ ను కళ్ళ మీద కొంత సమయం పెట్టుకోవాలి. ఇలా రోజుకు రెండు మూడు సార్లు చేయాలి .

వెజిటేబుల్ జ్యూస్:

వెజిటేబుల్ జ్యూస్:

మరో సులభమైనటువంటి హోం రెమెడీ. పచ్చివెజిటేబుల్ జ్యూస్ , ముఖ్యంగా క్యారెట్ మరియు ఆకుకూరల జ్యూస్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. రెండు క్యారెట్లను గ్రైండ్ చేసి, ఈ జ్యూస్ ను రెండు లేదా మూడు సార్లు త్రాగడం వల్ల తక్షణ ఉపశమనం ఉంటుంది.

పచ్చి బంగాళదుంప:

పచ్చి బంగాళదుంప:

కళ్ళ దురదను పచ్చిబంగాళదుంపతో నివారించుకోవచ్చు. కీరదోసకాయలాగే , బంగాళదుంపను కూడ్ కట్ చేసి ఫ్రిజ్ లో పెట్టి, తర్వాత కళ్ళ మీద పెట్టుకొంటే, తక్షణ ఉపశమనం, విశ్రాంతి పొందవచ్చు.

కలబంద:

కలబంద:

కలబంద మరో సింపుల్ హో రెమెడీ . ఇది కళ్ళను ఇన్పెక్షన్ నివారించడంలో అద్భుంగా పనిచేస్తుంది. అలోవెరా జ్యూస్ లో కొద్దిగా తేనె మిక్స్ చేసి తర్వాత కళ్ళను శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజులో రెండు సార్లు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

Desktop Bottom Promotion