For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కళ్ళ క్రింది క్యారీ బ్యాగులా: క్లియర్ టిప్స్

|

కళ్ళ క్రింది డార్క్ సర్కిల్స్ (నల్లటి వలయాలు ఏర్పడటం) చాలా సాధారణ సమస్య. కానీ, కళ్ళక్రింద బ్యాగ్(ఉబ్బుగా) కనబడుతుంటే మాత్రం అది మీ వయస్సును మరింత తెలిపేదిగా సూచిస్తుంది. మరియు ఆ పరిస్థితిలో చర్మ ఎలాసిటి తగ్గడం మొదలవుతుంది . అయితే, అవి హానికరం కానప్పటీకి, చూడటానికి ఆకర్షణీయంగా ఉండదు మరియు మనలో ఆత్మవిశ్వాసాన్ని తగ్గించేస్తుంది

కళ్ళక్రింది క్యారీ బ్యాగుల్లాంటి ఉబ్బులు ఉండటానికి ప్రధాణ కారణం నిద్రలేమి మరియు వాటర్ రిటన్షన్ (శరీరంలో నీరు కోల్పోవడం). వీటితో పాటు, ఆహారపు అలవాట్లలో సరిగా లేకుండుటా, వ్యాయామ లోపం, ధూమపానం, అధికంగా ఏడవడం, అలర్జీలు, హార్మోనుల అసమతుల్యత మొదలగునివి. ఇవన్నీ సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి.

మంచి కంటి చూపు కోసం 20 పవర్ ఫుల్ చిట్కాలు:క్లిక్ చేయండి

ఐ బ్యాగ్స్ ఒక్కో సందర్భంలో వారసత్వంగా కూడా ఏర్పడవచ్చు. అదే సమయంలో, కొంత మందికి నిద్రలేచినప్పుడు కళ్ళక్రింది కళ్ళు ఉబ్బెత్తుగా ఉంటాయి. అదే మధ్యాహ్నానికి సద్దుమణుగుతాయి . ఇది మన శరీరంలో నీటి శాతం తక్కువగా ఉందనడానికి ఒక స్పష్టమైన సూచన.

కళ్ళ క్రింది క్యారీ బ్యాగ్స్ కు కారణాలే ఏవైనప్పటికి ఈ పరిస్థితి తీవ్రమైన మరియు నిరంతరం కళ్ళక్రింది ఉబ్బుగా ఉన్నట్లైతే, అది థైరాయిడ్, మూత్రపిండాల రుగ్మత, మరియు సైనస్ వంటి అంతర్లీన వైత్యస్థితికి దారితీయవచ్చు. కాబట్టి, కళ్ళ క్రింది క్యారీబ్యాగ్స్ ను నివారించడానికి ఈ క్రింది కొన్ని చిట్కాలు ఉన్నాయి.

అందమైన ‘కళ్ళు'.. సౌందర్యం వీటితో సొంతం:క్లిక్ చేయండి

కీర దోస:

కీర దోస:

కీరదోసకాయలను గుండ్రంగా స్లైస్ గా కట్ చేసి కళ్ళ మీద పెట్టుకొని విశ్రాంతి తీసుకోవాలి. ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అవసరం అయితే, మళ్ళీ ఒకసారి చేయండి . ఇలా చేయడం వల్ల కళ్ళ క్రింది వలయాలను మరియు కళ్ళ ఉబ్బును తగ్గిస్తుంది అలాగే వాపును కూడా తగ్గిస్తుంది.

టీ బ్యాగ్స్ :

టీ బ్యాగ్స్ :

అలసిన కళ్ళ మీద మీరు ఉపయోగించిన టీ బ్యాగ్స్ ను పెట్టుకోవాలి. టీబ్యాగ్ కళ్ళ మీద పెట్టి, పది, పదిహేను నిముషాలు విశ్రాంతి తీసుకోవాలి. టీబ్యాగ్స్ లోని యాంటీ ఆక్సిడెంట్స్ ప్రీమెచ్యుర్ ఏజింగ్ ను నివారిస్తుంది. టీబ్యాగ్ పెట్టుకోవడానికి ముందు వాటిని ఐస్ వాటర్ లో డిప్ చేయాలి.

మసాజ్:

మసాజ్:

మీ కళ్ళను నిధానంగ ామసాజ్ చేయాలి ఇలా చేయడంవల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే మీ మద్యవేలుతో కళ్ళ మీద కను రెప్పమీద క్రిందిభాగం కొంత సేపు నొక్కి పట్టుకోవాలి. కొంత సమయం తర్వాత వేళు తీయాలి. ఇలా రెండు మూడు సార్లు సాధన చేయాలి.

రోజ్ వాటర్:

రోజ్ వాటర్:

కాటన్ బాల్స్ ను చల్లగా ఉండే రోజ్ వాటర్ లో డిప్ చేసి కళ్ళ మీద పెట్టుకొని 10నిముషాలు విశ్రాంతి తీసుకోవాలి. ఇది కళ్ళకు చాలా ఎఫెక్టివ్ గా పనిచేసి, కళ్ళ క్రింది క్యారీబ్యాగ్స్ ను తొలగిస్తుంది.

స్పూన్ ట్రిక్:

స్పూన్ ట్రిక్:

మెటల్ స్పూన్స్ రిఫ్రిజరేటర్ ఫ్రీజర్ లో 20నిముషాలు పెట్టాలి. తర్వాత.20నిముషాల తర్వాత వాటిని బయటకు తీసు కళ్ళు ఉబ్బిని ప్రదేశంలో వాటని నిధానంగా మర్ధన చేసినట్లు రుద్దాలి.

కాస్మొటిక్స్ :

కాస్మొటిక్స్ :

ఈ సమస్య నివారణకు అనే కాస్మొటిక్ టీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. తక్షణ మార్పులకోసం ప్లాస్టిక్ సర్జరీ వంటివి కళ్ళ క్రింది ఉబ్బును తగ్గించడానికి సహాయపడుతాయి.

క్రాన్ బెర్రీ జ్యూస్ :

క్రాన్ బెర్రీ జ్యూస్ :

తియ్యగా లేని క్రాన్ బెర్రీ జ్యూస్ ను నీటితో మిక్స్ చేసి, దీన్ని ప్రతి రోజూ త్రాగితే మంచి ఫలితం ఉంటుంది. కళ్ళు ఉబ్బుతో బాధపడేటప్పుడు, ఈ క్రాన్ బెర్రీ జ్యూస్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అలాగే ఈ నీటితో కళ్ళను కూడా శుభ్రం చేసుకోవచ్చు.

అర చెంచా ఎగ్ వైట్ తీసుకొనే మీ కళ్ళ చుట్టు సున్నితంగా

అర చెంచా ఎగ్ వైట్ తీసుకొనే మీ కళ్ళ చుట్టు సున్నితంగా

గుడ్డు తెల్ల సొన: మసాజ్ చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇది కళ్ళ చుట్టు ఇన్ఫ్లమేషన్ తగ్గించి , రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

బాదం నూనె:

బాదం నూనె:

మీ కళ్ళ చుట్టు బాదం నూనెతో మసాజ్ చేసుకోవడం వల్ల డార్క్ సర్కిల్స్ తగ్గిస్తుంది మరియు బ్లడ్ సర్కులేషన్ పెంచుతుంది.

English summary

How to Get Rid of Eye Bags

The development of dark circles and eye bags is a common problem. Bags under your eyes become more noticeable as you age, a time when skin begins to lose elasticity. Although they are not harmful, they are not attractive and they can lead to low self-esteem.
Desktop Bottom Promotion