For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ చర్మ రంగును బట్టి, నెయిల్ పాలిష్ ఎంపిక చేసుకోవడం ఎలా

By Super
|

కొన్నిసార్లు, వేరేవారి మీద చాలా బాగున్నట్లుగా కనపడే రంగు, అదే రంగు మీరు వేసుకుంటే అసహ్యంగా కనపడవొచ్చు. ఆ రంగు మీరు వేసుకున్నప్పుడు పాలిపోయినట్లుగా గాని లేదా మీ శరీర రంగులో కలిసిపోయినట్లుగా గాని కనపడవొచ్చు. లేదా, మీ చేతులకు చాలా గాడిగా మరియు మీ చేతులకు సరిపోలనట్లుగా కూడా కనపడవచ్చు. సరిఅయిన రంగు ధరించటంవలన మీరు ఇతరులకు ఈ పద్ధతిలో రంగు వేసుకోవాలి అని చూపించటానికి సహాయప డినవారవుతారు.

మీ గోర్లకు రంగు వేసుకుంటున్నప్పుడు గుర్తుపెట్టుకోవలసిన ముఖ్యమైన విషయాలలో ఒకటి ఆ రంగు మీ శరీరఛాయతో సరిపోలినట్లుగా ఉండాలి. ఖచ్చితంగా గోళ్ళ రంగు వల్ల మీ అందం ఇనుమడించడానికి సులభమయిన మార్గం, మీ చర్మచాయతో అది సరిపోలేట్లుగా ఉండాలి.

షేడ్స్ ఎంచుకోవడంలో అత్యంత ప్రాచుర్యం పొందిన చిట్కా:

మీ చర్మచాయ ప్రకారం సరిఅయిన గోళ్ళ రంగు ఎంచుకోవడం అత్యంత ప్రాచుర్యం పొందిన చిట్కాలలో ఒకటి. ముందుగా ఈ రకంగా ఎంచుకోవాలి.లేత చర్మచాయ గల ఆడవారు లేత రంగు గోళ్ళ రంగు వాడతారు.

హాట్ హాట్ గా మదిని దోచేసే నెయిల్ పాలిష్ కలర్స్ హాట్ హాట్ గా మదిని దోచేసే నెయిల్ పాలిష్ కలర్స్

చామనచాయతోఉన్నఆడవారు మద్యస్థంగా ఉన్న ముదురు రంగు గోళ్ళ రంగు వాడతారు. ముదురురంగు చర్మచాయ కలిగిన ఆడవారు చాలా ముదురుగా ఉన్న గోళ్ళ రంగు వాడతారు.

ఇవి అనుసరించడానికి సులువైన చాయామార్గదర్శకాలు కావచ్చు, కానీ నిజానికి ఇవి చాలా పరిమితంగా అనుసరిస్తారు. ఈ రకమైన చాయకు సరిపోలే రంగులు మీరు వేసుకోవటం వలన మీ రూపంలో ఏ క్రొత్తదనం కనిపించదు.

నెయిల్ పాలిష్ ను ఫ్రెష్ గా ఉండేలా నిల్వ చేసే పద్దతులు... నెయిల్ పాలిష్ ను ఫ్రెష్ గా ఉండేలా నిల్వ చేసే పద్దతులు...

మీరు మీ చర్మచాయతో పరిపూర్ణంగా సరిపడే గోళ్ళ రంగు చాయలను పొందటానికి సహాయపదే కొన్ని ఇతర మార్గాలు ఉన్నాయి.

వివిధ చర్మచాయల కోసం సరిఅయిన నైల్ పాలిష్ రంగులు ఎంచుకోవడం:

చాలా ఫెయిర్ స్కిన్:

చాలా ఫెయిర్ స్కిన్:

చాలా తెలుపు చర్మం ఉన్నవారు ఎక్కువగా వారి చర్మచాయ గులాబీ రంగులో ఉంటుంది..

మీరు ప్రయత్నించవలసిన కలర్స్:

పాస్టెల్ (బేకరిలో ఎక్కువగా వాడే రంగులు) షేడ్స్ ఉన్న గోళ్ళ రంగులను ప్రయత్నించండి

మీరు చాలా ముదురు షేడ్స్ వాడాలి అనుకుంటే చాలా ముదురు నీలం, నీలం మరియు మిడ్నైట్ బ్లూ షేడ్స్ బాగుంటాయి.

ఇంకా ఎక్కువ ముదురు షేడ్స్ లో ముదురు ఎరుపు మరియు గులాబి రంగులు ప్రయత్నించవచ్చు

మీరు దూరంగా ఉంచవలసిన కలర్స్:

నలుపు గోళ్ళ రంగుకు దూరంగా ఉండండి

ఎక్కువ గులాబీ రంగు శరీరచాయ గలవారు గోళ్ళ రంగుల నుండి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి.

పూర్తిగా మీ చర్మచాయతో కలిసే రంగులు లేదా 'అదృశ్య' (కనపడని) రంగులకు దూరంగా ఉండండి.

ఫెయిర్ స్కిన్:

ఫెయిర్ స్కిన్:

తెలుపు చర్మం ఉన్నవారు వివిధ లైట్ షేడ్స్ వాడవొచ్చు.

మీరు ప్రయత్నించవలసిన కలర్స్:

అన్ని రకాల పాస్టెల్ షేడ్స్

ముదురు ఎరుపు మరియు రూబీ షేడ్స్

ఊదా, రేగు, బుర్గున్డి,

సిల్వర్, తెలుపు, లేత గులాబి

బ్లూస్, నారింజ, పీచ్

మీరు దూరంగా ఉంచవలసిన కలర్స్:

ముదురు ఎరుపు రంగు తప్ప, మగతా ముదురు రంగులను దూరంగా ఉంచండి.

చామనచాయ చర్మం:

చామనచాయ చర్మం:

చామనచాయ చర్మం లేదా టాన్ (ఎర్రగా కందినట్లుగా) చర్మచాయ ఉన్నవారికి అనేక రకాల షేడ్స్ ఉన్నాయి.

మీరు ప్రయత్నించవలసిన కలర్స్:

లేత గులాబి, ఊదా , బ్లూస్ మరియు రెడ్స్

వెండి మరియు బుర్గుండి

పీచ్ మరియు లేత గోధుమ

మీరు దూరంగా ఉంచవలసిన కలర్స్:

బంగారు మరియు రస్ట్ యొక్క షేడ్స్ కు దూరంగా ఉండండి.

మధ్యస్థంగా ఉన్న ముదురు రంగు చర్మచాయ ఉన్నవారు :

మధ్యస్థంగా ఉన్న ముదురు రంగు చర్మచాయ ఉన్నవారు :

డీప్ షేడ్స్ వీరికి బాగా సరిపోతాయి.

మీరు ప్రయత్నించవలసిన కలర్స్:

ఎరుపు , ఊదా , ప్రకాశవంతమైన నారింజ

మీ చర్మ రంగును బట్టి, నెయిల్ పాలిష్ ఎంపిక చేసుకోవడం ఎలా

మీ చర్మ రంగును బట్టి, నెయిల్ పాలిష్ ఎంపిక చేసుకోవడం ఎలా

మీరు దూరంగా ఉంచవలసిన కలర్స్:

పాస్టెల్ ఏదైనా సరే, వాడకండి లేదా బాగా లేత రంగు ఉన్న గోళ్ళ రంగు వాడవొద్దు, వీటివలన మీ రూపమే అందహీనంగా కనపడుతుంది.

మీ నైల్ పెయింట్ మీ చర్మచాయకు తగ్గట్టుగా ఉండటం చాలా ముఖ్యం, మీరు నైల్ పెయింట్ ఏ సందర్భంగా వేసుకుంటున్నారు మరియు మీరు ఏ రకమైన దుస్తులు ధరిస్తున్నారు అన్నది కూడా పరిగణలోకి తీసుకోవాలి,

వీటితోపాటుగా, మీ గోర్లు శుభ్రంగా ఉంచుకోవడం మరియు క్రమం తప్పకుండా వాటిని ట్రిమ్ చేసుకోవటం వంటివి కూడా మీ గోర్ల యొక్క అందాన్ని ఇనుమడింప చేస్తుంది.

పైన చిట్కాలు మీ చర్మచాయకు తగ్గట్లుగా నైల్ పెయింట్ షేడ్స్ ఎంచుకోవటానికి సహాయపడతాయి. మీరు ముందు ఏదైనా రంగును ఎంచుకొని ప్రయోగం చేయవొచ్చు మరియు అప్పుడు మీకు కావలసినది వేసుకోవొచ్చు.

English summary

How To Choose Nail Polish Colours For Different Skin Tones?

Sometimes, however, the colour that looks great on someone else may look like a disaster on yours. It may look pale or completely washed out when you wear it. Or, it may look too bright and mismatched on your hands.
Desktop Bottom Promotion