For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంట్లోనే సన్ టాన్ తొలగించుకోవడం ఎలా ?

By Super
|

సన్ టాన్ అనేది చాలా సాధారణ సమస్య ప్రత్యేకంగా వేసవిలో. సన్ టాన్ మీకు వేసవిలోనే ఉంటుందని అనుకోకండి. వర్షాకాలంలో కూడా సన్ టాన్ వచ్చే అవకాశాలు తక్కువేం కాదు.
చాలామంది రసాయనాలు కలిగిన సన్ స్క్రీన్ క్రీములు, చాలా ఎక్కువ ధరలతో మార్కెట్ లో దొరికే లోశాన్లను ఎంచుకుంటారు.

అధిక ధరలు గల సౌందర్య ఉత్పత్తులను కొనుగోలు చేసే బదులు, సహజ చికిత్సలను ఉపయోగించి ఎందుకు సన్ టాన్ ని తొలగించుకోకూడదు? ఈ చిట్కాలు సాధారణంగా సహజమైనవి, ఎటువంటి చర్మ సమస్యలు రావని మేము నిర్ధారిస్తున్నాము.

సన్ టాన్ పై పోరాడడానికి ఇంటి చిట్కాలను ప్రయత్నించండి.

సన్ టాన్ నివారించడానికి ఇంటి చిట్కాలు

సన్ టాన్ నివారించడానికి ఇంటి చిట్కాలు

నిమ్మరసం, రోజ్ వాటర్, కీరదోస రసం మిశ్రమం మీ ముఖంపై అద్భుతంగా పనిచేస్తుంది. నిమ్మరసం టాన్ ను తొలగిస్తుంది, కీరదోస, రోజ్ వాటర్ సహజ చల్లబరిచేవిగా పనిచేస్తాయి.

సన్ టాన్ నివారించడానికి ఇంటి చిట్కాలు

సన్ టాన్ నివారించడానికి ఇంటి చిట్కాలు

పచ్చి పాలు, పసుపు, కొద్ది నిమ్మరసం మిశ్రమాన్ని మీ ముఖంపై అదేవిధంగా ప్రభావిత ప్రదేశాలలో దీనిని అప్లై చేసి ఆర నివ్వండి. నీటితో కడిగేయండి.

సన్ టాన్ నివారించడానికి ఇంటి చిట్కాలు

సన్ టాన్ నివారించడానికి ఇంటి చిట్కాలు

ఓట్స్, మజ్జిగ మిశ్రమాన్ని తయారుచేయండి, దీనిని చర్మం పొరలు ఊడడంపై ఉపయోగించండి.

కొద్ది పెరుగులో సెనగపిండి, నిమ్మరసాన్ని కలపండి, ప్రభావిత ప్రాంతాలలో దీనిని ప్రతిరోజూ అప్లై చేసినట్లైతే టాన్ నుండి మంచి ఫలితం పొందవచ్చు.

సన్ టాన్ నివారించడానికి ఇంటి చిట్కాలు

సన్ టాన్ నివారించడానికి ఇంటి చిట్కాలు

తాజా నిమ్మ రసాన్ని మోకాళ్ళు, మోచేతులు లేదా మచ్చల ప్రాంతంలో అప్లై చేయండి, దానిని కనీసం 15 నిమిషాల సేపు ఉంచితే టాన్ పై బాగా పనిచేస్తుంది.

సన్ టాన్ నివారించడానికి ఇంటి చిట్కాలు

సన్ టాన్ నివారించడానికి ఇంటి చిట్కాలు

టాన్ ని తొలగించుకోవడానికి చేతులు, ముఖంపై ప్రతిరోజూ తాజా కొబ్బరినీళ్ళు వాడడం మంచిది. ఇది చర్మం ఆరోగ్యంగా, మృదువుగా కూడా ఉండేట్లు చేస్తుంది.

సన్ టాన్ నివారించడానికి ఇంటి చిట్కాలు

సన్ టాన్ నివారించడానికి ఇంటి చిట్కాలు

వారానికి మూడుసార్లు పసుపు, నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని అప్లై చేయండి. ఇది చర్మ రంగుని గణనీయంగా తగ్గించి, టాన్ ని తొలగిస్తుంది.

సన్ టాన్ నివారించడానికి ఇంటి చిట్కాలు

సన్ టాన్ నివారించడానికి ఇంటి చిట్కాలు

బాదాం పప్పులను రాత్రంతా నీళ్ళలో నానపెట్టి మరుసటి రోజు వాటిని మృదువైన మిశ్రమంగా చేయండి. అంతే మోతాదులో పాల మీగడను కలిపి టాన్ ఉన్న ప్రాంతంలో అప్లై చేయండి.

సన్ టాన్ నివారించడానికి ఇంటి చిట్కాలు

సన్ టాన్ నివారించడానికి ఇంటి చిట్కాలు

ఓట్ మీల్, పెరుగు, కొన్ని నిమ్మ చుక్కలు, టమాట రసం మిశ్రమాన్ని అప్లై చేయండి. మెరుగైన చర్మం కోసం దీనిని ఒక అరగంట సేపు ఉంచుకుని తరువాత చల్లని నీళ్ళతో కడిగేసుకోవాలి.

సన్ టాన్ నివారించడానికి ఇంటి చిట్కాలు

సన్ టాన్ నివారించడానికి ఇంటి చిట్కాలు

బొప్పాయి గుజ్జును సన్-టాన్ అయిన ప్రదేశంలో మసాజ్ చేయండి. బొప్పాయి చర్మానికి చాలా మంచిది, ఇది వయో పరిమిత లక్షణాలను కూడా కలిగి ఉంది.

సన్ టాన్ నివారించడానికి ఇంటి చిట్కాలు

సన్ టాన్ నివారించడానికి ఇంటి చిట్కాలు

ముల్తానా మట్టిని మీ ముఖంపై అప్లై చేస్తే టాన్ ని గణనీయంగా తగ్గించడానికి సహాయపడుతుంది.

English summary

How to to get rid of a suntan at home

Suntan is a common problem especially during summer season. Don't think summer only give you suntan. Even if it is raining, chances of suntan is not less.
Desktop Bottom Promotion