For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్నానానికి ప్యూమిస్ స్టోన్ వాడుతున్నారా?ఐతే ఈ జాగ్రత్తలు మీకే

|

చర్మంపై పేరుకొన్న దుమ్ము, ధూళిపోయి నిగనిగలాడుతూ మెరవాలన్నా, అవాంఛిత రోమాలు తొలగించుకోవాలన్నా..ఎప్పటికప్పుడు ఫ్యూమిస్ స్టోన్ తో శుభ్రపరచుకోవాలన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఫ్యూమిస్ స్టోన్ వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. మరి ఒకసారి ఆ జాగ్రత్తలేంటో చూద్దామా...

చర్మంపై పేరుకున్న దుమ్ము, ధూళి, మృతకణాలను తొలగించడానికి క్లెన్సింగ్, స్ర్కబింగ్ చేయడం మహజమే. వాటితో పాటు స్నానం చేసే సమయంలో ప్యూమిస్ స్టోన్ ఉపయోగించడం కూడా మంచి పద్దతే. అయితే ఈ ప్యూమిస్ స్టోన్ ఉపయోగించే ముందు ఎక్కడైతే శుభ్రపరుచుకోవాలని అనుకుంటున్నారో, ఆ ప్రాంతాన్నిగోరువెచ్చగా ఉన్న నీటితో తడపాలి. అలాగే ప్యూమిస్ స్టోన్ కూడా నాబెట్టాలి. ఉదాహరణకు దీంతో కాళ్లను శుభ్రం చేసుకోవాలని అనుకుంటే రెండు కాళ్ళు గోరు వెచ్చని నీటిలో పెట్టి కాసేపు ఉంచాలి. అదే నీటిలో ఈ ఫ్యూమిస్ స్టోన్ కూడా నానబెట్టాలి.
ఆ తర్వాత కాలి మీద వృత్తాకరాంలో రుద్దాలి.

How to Use a Pumice Stone and It's Skin Benefits

చర్మతత్వాన్ని బట్టి: గట్టిగా, గరుకుగా ఉండే దీని ఉపరితలం చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించడానికి బాగా ఉపయోగపడుతుంది. దీనిపైన ఉండే రంధ్రాలు చర్మం మీద ఉండే మురికిని తొలగించి చర్మాన్ని మృదువుగా, నునుపుగా చేస్తాయి. కేవలం చర్మ సంరక్షణ కోసం ప్యూమిస్ స్టోన్ వాడాలనుకుంటే ఏవి పడితే అవి కాకుండా బ్యూటీ సెలూన్, కాస్మొటిక్ దుకాణాల్లో ఉండే నున్నని రాయిని ఎంపిక చేసుకోవాలి. అలాగే సున్నిత చర్మతత్వం ఉన్న వాళ్ళు ఈ స్టోన్ ని కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోవాలి.

తేమను సంరక్షించుకోవాలి: ఫ్యూమిస్ స్టోన్ ఉపయోగించి చర్మం శుభ్రపరుచుకున్న వెంటనే మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఎందుకంటే గరుకుగా ఉండే ఈ రాయి వల్ల చర్మంలో ఉండే సహజ తేమ శాతం తగ్గిపోతుంది. ఫలితంగా చర్మం నిర్జీవంగా, పొడి అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకే మాయిశ్చరైజర్ వాడకం కూడా తప్పనిసరి. అప్పుడే చర్మం తాజాగా నిగనిగలాడుతూ ఉంటుంది.

గోళ్లకు కూడా: మ్యానిక్యూర్..,.బ్యూటీపార్లర్ లో అందించే ఈ సౌందర్య చికిత్స అందరికీ తెలిసిందే. అందమైన చేతులు మృదువుగా మారాలన్నా, చేతి గోళ్లు అందంగా, ఆకర్షించేలా కనిపించాలన్నా మ్యానిక్యూర్ చేయించుకుంటే చాలు. అలాగని మ్యానిక్యూర్ అనగానే బ్యూటీపార్లర్లకు పరుగులు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఈ ఫ్యూమిస్ స్టోన్ ఉపయోగించి కూడా చేతులను శుభ్రపరుచుకోవచ్చు.

పాదాలకు కూడా: గోరువెచ్చని నీటిలో పాదాలను పదిహేను నిముషాల పాటు నానబెట్టాలి. వీలైతే ఈ నీటికి కొంచెం ఎప్సమ్ సాల్ట్ ని కలపండి. పొడిగా ఉన్న పాదాల మీద కూడా ఈ స్టోన్ తో రుద్ది మురికిని తొలగించుకోవచ్చు. కానీ మంచి ప్రభావం కనిపించాలంటే మాత్రం పాదాలను కాసేపు నానబెట్టాల్సిందే. ఎందుకంటే పాదాలు నీటిలోనాని, మెత్తబడ్డాక ఫ్యూమిస్ స్టోన్ తో వాటి వెనుకభాగాన, అడుగున మృదువుగా మర్దన చేస్తే మృతకణాలు, మురికి చాలా సులభంగా వదిలిపోతాయి.

అవాంఛిత రోమాలు తొలగించడానికి : కేవలం పాదాలు, చేతులు, చర్మం సంరక్షణకే కాదు..ఫ్యూమిస్ స్టోన్ ని అవాంఛిత రోమాలు తొలగించుకోవడానికి కూడా ఉపయోగించవచ్చు. కాళ్లు, చేతులు, ఇతర శరీర భాగాల్లో ఉండే అవాంఛిత రోమాల్ని తొలగించడానికి ఆ భాగాన్ని నీటితో తడిపి తర్వాత సబ్బు రాయాలి. తర్వాత ప్యూమిస్ స్టోన్ తో ఆ ప్రాంతంలో రుద్దితే అవాంఛిత రోమాల సమస్య తగ్గుముఖం పడుతుంది. అయితే దీనికి కాస్త సమయం పడుతుంది. తరచుగా ఫ్యూమిస్ స్టోన్ ను ఉపయోగించడం వల్ల వెంట్రుకలు పెరగడం తగ్గుతుంది.

వాడేటప్పుడు జాగ్రత్తలు: ఇన్ని ప్రయోజనాలున్న ఫ్యూమిస్ స్టోన్ వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇతర శరీర భాగాల్లోలా ముఖం మీద ప్యూమిస్ స్టోన్ ను ఉపయోగించడం మంచి పద్దతి కాదు. అలాగే పగిలని చర్మం పై ప్యూమిస్ స్టోన్ ని రుద్దకూడదు. అలసే దెబ్బతిన్న చర్మంపై గట్టిగా ఉండే రాయి రాపిడి కలిగితే చర్మగ్రంధులు ఇంకా దెబ్బతింటాయి. మృతకణాలను తొలగించడానికి ఈ స్టోన్ ఉపయోగించబడుతుంది కదా అని పొడిగా ఉన్న చర్మపై మరీ గట్టిగా రుద్దితే చర్మం గీసుకుపోతుంది. అలాగే ఒకరు వాడిన ఫ్యూమిస్ స్టోన్ ఇంకొకరు వాడకూడదు. దీని వల్ల చర్మ సమస్యలు, ఇన్ఫెక్షన్స్ ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపించే అవకాశాలున్నాయి.

వాడిన తర్వాత కడగండి: ఫ్యూమిస్ స్టోన్ ని ఉపయోగించిన తర్వాత దాన్ని శుభ్రంగా కడగడం మర్చిపోకండి. మామూలుగా నీటితో కడిగినా మురికి తొలగకపోతే వేడి నీటిలో కాసేపు మరగపెబడితే చాలు. మురికి పోయి ఫ్యూమిస్ స్టోన్ శుభ్రపడుతుంది. లేదంటే ఈ స్టోన్ కి ఉండే చిన్న చిన్న రంధ్రాల్లో మురికి అలానే ఉండిపోయి మళ్లీ ఉపయోగించినప్పుడు దాని వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.

English summary

How to Use a Pumice Stone and It's Skin Benefits

The pumice stone is formed when hot lava mixes with water and they create a froth that hardens. This porous rock has been used for centuries as an abrasive beauty aid. Ancient Greeks were known for using the stone to remove body hair. Today the pumice stone is used to remove rough skin, primarily on the heels of your feet.
Story first published: Tuesday, September 2, 2014, 15:33 [IST]
Desktop Bottom Promotion