For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంతిపువ్వులతో అమేజింగ్ బ్యూటీ బెనిఫిట్స్

By Super
|

మేరీగోల్డ్ బ్యూటీ బెనిఫిట్స్

క్యాలెండులా లేదా పాట్ మేరీ గోల్డ్ లనే హెర్బ్స్ చర్మ సంరక్షణకు సంబంధించి అతి ప్రాచీనంగా ప్రాముఖ్యత చెందినవి. ఆర్నమెంటల్ మేరీ గోల్డ్ కంటే పాట్ మేరీ గోల్డ్ కొంచెం వైవిధ్యమైనది. మెడిటెర్రనియన్ ప్రాంతం, వెస్ట్రన్ యూరోప్ అలాగే సౌత్ వెస్ట్రన్ ఆసియాలో ఇవి ఎక్కువ పెరుగుతాయి. కేరాటేనాయిడ్స్, గ్లైకోసైడ్స్, వోలాటిల్ ఆయిల్, ఫ్లావోనాయిడ్స్ అలాగే స్టేరోల్స్ వంటివి ఇందులో పుష్కలంగా లభిస్తాయి. ఇవన్నీ చర్మ సంరక్షణకు ముఖ్యమైనవి. క్రీమ్స్, సోప్స్ అలాగే అరోమాథెరపీ ఆయిల్స్ గా ఇవి లభిస్తాయి.

ఇప్పుడు మేరీగోల్డ్/క్యాలెండులా బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం

స్కిన్ ఇరిటేషన్ కు విరుగుడు

స్కిన్ ఇరిటేషన్ కు విరుగుడు

క్యాలెండులాలో ఉండే వోలాటిల్ ఆయిల్, ఆర్గానిక్ యాసిడ్స్, స్టేరోల్స్ లకు చర్మానికి ఉపశమనాన్ని అందించే లక్షణాలు ఉన్నాయి. పురుగు కుట్టినా, చర్మంపై చిన్న చిన్న బొబ్బలు, ఏదైనా కురుపు వంటి ఎన్నోచర్మ సమస్యలకు క్యాలెండులా క్రీమ్ ను ఔషదంలా భావించవచ్చు. ఈ క్రీమ్ ను అప్లై చేయడం ద్వారా చర్మం ఉపశమనం పొంది హాయిగా ఉంటుంది. త్వరగా చర్మ సమస్యలు తగ్గుముఖం పడతాయి.

మొటిమల సమస్య మటుమాయం

మొటిమల సమస్య మటుమాయం

చర్మంపైనున్న మృత కణాలు, అలాగే జిడ్డు చర్మం వల్ల మొటిమలు ఏర్పడతాయి. తద్వారా చర్మం ఇరిటేషన్ కు గురవుతుంది. అందం తగ్గిపోతుంది. క్యాలెండులా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడడం ద్వారా వీటన్నిటికీ చెక్ పెట్టొచ్చు. మొటిమల ఏర్పడిన మచ్చలు అలాగే మొటిమల ఏర్పడే మంట, చికాకులను తగ్గించడంతో క్యాలెండులా ప్రధాన పాత్ర పోషిస్తుంది.

చర్మంలో తేమను నిలుపుతుంది

చర్మంలో తేమను నిలుపుతుంది

పాట్ మేరీ గోల్డ్ పుష్పంలోనున్న నూనె చర్మంలోని తేమను పదిలపరచి చర్మానికి మృదుత్వాన్ని అందించడంలో ఉపయోగపడుతుంది. చర్మం యొక్క పై లేయర్ ను ఎపిడెర్మిస్ అనంటారు. ఈ లేయర్ ను సాఫ్ట్ గా చేయడానికి పాట్ మేరీ గోల్డ్ పుష్పంలోనున్న నూనె సహకరిస్తుంది. తద్వారా ఆరోగ్యకరమైన, మృదువైన చర్మాన్ని పొందడానికి తోడ్పడుతుంది.

చర్మం నిగారింపు

చర్మం నిగారింపు

క్యాలెండులా లోనున్న నూనెకి రక్త ప్రసరణని క్రమబద్దీకరించే సామర్ధ్యం ఉంది. రక్త ప్రసరణ సజావుగా జరిగితే సాధారణ మెటబాలిక్ ప్రాసెస్ ద్వారా జేనేరేట్ అయ్యే వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది. తద్వారా ఆ ప్రాంతం ఆరోగ్యకరంగా ఉంటుంది. క్యాలెండులా ఆయిల్ ను తరచూ వాడడం వల్ల చర్మపు ఛాయ మెరుగవుతుందని నిరూపించబడింది. అలాగే చర్మాన్ని కాంతివంతం చేయడంలో కూడా ఈ నూనె ఉపయోగపడుతుంది.

కంటి చుట్టూ ముడతలు

కంటి చుట్టూ ముడతలు

కంటి చుట్టూ చర్మపై ఏర్పడే ముడతలు చాలా మందిని వేధించే సమస్యలలో ముఖ్యమైనది. ఈ ముడతల వలన వయసు ఎక్కువగా కనిపిస్తుంది. క్యాలెండులా లో నున్న ఘాటైన యాంటీఆక్సిడెంట్ కంటి చుట్టూ నున్న చర్మంపై ముడతలను నివారిస్తుంది. సాధారణ ఏజింగ్ ప్రాసెస్ ను డిలే చేసే ఎబిలిటీ క్యాలెండులాలో ఉంది. యవ్వనవంతమైన చర్మాన్ని పొందడానికి క్యాలెండులా ఈ విధంగా ఉపయోగపడుతుంది.

క్యాలెండులా వాడకం - హోం టిప్స్

క్యాలెండులా వాడకం - హోం టిప్స్

ఒక కప్పు బాయిలింగ్ వాటర్ లో క్యాలెండులా పూవులను మరిగించాలి. నీళ్ళు చల్లారిన తరువాత వడగట్టి ఆ నీటిని చర్మంపై డైరెక్ట్ గా అప్లై చేయాలి. ఆ నీటిని టైట్ కంటైనర్ లో ఉంచి ఫ్రిడ్జ్ లో భద్రపరచవచ్చు. అవసరమైనప్పుడు ఈ నీటిని వాడుకోవచ్చు.

ప్రత్యామ్నాయంగా

ప్రత్యామ్నాయంగా

ప్రత్యామ్నాయంగా, ఎండిపోయిన క్యాలెండులా రేకులను పది రోజుల పాటు ఆలివ్ ఆయిల్ లో నానబెట్టవచ్చు. పది రోజులూ, ఈ కంటైనర్ ను ఎండలో ఉంచాలి. ఆ తరువాత వడగట్టి ఈ నూనెను వాడుకోవచ్చు. ఎయిర్ టైట్ కంటైనర్ లో భద్రపరచి ఈ నూనెను అవసరమైనప్పుడు వాడుకోవచ్చు.

క్యాలెండులా పూవులు దొరకనప్పుడు క్యాలెండులా క్రీమ్ ను అందించే పేరున్న ఉత్పత్తుల ప్రొడక్ట్స్ ను కొనుక్కోవాలి. ఆన్లైన్ లో ఇవి దొరుకుతాయి.

సాధారణంగా క్యాలెండులా బాహ్య వినియోగానికి సురక్షితమైనది.

సాధారణంగా క్యాలెండులా బాహ్య వినియోగానికి సురక్షితమైనది.

అయినప్పటికీ, గర్భం దాల్చినప్పుడు, బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడూ క్యాలెండులాని వినియోగించకపోవడం ఉత్తమం. కొంత మందికి క్యాలెండులా వల్ల ఎలర్జీ ఏర్పడుతుంది. అటుంటి వారు కూడా దీనిని వాడకపోవడం ఉత్తమం.

English summary

Marigold beauty benefits

When it comes to skincare, Calendula or pot marigold is one of the oldest known herbs. Pot marigold – which is quite different from the ornamental marigold – grows widely in the Mediterranean region, Western Europe and South-western Asia.
Desktop Bottom Promotion