For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పసుపు రంగు దంతాలను తెల్లగా మార్చే హోం రెమెడీస్

By Super
|

ముఖంలో మరో అందమైన భాగం అందమైన పలువరుస ఎంతో అందంగా ఉంటుంది. అయితే పలువరుస అందంగా ఉన్నా, పళ్ళు పచ్చగా గార పట్టి ఉంటే నలుగురిలో హాయిగా నవ్వలేము. అందుకే, ఎప్పుడూ పళ్ళను శుభ్రంగా ఉంచుకోవాలి. చాలా మంది వారి దంత సంరక్షణ కోసం రెగ్యులర్ గా డెంటిస్ట్ ను కలుస్తుంటారు. రోజులో రెండు సార్లు బ్రెష్ చేసుకోవడం చేస్తుంటారు. అందుకే వారి దంతాలు తెల్లగా మిళమిళలాడుతూ ఆరోగ్యం ఉంటాయి. అయితే మరొకొందరికి ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్న వారి దంతాలు అంత అందంగా కనబడవు, పసుపుపచ్చగా కనబడుతుంటాయి.

ఇలా పసుపు పచ్చగా కనబడే దంతాలను నిర్మూలించడానికి తులసి అద్భుతంగా సహాయపడుతుంది. ఇది ఒక మూలిక. సహజంగా ఇది మొత్తం ఆరోగ్యానికి బాగా సహాయపడుతుంది. మరియు ఆరోగ్యకరమైన తెల్లని దంతాలను పొందడానికి కూడా సహాయపడుతుంది. తులసి ఆకులను ఉపయోగించి పసుపుపచ్చ దంతాలను నిర్మూలించడం మాత్రమే కాదు, ఇతర దంత సమస్యలను కూడా అరికట్టుటలో ఇది అద్భుతంగా సహాయపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం తులసిని వివిధ రకాలను ఉపయోగించి పసుపు పచ్చ దంతాలను నిర్మూలించవచ్చు. అదేలాగో ఈ క్రింది టిప్స్ చూడండి...

హోం మేడ్ బాసిల్ టూత్ పౌడర్:

హోం మేడ్ బాసిల్ టూత్ పౌడర్:

తాజాగా ఉండి తులసి ఆకులను తీసుకొని , నీడలోనే ఎండబెట్టుకోవాలి. ఇవి పూర్తిగా ఎండిన తర్వాత , ఆకును గ్రైండర్ లో వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ ను ఉపయోగించి బ్రష్ చేసి మీ పసుపు దంతాలను నిర్మూలించుకోండి. తులసి పౌడర్ ఉపయోగించి చేతి వేలితో కూడా బాగా రుద్దడం వల్ల ఉత్తమ ఫలితం ఉంటుంది. ఇంకా, మీ రెగ్యులర్ పేస్ట్ కు కూడా , ఈ పౌడర్ ను జతచేసి, బ్రష్ చేసుకోవచ్చు.

*బబూల్ ట్రీ(అకాసియా అరాబికా):

*బబూల్ ట్రీ(అకాసియా అరాబికా):

మీ దంతాలు తెల్లగా మర్చుకోవడానికి కొన్ని చెట్ల యొక్క పుల్లలను కూడా ఉపయోగించవచ్చు.

ఇండియాలో మరియు పక్క దేశాల్లో కూడా ఇప్పటికీ ఉపయోగిస్తున్న ఒక పురాతన సాంప్రదాయం . ఆయుర్వేదం ప్రకారం, కొన్ని మొక్కల యొక్క కొమ్మలను పుల్లగా చేసి వాటిని దంతాలతో నములుతూ, దంతాలను రుద్దడం వల్ల దంతాలు గట్టిపడటంతో పాటు, శుభ్రపడుతాయి. అదే విధంగా తెల్లగా మారుతాయి. మీరు బ్రెష్ చేస్తున్నారా, ఎలా? ఒక మ్రుదువైనుటువంటి (మరీ సాఫ్ట్ గా లేదా మరీ హార్డ్ గా)కాకుండా ఉన్నది, చెట్టు యొక్క కొమ్మల నుండి తుంచుకొని, పుల్లని వేరుచేసి దంతాలను రుద్దాలి . ఇది ఖచ్ఛితంగా టూత్ బ్రష్ పొడవు ఉండాలి. దీన్ని మంచి నీటితో శుభ్రంగా కడగాలి. తర్వాత బ్రష్ లాగే చేత్తో ఒక వైపు పట్టుకొని , నోట్లో పెట్టుకొని, నిధానంగా కొరుకుతూ దంతాలను రుద్దాలి. ఇలా నమలడం వల్ల ఫైబర్ వంటి పదార్థం వస్తుంది. అది చూడటానికి బ్రష్ లాగే ఉంటుంది, అలాగే రఫ్ గా కూడా ఉంటుంది. ఇది మీకు ఒక నేచురల్ బ్రష్ . ఈ బ్రష్ ను ఉపయోగించి కనీసం 15నుండి 20నిముషాలు దంతాలను రుద్దాలి. తర్వాత ఆ పుల్లను పడేసి, తిరిగి మరుసటి రోజు కొత్తదాంతో రుద్దుకోవాలి. ఇక ఇక్కడ ఒక పెద్ద సందేహం ఏంటంటే ఏ చెట్టు యొక్క కొమ్మ లేదా పుల్లతో దంతాలను రుద్దుకోవాలి?

*బబూల్ ట్రీ(అకాసియా అరాబికా): బబూల్ ట్రీ దంతాలకు ఒక అత్యంత స్నేహపూర్వక మొక్క. దీని యొక్క రసాన్ని అనేక హెర్బల్ టూత్ పేస్ట్ లలో ఉపయోగిస్తున్నారు . మరి అవి కమర్షియల్ గా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ పుల్లలో ఉండే టానిన్ అనే కాంపోనెంట్ పసుపు దంతాలను తెల్లగా మార్చుతాయి.

బానియన్ ట్రీ(ఫిక్కస్ రిలిజియోస):

బానియన్ ట్రీ(ఫిక్కస్ రిలిజియోస):

బానియన్ ట్రీ(ఫిక్కస్ రిలిజియోస): ఒక వేరులో ఒక నేచురల్ ఆస్ట్రింజెంట్ ఉండటం వల్ల మీ దంతాలను ముత్యాల్లా మెరిపిస్తుంది. ఇది చెట్టు యొక్క పై బాగంలో వేల్రాడుతూ పెరుగుతుంది.

వేప లేదా మార్గోస(అజార్డిరచ్తా ఇండిక) :

వేప లేదా మార్గోస(అజార్డిరచ్తా ఇండిక) :

వేప లేదా మార్గోస(అజార్డిరచ్తా ఇండిక) : వేపపుల్లలో ఆస్ట్రిజెంట్స్ మాత్రమే కాదు, యాంటీసెప్టిక్ లక్షణాలు కూడా పుష్కలంగా ఉండి , దంతాలను శుభ్రపరచడంతో పాటు, చెడు శ్వాసను నివారిస్తుంది మరియు ఎటువంటి దంత సమస్యలనైనా మరియు దంతక్షయాన్ని నివారిస్తుంది .అలాగే దంతాను తెల్లగా మార్చుతుంది.

ఆయిల్ పుల్లింగ్ ద్వారా దంతాలను తెల్లగా మార్చుకోవడం ఎలా

ఆయిల్ పుల్లింగ్ ద్వారా దంతాలను తెల్లగా మార్చుకోవడం ఎలా

ఆయిల్ పుల్లింగ్ ద్వారా దంతాలను తెల్లగా మార్చుకోవడం ఎలా

అవును, మీరు దంతాలు తెల్లగా మార్చుకోవాలంటే, మీరు నోటితో ఆయిల్ పుల్ చేయాలి.!ఆయిల్ పుల్లింగ్ అనేది, అన్ని రకాల దంత సమస్యను ఎదుర్కోవడానికి ఆయుర్వేదిక్ టెక్నిక్ గా భావిస్తారు . అంతే కాదు, జాయింట్ పెయిన్స్, ఆర్థరైటిస్, మైగ్రేన్, సైనస్ ఇన్ఫెక్షన్, చర్మ సమస్యలు దురద, ఇతర స్కిన్ అలర్జీలను సైతం నివారించడంలో ఆయిల్ పుల్లింగ్ ఎఫెక్ట్ గా పనిచేస్తుంది. అలాగే కంటి చూపును, బుద్దిమాధ్యం, జుట్టు పెరుగుదల, జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు, దంతాలను తెల్లగా మార్చుతుంది.ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల మీ దంతాలు ప్రకాశవంతంగా మారడం మాత్రమే కాదు, ఇది నోట్లోని పాచి, బ్యాక్టీరియా, జిగటను తొలగిస్తుంది. మొత్తానికి ఒక ఆరోగ్యకరమైన షైనింగ్ దంతాలను మీకు అందిస్తుంది. మీరు ఉపయోగించి ఆయిల్ మీ నోట్లోని బ్యాక్టీరియాను, ప్యారాసైట్స్ ను మరియు ఇతర టాక్సిన్స్ ను పుల్ చేస్తుంది. మరి ఆయిల్ పుల్లింగ్ చేయడం ఎలా?దీన్ని చాలా సింపుల్ గా సులభంగా చేయవచ్చు...

 బేకింగ్ సోడా రెమెడీ : జాగ్రత్తగా చేయాలి.

బేకింగ్ సోడా రెమెడీ : జాగ్రత్తగా చేయాలి.

పసుపు దంతాలను నివారించడం కోసం పురాత కాలం నుండి బేకింగ్ సోడాను ఉపయోగిస్తున్నారు. మరియు ఇది చాలా ఎఫెక్టివ్,!దీన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి. బేకింగ్ సోడాలో సానపెట్టే స్వభావం కలిగి ఉంటుంది. ఇది మీ దంతాల యొక్క ఎనామిల్ ను తగ్గించేయవచ్చు. అయితే, బేకింగ్ సోడాలోని ఈ సానపెట్టే గుణం దంతాల మీద పడ్డ మొండి మరకలను తొలగించడంలో చాలా గొప్పగా సహాయపడుతుంది. బేకింగ్ సోడాతో పాటు నిమ్మరసం ఉపయోగించినట్లైతే, దంతాల్లోన్ని క్యాల్షియంను బ్లాక్ చేసి దంతాలను తెల్లగా మార్చుతుంది కాబట్టి, బేకింగ్ సోడాను మితంగా ఉపయోగించాలి . బేకింగ్ సోడా తక్షణ ప్రభావం చూపి, దంతాలను తెల్లగా మార్చుతుంది, దీర్ఘకాలం ఫలితం కోసం ఎనామిల్ రక్షణ కల్పించాలి. ఒక వేళ మీరు , మీ పసుపు దంతాలను నిర్మూలించుకోవడానికి బేకింగ్ సోడా ను ఉపయోగించడానికి నిర్ణయించుకొన్నట్లైతే, బేకింగ్ సోడా, నిమ్మరసం, మరియు ఉప్పును పేస్ట్ గా చేసి ఉపయోగించుకోవాలి.

విటమిన్ సి పుష్కలంగా ఉండే పండ్లు మరియు కూరగాయలు మీ దంతాలను తెల్లగా మార్చుతాయి.

విటమిన్ సి పుష్కలంగా ఉండే పండ్లు మరియు కూరగాయలు మీ దంతాలను తెల్లగా మార్చుతాయి.

విటమిన్ సి పుష్కలంగా ఉండే పండ్లు మరియు కూరగాయలు మీ దంతాలను తెల్లగా మార్చుతాయి.

సిట్రస్ పండ్లు , అదే విధంగా విటమిన్ సి పుష్కలంగా ఉండే పండ్లు మీ దంతాల యొక్క పసుపు రంగును నిర్మూలించి తెల్లగా మారేందుకు సహాయపడుతాయి. వీటిలో మీ దంతాలకు సహాయపడే బ్లీచింగ్ ఎఫెక్ట్ కలిగి ఉంది. కాబట్టి, స్ట్రాబెర్రీస్, టమోటో, ఆమ్లా, ఆరెంజ్ మరియు అత్యంత ప్రభావంతమైన నిమ్మకాయ మీ దంతాలను బ్లీచ్ చేస్తుంది. మరియు మీ దంతాల్లో మెరుపును తీసుకొస్తుంది. వీటిలో ఏదైనా సరే తీసుకొని మ్యాష్ చేసి, వాటితో దంతాలను రుద్దుకోవాలి. ఇలా చేయడం వల్ల దంతాల యొక్క పసుపు రంగు పోతుంది.

స్ట్రాబెర్రీని రెండు ముక్కలుగా కట్ చేసి, అందులో సగం తీసుకొని,దాని మీద బేకింగ్ సోడాను చిలకరించి, దాంతో దంతాల మీద బాగా రుద్దాలి. ఒక వేళ బేకింగ్ సోడా వద్దనుకుంటే, అలాగే ప్లెయిన్ గా స్ట్రాబెరీతో దంతా మీద రుద్దాలి. స్ట్రాబెర్రీలో ఉండే మాలిక్ యాసిడ్, అందులోని ఆస్ట్రిజెంట్ లక్షణాలు, స్వచ్చమైన దంతాలను అందిస్తాయి. స్ట్రాబెర్రీని మెత్తగా చేసి, దాన్నుండి వచ్చే రసాన్ని దాంతాల మీద అప్లై చేయాలి,కొన్ని నిముషాల తర్వాత నోటిని శుభ్రం చేసుకోవాలి. తొక్కను ఉపయోగించి కూడా దంతాల మీద రుద్దవచ్చు. స్ట్రాబెర్రీతో రుద్దిన తర్వాత , బ్రష్ చేసుకోవచ్చు.

ఆరెంజ్ తొక్క

ఆరెంజ్ తొక్క

రాత్రి నిద్రించడానికి ముందు, ఆరెంజ్ తొక్క తీసుకొని మీ దంతాల మీద రుద్దాలి.

నిమ్మతొక్క

నిమ్మతొక్క

నిమ్మతొక్క తీసుకొని అరనిముషం లేదా ఒక నిముషం కంటే ఎక్కువగా దంతా మీద రుద్దకూడదు.తర్వాత నీటితో నోటి శుభ్రంగా కడగాలి.

ఒక టీస్పూన్ నిమ్మరసం తీసుకొని దానికి ఒక టీస్పూన్ నీళ్ళు మిక్స్ చేయాలి. దీంతో దంతాలను బ్రష్ చేసుకోవాలి. తర్వాత మీ రెగ్యులర్ టూత్ పేస్ట్ తో బ్రష్ చేసుకోవచ్చు. నిమ్మరసాన్ని నేరుగా అలాగే ఉపయోగించకూడదు.ఎల్లప్పుడు నీటితో మిక్స్ చేసి తర్వాత దంతాల మీద అప్లై చేసి శుభ్రం చేసుకోవాలి.నిమ్మరసంలో యాసిడ్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది మీ దంతాల యొక్క నాణ్యతను మరియు దంతాల యొక్క క్యాల్షియంను తగ్గిస్తుంది. వారంలో రెండు సార్లుకు మించి ఉపయోగించకూడదు. అలా చేస్తే దంతాల యొక్క ఎనామిల్ దెబ్బతింటుంది.


Story first published: Thursday, October 23, 2014, 16:17 [IST]
Desktop Bottom Promotion