For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బొప్పాయితో ఆశ్చర్యకరమైన బ్యూటీ బెనిఫిట్స్

By Lakshmi Perumalla
|

ఒక ఉష్ణమండల పండు అయిన బొప్పాయిలో అనేక ఉపయోగాలున్నాయి. దీనిని విడిగా తినవచ్చు. లేదా సలాడ్లు,ఐస్ క్రీమ్,స్మూతీస్ మరియు సలాడ్ లలో కలుపుకొని తినవచ్చు. దీనిని జుట్టు మరియు చర్మ రక్షణ రెండింటి ఉత్పత్తులకు ఒక మూలవస్తువుగా ఉపయోగించవచ్చు. మీరు దీనిని ప్రాసెస్ రూపంలో కొనుగోలు చేయవచ్చు. దానికి బదులుగా నేరుగా బొప్పాయి పండును ఉపయోగించి అందం యొక్క ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే మీరు ఈ ప్రయోజనాలను క్రింద ఇవ్వబడ్డ బొప్పాయి అందం చిట్కాల నుండి నేర్చుకోవచ్చు.

బొప్పాయి బ్యూటీ చిట్కాలు

Papaya Beauty Tips

చిట్కా 1: ఫేస్ కొరకు బొప్పాయి

Encyclopedia.com అనే వెబ్ సైట్ లో చెప్పినట్లుగా,బొప్పాయిలో BHAs అని పిలవబడే బీటా హైడ్రాక్సిల్ ఆమ్లం అనే రసాయనాలు ఉన్నాయి. BHAs కి ఎక్స్ ఫ్లోట్ గుణం ఉంది. అంటే చర్మం పై పొరలు తొలగించి కొత్త తాజా చర్మం చూడటానికి సున్నితంగా మరియు మృదువుగా ఉంచే సామర్థ్యం కలిగి ఉంది. అదనంగా,ఈ పండు దుమ్మును తొలగించటానికి మరియు BHA కంటెంట్ ఉండుట వలన మోటిమలకు కారణం అయిన నూనెలను తొలగిస్తుంది. ముఖంను మృదువుగా చెయ్యడానికి కేవలం మీ చర్మంపై బొప్పాయి గుజ్జును పలుచని పొరగా రాసి,కొన్ని నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. బొప్పాయి పండులో ఉన్న BHA కంటెంట్ ఇతర వాటిలో ఉండే ఆల్ఫా హైడ్రాక్సిల్ యాసిడ్ తో పోలిస్తే తక్కువ చిరాకు కలిగి ఉంటుంది. చర్మం సున్నితత్వం కలవారు జాగ్రత్తగా ఉపయోగించాలి. ఎందుకంటే కొంతమందిలో బొప్పాయి అలెర్జీలకు కారణం కావచ్చు.

ఉదర సంబంధ జబ్బులను మటుమాయం చేసే బొప్పాయి: క్లిక్ చేయండి

చిట్కా 2: బొప్పాయితో స్కిన్ టోన్

సాదారణంగా కొంతమంది పిగ్మెంటేషన్ తో బాధపడుతున్నారు.డార్క్ ప్యాచేస్ చికిత్స కొరకు క్రీమ్స్ ను చర్మరోగ నిపుణుల ద్వారా కౌంటర్ లో కొనుగోలు చేయవచ్చు. అదనంగా,మేరీ క్లెయిర్ పత్రిక వారు బొప్పాయితో పిగ్మెంటేషన్,డార్క్ మచ్చల కొరకు ఒక ఫేషియల్ మాస్క్ ను ఇంటిలోనే తయారుచేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ ఫేషియల్ మాస్క్ ను సిద్ధం చేసుకోవటం సులభం మరియు చౌకగా ఉంటుంది. ఒక బొప్పాయి ఫేషియల్ మాస్క్ తయారీలో అర కప్పు పండిన బొప్పాయి గుజ్జులో కేవలం 2 టేబుల్ స్పూన్స్ తేనే కలపాలి. మీ ముఖం మీద ఈ మిశ్రమాన్ని రాసి,15-20 నిమిషాల తర్వాత వెచ్చని నీటితో శుభ్రం చేసుకొని పొడిగా తుడుచుకోవాలి. మీ పని పూర్తయిన తర్వాత మీ ముఖానికి మాయిశ్చరైజర్ రాయండి.

చిట్కా 3: బొప్పాయి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

అందాన్ని పెంచటమే కాకుండా బాహ్య చికిత్సల నుండి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కొరకు సహాయపడుతుంది. ఆరోగ్యవంతమైన ఒక వ్యక్తి శారీరకంగా మంచి చర్మం టోన్ కలిగి అద్భుతంగా ఉంటుంది. ఎనర్జీ తక్కువ ఉంటే అనారోగ్య భావన కలుగుతుంది. బొప్పాయిలో చాలా ముఖ్యమైన పోషకాలు ఉన్నందున సాధారణ ఆరోగ్యం మెరుగుపరచడానికి సహాయం చేస్తుంది. యూనివర్సిటీ మేరీల్యాండ్ మెడికల్ సెంటర్ వివరించినట్లుగా బొప్పాయిలో విటమిన్ సి సమృద్దిగా ఉన్నది. విటమిన్ సి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. అందువలన వృద్ధాప్యంనకు దోహదం చేసే ఫ్రీ రాడికల్స్ ను తగ్గిస్తుంది. అంతేకాకుండా విటమిన్ సి ఆర్థరైటిస్,గుండె వ్యాధి మరియు క్యాన్సర్ నిరోధిస్తుంది.
బొప్పాయితో బోల్డన్నీ సౌందర్య రహస్యాలు: క్లిక్ చేయండి

బొప్పాయి తరచుగా దుకాణాలలో లేక ఆరోగ్య దుకాణాల ద్వారా పొందవచ్చు. అనేక సౌందర్య ఉత్పత్తులలో ఒక మూలవస్తువుగా ఉన్నది. మీరు కూడా ఈ ఉత్పత్తులను కిరాణా దుకాణాల్లో చూడవచ్చు. కొన్ని సందర్భాలలో లగ్జరీ సమయం లేనప్పుడు అందంను సృష్టించడానికి ఈ పండును ఉపయోగించవచ్చు. మీరు అందం యొక్క నియమావళి ఫలితాలను సాధించడానికి అందుబాటులో ఉన్న దుకాణంలో కొనుగోలు చేయవచ్చు.

English summary

Papaya Beauty Tips

Papaya is a tropical fruit which has several uses. It can be eaten alone or can be mixed into salads, ice cream, smoothies and salsas. It can also be used as an ingredient of both hair and skin care products.
Desktop Bottom Promotion