For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లోపలి తొడల నల్లదనాన్ని నివారించండానికి చిట్కాలు

|

లోపలి తొడలపైనుండే నల్లదనం ఇబ్బందికరమైన విషయం. అపరిశుభ్రమనే భావనను తొడలపై ఉండే నల్లదనం కలిగిస్తుంది. మీ చర్మం ఎంత తెల్లగానున్న లోపలి తొడలపై ఉండే నల్లదనం కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది. అసౌకర్యాన్ని కలిగిస్తుంది. చిన్న చిన్న దుస్తులు ధరించేందుకు ఈ నలుపు ఆటంకంగా నిలుస్తుంది.

ఇతర వ్యక్తిగత ప్రాంతాలతో పోలిస్తే తొడలపై నున్న చర్మం నల్లగా మారడం సహజం. నల్లని మచ్చలు ఏర్పడడానికి ఎన్నో కారణాలున్నాయి. ఒబేసిటీ, తరచూ షేవింగ్ చేయడం, గాలి ఆడకపోవడం, వయసు మీదపడడం, ప్రెగ్నన్సీ, పొడి చర్మం అలాగే ఇన్సులిన్ పడకపోవడం వంటి కారణాల వల్ల లోపలి తొడలు నల్లగా మారతాయి.

సాధారణంగా ఎండలో ఎక్కువగా ఉండడం, రెండు తొడల మధ్య నడుస్తున్నప్పుడు రాపిడికి గురవడంతో చర్మంలో మెలనిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఈ కారణాల వల్ల చర్మం నల్లగా మారిపోతుంది. యుక్తవయస్సులో హార్మోన్ల సమస్యలు ఎక్కువగా ఉంటాయి. హార్మోన్ల సమస్యల వల్ల కూడా చర్మం నల్లగా మారుతుంది.

మహిళలలో, నిపుల్స్, వేజీనా, లోపలి తొడలు, సాధారణంగా మామూలు చర్మంతో పోలిస్తే కొంచెం నల్లగానే ఉంటాయి. లోపలి తొడలలోని నల్లదనాన్ని అరికట్టవచ్చు. లోపలి తొడలలోనున్న నల్లదనాన్ని కొన్ని టిప్స్ పాటించడం ద్వారా నిర్మూలించవచ్చు.

లెమన్ జ్యూస్

లెమన్ జ్యూస్

డార్క్ స్పాట్స్ కి అలాగే లోపలి తొడలలోనున్న నల్లదనాన్ని నిర్మూలించడానికి నిమ్మ రసం ఏంతో సహకరిస్తుంది. ఆలివ్ ఆయిల్ లో కలిపిన నిమ్మరసాన్ని నల్ల దనం ఉన్న ప్రభావిత ప్రాంతాల్లో అప్లై చేసి 10 నిముషాలు మసాజ్ చేయడం వల్ల కొంచెం మెరుగుదల కనిపిస్తుంది. చర్మంపై నూనెలను అప్లై చేయడం వల్ల రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది. తద్వారా చర్మం నిగనిగలాడుతూ కాంతివంతంగా తయారవుతుంది.

నువ్వులు లేదా సన్ ఫ్లవర్ ఆయిల్

నువ్వులు లేదా సన్ ఫ్లవర్ ఆయిల్

మొదటగా కొబ్బరి నూనె, నిమ్మరసంతో ఒక ప్యాక్ ను తయారుచేయండి. మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెలో నిమ్మరసాన్ని కలపండి. ఈ మిశ్రమంతో ప్రభావిత ప్రాంతం వద్ద మసాజ్ చేయండి. ఈ మిశ్రమం చర్మంలోకి ఇంకేంత వరకు మసాజ్ చేయాలి. కనీసం అయిదు నిమిషాల పాటు లోపల తొడలను ఈ విధంగా మసాజ్ చేయాలి. నువ్వుల నూనె ఆయిల్ ను లేదా సన్ ఫ్లవర్ ఆయిల్ ను ఇదే విధంగా ఉపయోగించాలి. ఆ తరువాత కచ్చితంగా సోప్ తో స్నానం చేయాలి. లోపలి తొడల నల్లదనాన్ని పోగొట్టాలంటే వేడి నీటి స్నానాన్ని పూర్తిగా అవాయిడ్ చేయాలన్న సంగతి గుర్తుంచుకోండి.

బాడీ లోషన్

బాడీ లోషన్

మార్కెట్ లో వివిధ రకాల క్రీమ్స్, బాడీ లోషన్స్ లభ్యమవుతాయి. ముఖ్యంగా, నిమ్మ,పసుపు క్రీమ్ లు మోచేయి, మోకాలు లాగే లోపలి తొడలపైనున్న నల్లదనాన్ని తొలగించడంలో ఉపయోగపడతాయి. ఆల్ఫా హైడ్రోక్సీ యాసిడ్ కలిగిన బాడీ లోషన్ ను మాత్రమే కొనుగోలు చేయాలన్న విషయాన్ని మరచిపోకండి. చర్మంపైనున్న మృతకణాలు తొలగిపోవడానికి ఆల్ఫా హైడ్రోక్సీ యాసిడ్ తోడ్పడుతుంది. తద్వారా, లోపలి తొడలపై నున్న నల్లదనం క్రమంగా తగ్గుముఖం పడుతుంది.

మిల్క్ పౌడర్

మిల్క్ పౌడర్

స్నానానికి వెళ్ళే ముందు ఒక టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్, నిమ్మ రసం, తేనెలతో హాఫ్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ ను కలపాలి. ఈ పదార్థాలను మిశ్రమంగా చేసి లోపలి తొడలపై అప్లై చేయాలి. తొడలపైనున్న నల్లదనాన్ని నిర్మూలించడంలో ఈ మిశ్రమం ప్రధాన పాత్ర పోషిస్తుంది.

యాపిల్ పళ్ళ రసం తో బేకింగ్ పౌడర్

యాపిల్ పళ్ళ రసం తో బేకింగ్ పౌడర్

లోపలి తొడలపైనున్న డార్క్ ప్యాచెస్ తొలగింపుకై యాపిల్ సైడర్ వెనిగర్ ను బేకింగ్ పౌడర్ తో కలిపి ఒక మిశ్రమంగా తయారుచేసుకోవాలి. ప్రభావిత ప్రాంతంపై ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. ఈ మిశ్రమం ఆరే వరకు అలాగే ఉంచాలి. ఒక వారం పాటు ఈ పద్దతిని పాటించాలి. లోపలి తొడల నల్లదనాన్నినిర్మూలించడానికి ఈ మిశ్రమం ఎంతో ఉపయోగకరం.

గంధం

గంధం

లోపలి తొడల నల్లదనాన్ని తగ్గించడానికి మరొక చిట్కా తెలుసుకుందాం. గంధంలో కొన్ని చుక్కల రోజ్ వాటర్ ను కలపాలి. చర్మానికి కాంతిని ప్రసాదించడంతో పాటు చర్మానికి ఉత్తేజాన్ని తిరిగి అందించడంలో రోజ్ వాటర్ ఉపయోగపడుతుంది. సహజసిద్ధంగా చర్మాన్ని తెల్లగా చేయడానికి ఈ చిట్కా ఉపయోగపడుతుంది.


Desktop Bottom Promotion